భారతదేశం-కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ-నూతన రక్తదాన నిబంధనలు
(INDIA-MINISTRY OF HEALTH & FAMILY WELFARE-BLOOD DONATION RULES-NEW)
- ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులను "బ్లడ్ సెంటర్స్" (BLOOD CENTRES) గా పిలుస్తున్నందున మనదేశంలోనూ బ్లడ్ బ్యాంకు లను "బ్లడ్ సెంటర్స్" (BLOOD CENTRES) గా పిలవాలని పేర్కొంటూ 'డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్' నిబంధనలను సవరిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
- రక్త దాతలకు కనిష్ఠంగా 18 ఏళ్ళు, గరిష్ఠంగా 65 ఏళ్ళు ఉండాలి.
- తొలిసారి రక్తదానం చేసే వ్యక్తి వయస్సు 60 ఏళ్లకు మించకూడదు.
- పదే పదే రక్తదానం చేసే వ్యక్తుల వయస్సు 65 ఏళ్లకు మించకూడదు.
- విదేశీయులు వరుసగా మూడేళ్లు భారత్ లో ఉంటేనే వారి నుంచి రక్తం దానంగా స్వీకరించాలి.
- పళ్లు పీకించుకున్నవారు 6 నెలల తర్వాతే రక్తదానం చేయాలి.
- మహిళలు కాన్పు తర్వాత 12 నెలల పాటు రక్తదానం చేయకూడదు.
- మహిళలు అబార్షన్ తర్వాత 6 నెలల పాటు రక్తదానం చేయకూడదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి