ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, మార్చి 2020, ఆదివారం

PM-CARES (PRIME MINISTER'S CITIZEN ASSISTANCE and RELIEF in EMERGENCY SITUATIONS)

"పీ ఎం - కేర్స్" ఫండ్

PM-CARES (PRIME MINISTER'S CITIZEN ASSISTANCE and RELIEF in EMERGENCY SITUATIONS) Fund


  • 'కరోనా (కొవిడ్-19)' వైరస్ పై భారత్ చేస్తున్న పోరులో ప్రజలను భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేసే పౌరుల సౌకర్యార్ధం 'అత్యవసర నిధి' ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు "పీఎం - కేర్స్" [ PM-CARES (PRIME MINISTER'S CITIZEN ASSISTANCE and RELIEF in EMERGENCY SITUATIONS)] ఫండ్ ను ప్రధాన మంత్రి 'నరేంద్ర మోదీ' 2020 మార్చ్ 28 (శనివారం) న ప్రకటించారు.
  • కొవిడ్-19 (COVID-19 (Corona Virus Disease - 2019)) పై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి సహకరించేందుకు ఉడతాభక్తిగా విరాళాలు అందజేస్తామని అన్ని వర్గాల ప్రజల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ నిధి (PM-CARES) ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
  • ఒకవేళ భవిష్యత్తులో ఇటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తితే ఆదుకునేందుకూ ఈ నిధి (PM-CARES) ఉపయోగపడుతుంది.
  • విరాళాలు ఇవ్వాలనుకునే పౌరులు ... www.pmindia.gov.inhttps://www.pmindia.gov.in/en/ ను సందర్శించి "పీఎం - కేర్స్" (PM-CARES) బటన్ ను క్లిక్ చేసి విరాళాలు అందజేయవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి