ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

GK TEST-19

1. "ద వాల్ స్ట్రీట్ జర్నల్" (THE WALL STREET JOURNAL) పత్రిక కథనం ప్రకారం ప్రపంచంలోనే తొలిసారిగా 'కరోనా (కొవిడ్-19)' సోకిన తొలి మహిళ ? (ఈమెను "పేషెంట్ జీరో" (PATIENT ZERO) గా పిలుస్తున్నారు. ఈమె ఈ మహమ్మారిపై 50 రోజులపాటు పోరాడి గెలిచారు)
(ఎ) ఇటాలికా గ్రోన్డోనా
(బి) వీ గ్లూక్సియన్
(సి) మారియా టెరీసా
(డి) సోఫీ గ్రెగొరీ

2. 'కరోనా (కొవిడ్-19)' వైరస్ నియంత్రణకు "ఏడీ 26 సార్స్-కొవ్-2" అనే ప్రయోగాత్మక టీకాను అభివృద్ధి చేసిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ? (వచ్చే ఏడాది ప్రారంభానికల్లా దీన్ని అత్యవసర వినియోగం కోసం సిద్ధం చేస్తారు)
(ఎ) రోషె (ROCHE)
(బి) జాన్సన్ అండ్ జాన్సన్  (JOHNSON & JOHNSON)
(సి) నోవార్టిస్ (NOVARTIS)
(డి) ఫైజర్ (PFIZER)

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకున్న ఎన్ని సంవత్సరాల తర్వాత బదలాయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం 2020 మార్చ్ 31 (మంగళవారం) న ఉత్తర్వులు జారీ చేసింది ?
(ఎ) 3
(బి) 4
(సి) 5
(డి) 6

4. దిల్లీ లోని నిజాముద్దీన్ లో "తబ్లీగీ జమాత్" (TABLIGHI JAMAAT) కు మతపరమైన ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారికి 'కరోనా (కొవిడ్-19)' సోకినట్లు ఏ రాష్ట్రంలో వెలుగులోకి రావడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది ? (ఇక మీదట "తబ్లీగీ జమాత్" (TABLIGHI JAMAAT) కార్యకలాపాల్లో పాల్గొనేందుకు మనదేశం వచ్చే విదేశీయులెవరికీ వీసాలు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది)
(ఎ) కర్ణాటక
(బి) ఆంధ్రప్రదేశ్
(సి) తెలంగాణ
(డి) మహారాష్ట్ర

5. మనదేశంలో "ఎన్-99" (N-99) మాస్కులు తయారు చేస్తున్న భారత ప్రభుత్వ సంస్థ ?
(ఎ) హెచ్ ఏ ఎల్ (HAL ⇒ HINDUSTAN AERONAUTICS LIMITED)
(బి) బీ డీ ఎల్ (BDL ⇒ BHARAT DYNAMICS LIMITED)
(సి) డీ ఆర్ డీ ఓ (DRDO ⇒ DEFENCE RESEARCH and DEVELOPMENT ORGANISATION)
(డి) ఇస్రో (ISRO ⇒ INDIAN SPACE RESEARCH ORGANISATION)



6. 'కరోనా (కొవిడ్-19)' వైరస్ తెచ్చిన ఆర్ధిక ఇబ్బందుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న మీడియా సంస్థలకు తోడ్పాటు అందించేందుకు 10 కోట్ల డాలర్లను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపిన సామాజిక మీడియా ?
(ఎ) ఫేస్ బుక్ (FACEBOOK)
(బి) యూట్యూబ్ (YOUTUBE)
(సి) వాట్సాప్ (WHATSAPP)
(డి) ట్విటర్ (TWITTER)

7. 'కరోనా (కొవిడ్-19)' మహమ్మారి కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిన "టోక్యో 2020 ఒలింపిక్స్" (TOKYO 2020 OLYMPICS) 2021 లో ఏయే తేదీల మధ్య నిర్వహించేందుకు 'అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC ⇒ INTERNATIONAL OLYMPIC COMMITTEE), ఆతిథ్య జపాన్' నిర్ణయించాయి ?
(ఎ) 2021 జూలై 26 - 2021 ఆగస్ట్ 11
(బి) 2021 జూలై 25 - 2021 ఆగస్ట్ 10
(సి) 2021 జూలై 24 - 2021 ఆగస్ట్ 9
(డి) 2021 జూలై 23 - 2021 ఆగస్ట్ 8

8. 'కరోనా (కొవిడ్-19)' మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో "వాట్సాప్" (WHATSAPP) తో బ్యాంకింగ్ సేవలు పొందే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చిన బ్యాంక్ ?
(ఎ) ఐ సీ ఐ సీ ఐ (ICICI)
(బి) హెచ్ డీ ఎఫ్ సీ (HDFC)
(సి) యాక్సిస్ (AXIS)
(డి) ఇండస్ ఇండ్ (INDUSIND)

9. 'కరోనా (కొవిడ్-19)' వైరస్ ఉద్ధృతి కారణంగా ఆస్పత్రుల్లో గదులు దొరకని పరిస్థితి ఏర్పడితే, ప్రత్యామ్నాయంగా హోటళ్లలోని గదులను బాధితులకు ఇచ్చేందుకు "ప్రాజెక్ట్ స్టే-ఐ" (PROJECT STAY-I) ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిన అగ్రశ్రేణి వైద్యసేవల సంస్థ ?
(ఎ) లీలావతి హాస్పిటల్స్
(బి) మేదాంత హాస్పిటల్స్
(సి) కోకిలా బెన్ హాస్పిటల్స్
(డి) అపోలో హాస్పిటల్స్

10. "జాతీయ మహిళా కమిషన్" (NCW ⇒ NATIONAL COMMISSION for WOMEN) ప్రస్తుత అధ్యక్షురాలు ?
(ఎ) మినాల్ దాఖవా భోస్లే
(బి) సుధా మూర్తి
(సి) ఆర్. భానుమతి
(డి) రేఖా శర్మ              



కీ (GK TEST-19 DATE : 2020 APRIL 3)
1) బి 2) బి 3) సి 4) సి 5) సి 6) ఎ 7) డి 8) ఎ 9) డి 10) డి 

All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి