"ఆరోగ్య సేతు" యాప్
(AROGYA SETU) - APP
- 'కరోనా' (CORONA) వైరస్ సోకే ముప్పును అంచనా వేసుకోవడంలో ప్రజలకు సహకరించేందుకు, 'కరోనా' (CORONA) సోకిన రోగికి దగ్గరగా వచ్చిన సందర్భంలో అధికారులను అప్రమత్తం చేసే మొబైల్ యాప్ (MOBILE APP) "ఆరోగ్య సేతు" (AAROGYA SETU) ను కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 2 న లాంఛనంగా ఆవిష్కరించింది.
- "ఆరోగ్య సేతు" (AAROGYA SETU) యాప్ కొత్త కేసులను గుర్తిస్తుంది మరియు 'కరోనా' (CORONA) సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్న వారికి అప్రమత్తత సందేశాలు పంపిస్తుంది.
- 'కరోనా' (CORONA) వైరస్ బారిన పడే ముప్పు తమకు ఎంత ఉందనే విషయాన్ని ఈ "ఆరోగ్య సేతు" (AAROGYA SETU) యాప్ ద్వారా ప్రజలు తెలుసుకోవచ్చు.
- ఇతరులతో కలిసే సందర్భాలను బట్టి వారు వైరస్ బారినపడే ముప్పును "ఆరోగ్య సేతు" (AAROGYA SETU) యాప్ గణిస్తుంది. "అత్యాధునిక బ్లూటూత్ టెక్నాలజీ (Bluetooth Technology), ఆల్గారిథమ్స్ (Algorithms), కృత్రిమ మేధ" (AI ⇒ ARTIFICIAL INTELLIGENCE) ల ఆధారంగా ఇది సాధ్యమవుతుంది.
- ఒక వ్యక్తికి పరీక్షలు నిర్వహించాక 'కొవిడ్-19' (COVID-19 (Corona Virus Disease-2019)) బారిన పడినట్లు తేలితే ... వెంటనే అతని వివరాలతోపాటు మొబైల్ నెంబర్ ను, ఆరోగ్య మంత్రిత్వ శాఖ రికార్డులతో సహా "ఆరోగ్య సేతు" (AAROGYA SETU) యాప్ లో నమోదు చేస్తారు.
- 'ఆండ్రాయిడ్ (ANDROID), ఐఓఎస్ (IOS)' వినియోగదారులకూ "ఆరోగ్య సేతు" (AAROGYA SETU) యాప్ అందుబాటులో ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి