ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, మార్చి 2020, శనివారం

GK TEST-15

1. 'కరోనా' (కొవిడ్-19) వ్యాధి ఉద్ధృతి కారణంగా 'టోక్యో 2020 ఒలింపిక్స్' (TOKYO 2020 OLYMPICS) ను ఎన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు "అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం" (IOC ⇒ INTERNATIONAL OLYMPIC COMMITTEE) 2020 మార్చ్ 24 న ప్రకటించింది ? (షెడ్యూల్ ప్రకారం 2020 జులై 24 న క్రీడలు ఆరంభం కావాల్సింది)
(ఎ) మూడు నెలలు
(బి) ఆరు నెలలు
(సి) ఏడాది
(డి) రెండేళ్లు

2. 'కరోనా' (కొవిడ్-19) తాకిడితో దెబ్బతిన్న దేశ ఆర్ధిక రంగానికి రూ. 2.9 లక్షల కోట్ల ప్యాకేజీ ని ప్రకటించిన దేశం ? (నిరుద్యోగ భృతి ని రెట్టింపు చేసారు)
(ఎ) అమెరికా
(బి) చైనా
(సి) ఇటలీ
(డి) ఆస్ట్రేలియా

3. ప్రస్తుత సంక్షోభ సమయంలో "సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు" (MSME ⇒ MICRO, SMALL & MEDIUM ENTERPRISES) పై దివాలా ప్రక్రియ విధించే అవకాశాలను తగ్గించేందుకోసం 'ఎగవేత' (DEFAULT) పరిమితిని రూ. 1 లక్ష నుంచి ఎంతకు పెంచారు ?
(ఎ) రూ. 50 లక్షలు
(బి) రూ. కోటి
(సి) రూ. 1.50 కోట్లు
(డి) రూ. 1.75 కోట్లు

4. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల కారణంగా "ఒలింపిక్ క్రీడలు" (OLYMPIC GAMES) ఎన్నిసార్లు పూర్తిగా రద్దు చేసారు ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4

5. "ఒలింపిక్స్ 2020" ఆతిథ్య నగరంగా 'టోక్యో' (TOKYO) ఏ సంవత్సరంలో ఎంపికైంది ?
(ఎ) 2016
(బి) 2015
(సి) 2014
(డి) 2013



6. 'కరోనా' (కొవిడ్-19) మహమ్మారి కారణంగా "టోక్యో 2020 ఒలింపిక్స్" (TOKYO 2020 OLYMPICS) విశ్వ క్రీడలు 2021 వ సంవత్సరానికి వాయిదా పడ్డాయి. శాంతి నెలకొన్న సమయం (యుద్ధం లేనప్పుడు) లో 'ఒలింపిక్స్' ను వాయిదా వేయడం ఇది ఎన్నవసారి ?
(ఎ) తొలిసారి
(బి) రెండవసారి
(సి) మూడవసారి
(డి) నాలుగవసారి

7. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన "నూతన రక్తదాన నిబంధనలు" (BLOOD DONATION RULES-NEW) ప్రకారం తొలిసారి రక్తదానం చేసే వ్యక్తి వయస్సు ఎన్ని సంవత్సరాలకు మించకూడదు ?
(ఎ) 60
(బి) 65
(సి) 70
(డి) 75

8. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన "నూతన రక్తదాన నిబంధనలు" (BLOOD DONATION RULES-NEW) ప్రకారం విదేశీయులు వరుసగా ఎన్ని సంవత్సరాలు భారత్ లో ఉంటేనే వారి నుంచి రక్తం దానంగా స్వీకరించాలి ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4

9. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ⇒ WORLD HEALTH ORGANIZATION) ప్రకటన ప్రకారం 'కరోనా (కొవిడ్-19)' వైరస్ సోకిన వారి సంఖ్య తొలి లక్షను చేరుకునేందుకు 67 రోజులు పట్టగా తర్వాతి లక్షను చేరుకునేందుకు పట్టిన సమయం ?
(ఎ) 9 రోజులు
(బి) 10 రోజులు
(సి) 11 రోజులు
(డి) 12 రోజులు

10. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల్లో తొలి 'కరోనా (కొవిడ్-19)' కేసు నమోదైన రాష్ట్రం ?
(ఎ) మణిపూర్
(బి) మేఘాలయ
(సి) త్రిపుర
(డి) మిజోరాం              



కీ (GK TEST-15 DATE : 2020 MARCH 28)
1) సి 2) డి 3) బి 4) సి 5) డి 6) ఎ 7) ఎ 8) సి 9) సి 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి