ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

GK TEST-29

1. 2020 మార్చ్ 26 న కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రకటించిన "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" (PRADHAN MANTRI GARIB KALYAN YOJANA - PMGKY) ప్యాకేజీ ప్రకారం 100 మంది వరకు పనిచేస్తున్న సంస్థల్లో 90% మంది ఉద్యోగులు నెలకు రూ. 15 వేల లోపు వేతనాలు పొందుతున్నట్లయితే వారికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ (PF ⇒ PROVIDENT FUND) ను మూడు నెలలపాటు కేంద్రమే చెల్లిస్తుంది. ఈ విధంగా ఒక్కో నెలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా జమయ్యే శాతం ? (దీని వల్ల 80 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది)
(ఎ) 12%
(బి) 24%
(సి) 36%
(డి) 72%

2. కలరా (CHOLERA) వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన శతాబ్ధం ?
(ఎ) 17 వ శతాబ్ధం
(బి) 18 వ శతాబ్ధం
(సి) 19 వ శతాబ్ధం
(డి) 20 వ శతాబ్ధం

3. 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ప్రజలు చనిపోవడానికి కారణమైన "జస్టీనియన్ ప్లేగ్" (PLAGUE OF JUSTINIAN) ప్రబలిన సంవత్సరం ?
(ఎ) క్రీ.శ. 540 - క్రీ.శ. 541
(బి) క్రీ.శ. 541 - క్రీ.శ. 542
(సి) క్రీ.శ. 542 - క్రీ.శ. 543
(డి) క్రీ.శ. 543 - క్రీ.శ. 544

4. 2020 ఏప్రిల్ 10 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ (ORDINANCE) ప్రకారం 'రాష్ట్ర ఎన్నికల కమిషనర్' (SEC ⇒ STATE ELECTION COMMISSIONER) గా నియమింపబడే వ్యక్తి మొత్తమ్మీద ఎన్ని సంవత్సరాలకు మించి ఆ పదవిలో ఉండేందుకు వీలు లేదు ?
(ఎ) ఒక సంవత్సరం
(బి) మూడు సంవత్సరాలు
(సి) ఐదు సంవత్సరాలు
(డి) ఆరు సంవత్సరాలు

5. వర్ధమాన దేశాలకు మౌలిక వసతుల నిర్మాణంలో పెట్టుబడుల కొరతను తీర్చడానికి చైనా ప్రారంభించిన పథకం ?
(ఎ) బీ ఆర్ ఐ (BRI)
(బి) బీ డీ ఎన్ (BDN)
(సి) సిపెక్ (CPEC)
(డి) ఏ ఏ జీ సీ (AAGC)



6. 'కొవిడ్-19' (COVID-19 (Corona Virus Disease-2019)) వ్యాధి కి సంబంధించి ప్రస్తుతం మానవ ప్రయోగాల దశలో ఉన్న "టీకా" (VACCINE) ?
(ఎ) బీ ఎన్ టీ 162 (BNT 162)
(బి) ఎం ఆర్ ఎన్ ఏ - 1273 (MRNA-1273)
(సి) కరోఫ్లూ (COROFLU)
(డి) స్ట్రెయిన్ (STRAIN)

7. మనదేశంలో భవిష్యత్తులో ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణం చేయడానికి "ఈ-పాస్" (E-PASS) గా అనుమతించే అవకాశం ఉన్న 'యాప్' (APP) ?
(ఎ) నిఘా (NIGHA)
(బి) ఆరోగ్య సేతు (AAROGYA SETU)
(సి) పానిక్ మెకానిక్ (PANIC MECHANIC)
(డి) యుక్తి (YIKTI)

8. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్ళకు కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 10 న జారీ చేసిన జీవో (GO) నంబర్ ?
(ఎ) 617
(బి) 618
(సి) 619
(డి) 620

9. 1901 లో వైద్య శాస్త్రంలో తొలి నోబెల్ (FIRST NOBLE PRIZE) పొందిన 'ఫిజియాలజిస్ట్' (PHISIOLOGIST) "ఎమిల్ వోన్ బెహ్రింగ్" (EMIL VON BEHRING) ఏ దేశస్థుడు ?
(ఎ) అమెరికా
(బి) ఇటలీ
(సి) బ్రిటన్
(డి) జర్మనీ

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'కరోనా' (CORONA) పాజిటివ్ కేసుల నమోదు ఆధారంగా మండలాలను "రెడ్, ఆరెంజ్, గ్రీన్" జోన్లు గా విభజించారు. వీటిలో "ఆరెంజ్" జోన్ కు గల ప్రామాణికం ?
(ఎ) మండలంలో ఒకే పాజిటివ్ కేసు ఉండటం
(బి) మండలంలో రెండు పాజిటివ్ కేసులు ఉండటం
(సి) మండలంలో మూడు పాజిటివ్ కేసులు ఉండటం
(డి) మండలంలో నాలుగు పాజిటివ్ కేసులు ఉండటం



కీ (GK TEST-29 DATE : 2020 APRIL 17)
1) బి 2) సి 3) బి 4) డి 5) ఎ 6) బి 7) బి 8) ఎ 9) డి 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి