ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, మే 2020, మంగళవారం

DIRECTED ENERGY WEAPONS (DEW)

డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ (డీ ఈ డబ్ల్యు)

(DIRECTED ENERGY WEAPONS (DEW))


  • రసాయన లేదా విద్యుత్ శక్తిని రేడియేటెడ్ శక్తిగా మలచి ... దాన్ని ఒక లక్ష్యంపైకి కేంద్రీకరించే వ్యవస్థలను "డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్" (DEW) గా పేర్కొంటారు.


MANA PAALANA - MEE SOOCHANA

మన పాలన - మీ సూచన

(MANA PAALANA - MEE SOOCHANA)


  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా 'ఏడాదిలో ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలు' పై 2020 మే 25 నుంచి 2020 మే 29 వరకు "మన పాలన - మీ సూచన" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రణాళికా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి విజయకుమార్ తెలిపారు.
  • ప్రజల ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్లాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.
  • ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై నేరుగా లబ్దిదారులతోపాటు ముఖ్య నేతలు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  • ప్రతీరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు సమీక్ష ఉంటుంది.
  • అనంతరం ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుని వాటిని క్రోడీకరించి లక్ష్యాలు రూపొందిస్తారు.

'మన పాలన - మీ సూచన' కార్యక్రమ వివరాలు :


తేదీకార్యక్రమం
2020 మే 25పరిపాలనా సంస్కరణలు, సంక్షేమం
2020 మే 26వ్యవసాయం, అనుబంధ రంగాలు
2020 మే 27విద్యారంగ సంస్కరణలు, పథకాలు
2020 మే 28పరిశ్రమలు, పెట్టుబడుల రంగం
2020 మే 29ఆరోగ్య రంగం, సంస్కరణలు, ఆరోగ్యశ్రీ




ReSTART PACKAGE

"రీస్టార్ట్" ప్యాకేజీ

("ReSTART" PACKAGE) 


  • 'కరోనా' (CORONA) నేపథ్యంలో, లాక్ డౌన్ కారణంగా మూతపడిన 'సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు' (MSME ⇒ MICRO, SMALL and MEDIUM ENTERPRISES) ను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,110 కోట్లతో "రీస్టార్ట్" (ReSTART) ప్యాకేజీని ప్రకటించింది.
  • 2020 మే 22 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో "రీస్టార్ట్" (ReSTART) ప్యాకేజీని ప్రారంభించారు.

 "రీస్టార్ట్" (ReSTART) ప్యాకేజీ పథకం ప్రయోజనాలు :

  1. MSME ల బలోపేతానికి, గత ప్రభుత్వం పెట్టిన రూ. 827.5 కోట్ల బకాయిలతో సహా మొత్తం రూ. 904.80 కోట్ల మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదల.
  2. లాక్ డౌన్ కాలంలో 3 మాసాల విద్యుత్ బిల్లులపై రూ. 187.80 కోట్ల మేరకు స్థిర విద్యుత్ చార్జీల మాఫీ.
  3. నిర్వహణ మూలధన రుణాలకు రూ. 200 కోట్లతో 'నిధి' (CORPUS FUND) ఏర్పాటు. 6% నుండి 8% వరకు వడ్డీకి రూ. 2 - 10 లక్షల వరకు రుణాలు అందిస్తారు. దీనిపై ఆరు నెలలు మారటోరియం ఉంటుంది. తర్వాత మూడేళ్లలో రుణం చెల్లించవచ్చు.
  4. MSME లకు 'టెండర్ సెట్ల ఫీజు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD ⇒ EARNEST MONEY DEPOSIT), కనీస టర్నోవర్' నిబంధనల నుండి మినహాయింపు.
  5. ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసే వస్తు సేవల్లో కనీసం 25% MSME ల నుండి కొనుగోలు చేయాలి. అందులో 4% ఎస్సీ, ఎస్టీ యాజమాన్యాలు నిర్వహిస్తున్న సంస్థల నుండి, 3% మహిళా యాజమాన్యాలు నిర్వహిస్తున్న సంస్థల నుండి కొనుగోలు.
  6. MSME ల నుండి వివిధ ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసిన వస్తు సేవలకు 45 రోజుల్లోగా చెల్లింపులు.
  7. 2020 ఫిబ్రవరి 29 నాటికి ప్రామాణిక ఖాతాలు నిర్వహిస్తున్న MSME లకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 'అదనపు నిర్వహణ మూలధనం పరిమితి 20% పెంపు.
  8. రుణ ఒత్తిడిలో ఉన్న MSME లకు వాటి ఈక్విటీ లో 15% కు సమానంగా గరిష్ఠంగా రూ. 75 లక్షల వరకు బ్యాంకు రుణాల మంజూరు.
  9. రాష్ట్రంలో మొత్తం లక్ష వరకు ఉన్న MSME ల ద్వారా దాదాపు 10 లక్షల మందికి ఉపాధి.
  • పై ప్రయోజనాలను పొందడానికి ఆన్ లైన్ పోర్టల్ http://www.apindustries.gov.in/restart-package లో పరిశ్రమల శాఖ డైరెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలి.

సహాయం కొరకు :

  1. హెల్ప్ డెస్క్ నంబర్ : 0866 - 2530665 (సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు)
  2. e-mail id : singledesk-inds@ap.gov.in

HOI APP

హెచ్ ఓ ఐ - యాప్

(HOI - APP)


  • దిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో 'జీఎంఆర్' (GMR GROUP) సంస్థ "HOI" యాప్ ద్వారా భోజనం అందిస్తుంది.
  • ప్రయాణీకులు ఈ యాప్ ద్వారా అక్కడి అవుట్లెట్లను (OUTLETS) ఎంచుకుని ఆహారాన్ని ఆర్డర్ చేయొచ్చు.
  • ఆర్డర్ సిద్ధమైన వెంటనే వినియోగదారుడికి మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్ వస్తుంది. ఆన్ లైన్ లో డబ్బు చెల్లించి దాన్ని తీసుకోవచ్చు.
  • విమానాశ్రయ కార్యకలాపాల వివరాలన్నీ ఈ "HOI" యాప్ ద్వారా ప్రయాణీకులు తెలుసుకోవచ్చు.
  • రియల్ టైమ్ ఫ్లైట్ స్టేటస్ అలర్ట్స్, బోర్డింగ్ గేట్ ఇన్ఫర్మేషన్, తాము చేరుకోబోయే గమ్యస్థానంలో వాతావరణ పరిస్థితులన్నీ ఈ "HOI" యాప్ లో ఉంటాయి.

GK TEST-51

1. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ఆరోగ్య సేతు" (AAROGYA SETU) యాప్ కు చట్టబద్ధత లేదని పేర్కొన్న సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి ?
(ఎ) జస్టిస్ ప్రకాష్ శ్రీ వాస్తవ
(బి) జస్టిస్ శ్రీకృష్ణ
(సి) జస్టిస్ మదన్ బి.లోకూర్
(డి) జస్టిస్ టి.ఎస్.ఠాకూర్

2. సిక్కిం రాష్ట్రంలో తొలి 'కొవిడ్' కేసు ఎప్పుడు నమోదైంది ?
(ఎ) 2020 మే 21
(బి) 2020 మే 22
(సి) 2020 మే 23
(డి) 2020 మే 24

3. విశాఖపట్నం సమీపంలోని 'ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన దుర్ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "ఉన్నతస్థాయి కమిటీ" (HIGH POWER COMMITTEE) ని నియమించింది. ఏ జీవో ద్వారా ఈ కమిటీ ని నియమించడం జరిగింది ?
(ఎ) జీవో ఆర్ టి నంబర్ : 803
(బి) జీవో ఆర్ టి నంబర్ : 623
(సి) జీవో ఆర్ టి నంబర్ : 18
(డి) జీవో ఆర్ టి నంబర్ : 2930

4. 'కరోనా' (CORONA) విపత్తు సమసిపోయే వరకూ లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ "వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా పాల్గొనే విచారణల్లో న్యాయవాదులు సంప్రదాయ నలుపు రంగు కోట్లు, గౌన్లను ధరించనవసరం లేదు" అని సుప్రీంకోర్ట్ ప్రకటన జారీ చేసిన తేదీ ?
(ఎ) 2020 మే 12
(బి) 2020 మే 13
(సి) 2020 మే 14
(డి) 2020 మే 15

5. 2020 మే 22 న జరిగిన 'ఆర్బీఐ' (RBI) పరపతి విధాన కమిటీ (MPC ⇒ MONETARY POLICY COMMITTEE) సమావేశంలో "రెపో" (REPO ⇒ REPURCHASE AGREEMENT) రేటును 40 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం ఉన్న 'రెపో' రేట్ ? (2000 సంవత్సరం తర్వాత 'రెపో' రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి)
(ఎ) 1%
(బి) 2%
(సి) 3%
(డి) 4%



6. 2020 మే 22 న జరిగిన 'ఆర్బీఐ' (RBI) పరపతి విధాన కమిటీ (MPC ⇒ MONETARY POLICY COMMITTEE) సమావేశంలో "రివర్స్ రెపో" రేటును 3.75% నుంచి ఎంత శాతానికి తగ్గించారు ?
(ఎ) 3.45%
(బి) 3.35%
(సి) 3.65%
(డి) 3.55%

7. కార్పొరేట్లకు ప్రస్తుత అర్హతగా ఉన్న మూలధనంపై 25% రుణ పరిమితిని 'ఆర్బీఐ' (RBI) ఎంత శాతానికి పెంచింది ? (అంటే పెద్ద కంపెనీలు బ్యాంకుల నుంచి మరిన్ని రుణాలను తీసుకోవడానికి వీలవుతుంది)
(ఎ) 30%
(బి) 35%
(సి) 40%
(డి) 45%

8. 'కొవిడ్-19' (COVID-19) ప్రభావంతో ఆదాయం తగ్గిన / కోల్పోయిన రుణగ్రహీతలకు "రుణ వాయిదా" (EMI ⇒ EQUATED MONTHLY INSTALLMENT) లపై 2020 మే 31 వరకు ఉన్న మారటోరియం ను 'ఆర్బీఐ' (RBI) ఎప్పటివరకు పొడిగించింది ?
(ఎ) 2020 జూన్ 30
(బి) 2020 జూలై 31
(సి) 2020 ఆగస్ట్ 31
(డి) 2020 సెప్టెంబర్ 30

9. 2020 జూలై 31 లోగా కంపెనీలు చేసుకునే దిగుమతులకు చెల్లింపుల గడువును 6 నెలల నుంచి ఎన్ని నెలలకు 'ఆర్బీఐ' (RBI) పొడిగించింది ? (ఈ సందర్భంగా 'ఎగ్జిమ్ బ్యాంకు' (Exim Bank ⇒ Export-Import Bank) కు రూ. 15,000 కోట్ల రుణ సహాయాన్ని అందించనున్నట్లు 'ఆర్బీఐ' (RBI) ప్రకటించింది)
(ఎ) 9 నెలలు
(బి) 12 నెలలు
(సి) 15 నెలలు
(డి) 18 నెలలు

10. భారత సైనిక బడ్జెట్ కన్నా చైనా రక్షణ బడ్జెట్ ఎన్ని రెట్లు అధికం ? (ఈ సంవత్సరం చైనా 179 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 13.59 లక్షల కోట్లు) 'రక్షణ పద్దు' కింద కేటాయించింది)
(ఎ) రెండు రెట్లు
(బి) మూడు రెట్లు
(సి) నాలుగు రెట్లు
(డి) ఐదు రెట్లు              



కీ (GK TEST-51 DATE : 2020 MAY 26)
1) బి 2) డి 3) ఎ 4) బి 5) డి 6) బి 7) ఎ 8) సి 9) బి 10) బి

All the best by www.gkbitsintelugu.blogspot.com

24, మే 2020, ఆదివారం

GK TEST-50

1. ఏ సంవత్సరం నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ "తాగునీటి కనెక్షన్" (కుళాయి కనెక్షన్) జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
(ఎ) 2022
(బి) 2023
(సి) 2024
(డి) 2025

2. భూగోళం పై జీవ వైవిధ్యం ప్రాముఖ్యం, అది ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కలిగించడానికి 'ఐక్యరాజ్యసమితి' (UNITED NATIONS) మే 22 న "అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం" నకు నాంది పలికిన సంవత్సరం ?
(ఎ) 2005
(బి) 2010
(సి) 2015
(డి) 2020

3. 2020 మే 25 (సోమవారం) న పునఃప్రారంభమవుతున్న దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణ సమయాన్ని బట్టి టికెట్ ధరలపై నియంత్రణ అమలు చేస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి 'హర్ దీప్ సింగ్ పురి' 2020 మే 21 న తెలిపారు. ప్రయాణ సమయం ఆధారంగా 7 విభాగాలుగా విభజించారు. ఈ ప్రయాణాలకు సంబంధించిన కనిష్ఠ - గరిష్ఠ ఛార్జీలు ? (2020 ఆగస్ట్ 24 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి)
(ఎ) రూ. 1,000 - రూ. 17,600
(బి) రూ. 2,000 - రూ. 18,600
(సి) రూ. 3,000 - రూ. 19,600
(డి) రూ. 4,000 - రూ. 20,600

4. 2020 మే 25 న పునఃప్రారంభమవుతున్న దేశీయ విమాన సర్వీసుల్లో ప్రతి విమానంలో ఎంత శాతం సీట్లను కనిష్ఠ, గరిష్ఠ చార్జీల మధ్యస్థ ధరకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది ?
(ఎ) 50%
(బి) 30%
(సి) 20%
(డి) 40%



5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'లాక్ డౌన్' లో సడలింపులతో "ఆర్టీసీ" (RTC) సేవలు ఏ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ?
(ఎ) 2020 మే 21
(బి) 2020 మే 22
(సి) 2020 మే 23
(డి) 2020 మే 24

6. ప్రధాని ఆధ్వర్యంలోని "పీఎం-కేర్స్" (PM-CARES) నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు సంబంధించి 'ఏఐసీసీ' (AICC) అధ్యక్షురాలు 'సోనియా గాంధీ' పై ఏ రాష్ట్రంలో కేసు నమోదైంది ?
(ఎ) గుజరాత్
(బి) మహారాష్ట్ర
(సి) కర్ణాటక
(డి) కేరళ

7. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అత్యంత తీవ్రస్థాయి తుఫాను "అంపన్" (AMPHAN) 2020 మే 21 న గంటకు 190 కి.మీ. వేగంతో 'దిఘా' వద్ద తీరాన్ని దాటింది. "దిఘా" ఏ రాష్ట్రంలో ఉంది ?
(ఎ) అసోం
(బి) పశ్చిమ బెంగాల్
(సి) ఒడిశా
(డి) తమిళనాడు

8. ముగ్గురు 'కరోనా' (CORONA) బాధితులకు వారి నివాసాల్లోనే (HOME ISOLATION) ఉంటూ చికిత్స పొందే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అధికారులు కల్పించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ అవకాశాన్ని ఏ నగరంలోని బాధితులకు కల్పించారు ?
(ఎ) కాకినాడ
(బి) విశాఖపట్నం
(సి) విజయవాడ
(డి) రాజమహేంద్రవరం

9. 'ఆర్బీఐ' (RBI) కి చెందిన "పరపతి విధాన కమిటీ" (MPC ⇒ MONETARY POLICY COMMITTEE) లోని మొత్తం సభ్యుల సంఖ్య ?
(ఎ) 5
(బి) 6
(సి) 7
(డి) 8



10. 2020 మే 22 నాటికి మనదేశంలో ఒక్క 'కరోనా' (CORONA) మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు ?
(ఎ) 16
(బి) 17
(సి) 18
(డి) 19           

కీ (GK TEST-50 DATE : 2020 MAY 24)
1) సి 2) బి 3) బి 4) డి 5) ఎ 6) సి 7) బి 8) డి 9) బి 10) డి

All the best by www.gkbitsintelugu.blogspot.com

GK TEST-49


1. బీటెక్ (B.TECH) లో నైపుణ్యాలు పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ప్రకారం ... ప్రస్తుతం చివరి సెమిస్టర్ లో "ఆరు నెలల ఇంటర్న్షిప్" ఉండగా, దీన్ని ఎన్ని నెలలకు పెంచనున్నారు ?
(ఎ) 7 నెలలు
(బి) 8 నెలలు
(సి) 9 నెలలు
(డి) 10 నెలలు

2. విశాఖపట్నం 'ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' పరిశ్రమ నుంచి "స్టైరీన్" వాయువు ఆవిర్లు లీకైన ఘటనకు సంబంధించి, ఆసుపత్రిలో చికిత్స పొందిన మొత్తం 321 మంది బాధితులలో ప్రతి ఒక్కరికీ ఎంత మొత్తం చొప్పున పరిహారం ఇచ్చారు ?
(ఎ) రూ. 10 వేలు
(బి) రూ. 25 వేలు
(సి) రూ. 50 వేలు
(డి) రూ. లక్ష

3. 'సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు' (MSME ⇒ MICRO, SMALL and MEDIUM ENTERPRISES) బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు సంబంధించిన "వాయిదా, వడ్డీ" లపై మారటోరియం ను మూడు నెలల నుంచి ఎన్ని నెలలకు పెంచారు ?
(ఎ) 6 నెలలు
(బి) 9 నెలలు
(సి) 12 నెలలు
(డి) 15 నెలలు

4. 'కొవిడ్-19' (COVID-19) బాధితులకు సరైన చికిత్స అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో 'అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ' (USFDA) నుంచి "అత్యవసర వినియోగానికి అనుమతి" (EUA ⇒ EMERGENCY USE AUTHORISATION) లభించిన ఔషధం ?
(ఎ) హైడ్రాక్సీ క్లోరోక్విన్
(బి) అజిత్రో మైసిన్
(సి) ఒసెల్టా మివిర్
(డి) రెమ్డిసివిర్



5. 'రాజ్యసభ' తొలి సమావేశాలు జరిగి 2020 మే 13 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి ?
(ఎ) 66
(బి) 67
(సి) 68
(డి) 69

6. 'కొవిడ్-19' (COVID-19) వ్యాప్తి నివారణ నిమిత్తం 'బ్రిక్స్' (BRICS) దేశాలకు చెందిన "న్యూ డెవలప్మెంట్ బ్యాంక్" (NEW DEVELOPMENT BANK) మన దేశానికి విడుదల చేసిన రుణం విలువ ?
(ఎ) 1 బిలియన్ అమెరికన్ డాలర్లు
(బి) 2 బిలియన్ అమెరికన్ డాలర్లు
(సి) 3 బిలియన్ అమెరికన్ డాలర్లు
(డి) 4 బిలియన్ అమెరికన్ డాలర్లు

7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత లోకాయుక్త ? (లోకాయుక్త కు హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తితో సమాన హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020 మే 13 న ఉత్తర్వులు జారీ చేసింది)
(ఎ) జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి
(బి) జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి
(సి) జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి
(డి) జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి

8. "ఇంటర్మీడియట్" లో ఒక సెక్షన్ కు ఎంతమంది విద్యార్థులనే పరిమితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? (కనీసం 4 సెక్షన్లు, గరిష్ఠంగా 9 సెక్షన్ల వరకు అనుమతి ఇవ్వనున్నారు. వీటిల్లో తప్పనిసరిగా "కామర్స్, ఆర్ట్స్" సెక్షన్లు ఉండాలి)
(ఎ) 88
(బి) 40
(సి) 80
(డి) 44

9. 'కొవిడ్-19' (COVID-19) సంక్షోభంతో కుదేలైన తమ దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుజ్జీవం కలిగించడం కోసం దేశ 'స్థూల దేశీయోత్పత్తి' లో 21% తో సమానమైన ప్యాకేజీ ని ప్రకటించిన దేశం ? (ప్రస్తుతానికి ప్రపంచంలో ఇదే అత్యధిక శాతం)
(ఎ) చైనా
(బి) భారత్
(సి) జపాన్
(డి) అమెరికా



10. బ్యాంకు నుంచి రూ. 3 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతు సంబంధిత తేదీ నుంచి ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే దానిపై ఎంత శాతం వడ్డీ ని రాయితీ గా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ?
(ఎ) 2%
(బి) 3%
(సి) 4%
(డి) 5%            

కీ (GK TEST-49 DATE : 2020 MAY 24)
1) డి 2) డి 3) సి 4) డి 5) సి 6) ఎ 7) సి 8) బి 9) సి 10) డి

All the best by www.gkbitsintelugu.blogspot.com

19, మే 2020, మంగళవారం

ATMANIRBHAR BHARAT - 3RD TRANCHE

ఆత్మ నిర్భర్ భారత్ - మూడో విడత

(ATMANIRBHAR BHARAT - 3RD TRANCHE)


  • 'కరోనా' (CORONA) ను జయించడంతోపాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం మన లక్ష్యం కావాలని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 మే 12 న "రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ" ని ప్రకటించారు. దీనిలో భాగంగా భారత ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2020 మే 15 న "ఆత్మ నిర్భర్ భారత్" - మూడో విడత (రూ. 1,63,343 కోట్లు) ను ప్రకటించారు.
  • ఆత్మ నిర్భర్ భారత్ పథకం మూడో విడతలో భాగంగా " వ్యవసాయం, దాని అనుబంధ రంగాల బలోపేతం కోసం" పలు పథకాలను ప్రకటించారు.

'ఆత్మ నిర్భర్ భారత్' - మూడో విడతలో మొత్తం 11 అంశాలు ఉన్నాయి :


వ.సంవివిధ రంగాల వివరాలుఅంశాలు
1మౌలిక వసతుల కల్పనకు సంబంధించినవి8
2చట్ట సవరణలకు సంబంధించినవి3

1. వ్యవసాయ మౌలిక వసతుల కల్పన నిధి (రూ. 1,00,000 కోట్లు)

  • ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయ పరిశ్రమలు, స్టార్ట్ అప్ ల ద్వారా గిడ్డంగులు, పంటల శుద్ధి వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి రూ. లక్ష కోట్లతో "వ్యవసాయ మౌలిక వసతుల కల్పన నిధి" ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
  • ప్రస్తుతం రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసి, వాటికి విలువను జోడించి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి ఇప్పుడు తగిన మౌలిక వసతులు లేవు. ఆ లోపాన్ని సరిదిద్దడం కోసమే త్వరలో ఈ నిధిని ఏర్పాటు చేయనుంది.
  • ఈ నిధులను "నాబార్డ్" (NABARD) సేకరిస్తుంది.

2. సూక్ష్మ ఆహార పరిశ్రమల క్రమబద్ధీకరణ (రూ. 10,000 కోట్లు)


  • సూక్ష్మ ఆహార పరిశ్రమలకు తగిన బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడానికి రూ. 10 వేల కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నారు.
  • దీనివల్ల ఈ రంగంలో ఉన్న సుమారు 2 లక్షల పరిశ్రమలకు లబ్ది కలగనుంది. ఉదాహరణకు 'ఉత్తరప్రదేశ్ లో మామిడి, జమ్మూ-కాశ్మీర్ లో కుంకుమ పువ్వు, తెలంగాణ లో పసుపు, ఆంధ్రప్రదేశ్ లో మిరప, ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు" ఉత్పత్తులకు ప్రసిద్ధి. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఆయా క్లస్టర్లు ఏర్పాటు చేసి బ్రాండింగ్ కల్పిస్తారు. ఈ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు పెంచుతారు.
  • "స్థానికతకు మద్దతుగా గళం" (VOCAL FOR LOCAL) అన్న నినాదంలో భాగంగా ఈ పరిశ్రమలను ప్రోత్సహించనున్నారు.

    3. మత్స్య సంపద యోజన (రూ. 20,000 కోట్లు)

  • చేపల మార్కెటింగ్ లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి రూ. 20 వేల కోట్లతో "ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన" ను ప్రారంభించనున్నారు.
  • ఇందులో రూ. 11 వేల కోట్లు 'సముద్ర, మంచి నీటి చేపల పెంపకం, ఆక్వా కల్చర్' రంగాలకు కేటాయిస్తారు.
  • రూ. 9 వేల కోట్లు ఫిషింగ్ హార్బర్లు, శీతల గిడ్డంగులు, మార్కెట్ల కోసం ఖర్చు చేస్తారు.
  • కేజ్ కల్చర్, సీవీడ్ ఫార్మింగ్, రంగుల చేపల పెంపకం, చేపలు పట్టే పడవల నిర్మాణం, ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తారు.
  • చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సాయం అందిస్తారు.
  • వ్యక్తులు, పడవలకు బీమా సౌకర్యం కల్పిస్తారు.
  • దీనివల్ల వచ్చే ఐదేళ్లలో చేపల ఉత్పత్తి అదనంగా 70 లక్షల టన్నుల మేర పెరుగుతుందని అంచనా.
  • 55 లక్షల మందికి ఉపాధి లభించడమే కాకుండా ఎగుమతులు రెట్టింపై రూ. లక్ష కోట్లకు చేరుతాయి.

4. పశు రోగ నియంత్రణ కార్యక్రమం (రూ. 13,343 కోట్లు)

  • పాడి పశువుల్లో ప్రధానంగా కనిపించే గాలికుంటు, నీలి నాలుక వ్యాధుల నివారణకు రూ. 13,343 కోట్లతో "జాతీయ పశు రోగ నివారణా కార్యక్రమం" చేపడతారు.
  • ఈ కార్యక్రమం ద్వారా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, పందులకు 100% మేర టీకాలు వేస్తారు.

5. పాడి పరిశ్రమ మౌలిక వసతుల కల్పన అభివృద్ధి నిధి (రూ. 15,000 కోట్లు)

  • పాడి, పాల ఉత్పత్తులు, పశువుల దాణా తయారీకి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 15 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు.
  • ప్రైవేట్ పెట్టుబడులను, ఎగుమతులను ప్రోత్సహిస్తారు.

6. ఔషధ పంటలకు ప్రోత్సాహం (రూ. 4,000 కోట్లు)

  • దేశంలో వచ్చే రెండేళ్లలో 10 లక్షల హెక్టార్లలో ఔషధ పంటల సాగును చేపట్టడానికి వీలుగా "జాతీయ ఔషధ మొక్కల బోర్డు" ద్వారా రూ. 4 వేల కోట్ల ప్రోత్సాహం అందించనున్నారు.
  • ప్రస్తుతం 2.25 లక్షల హెక్టార్లలో జరుగుతున్న ఈ సాగును వచ్చే రెండేళ్లలో 10 లక్షల హెక్టార్ల స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యం.
  • దీనివల్ల రైతులకు రూ. 5 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
  • ఇందుకోసం ప్రాంతీయ మార్కెట్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేయనున్నారు.
  • గంగా నది ఒడ్డున ఇరువైపులా 800 హెక్టార్ల పరిధిలో ఔషధ మొక్కలు పెంచనున్నారు.

7. తేనెటీగల పెంపకం (రూ. 500 కోట్లు)

  • గ్రామీణ ప్రాంత రైతులు, మహిళల జీవనోపాధికి రూ. 500 కోట్లతో తేనెటీగల పెంపకం, మార్కెటింగ్ ను కేంద్రం ప్రోత్సహించనుంది.
  • తేనెతో పాటు, మైనం లాంటి ఉత్పత్తులపైనా దృష్టి సారించనుంది.
  • దీనివల్ల 2 లక్షల మందికి ఆదాయం పెరగనుంది.

8. కూరగాయల రవాణా, నిల్వలపై రాయితీలు (రూ. 500 కోట్లు)

  • ఇప్పటి వరకు టమాటా, ఉల్లి, ఆలూ (బంగాళాదుంప) రవాణా, నిల్వల చార్జీలపై ఇస్తున్న 50 శాతం రాయితీ పథకాన్ని ఇకమీదట అన్ని రకాల కూరగాయలకు విస్తరింపజేస్తారు.
  • రూ. 500 కోట్లతో "టాప్ టు టోటల్" ('టాప్' అంటే "టమాటా, ఆనియన్ - ఉల్లి, పొటాటో - బంగాళాదుంప" అని అర్థం) పథకాన్ని అమలు చేయనున్నారు.
  • ఇకమీదట సరకు అధికంగా ఉన్నచోట నుంచి కొరత ఉన్న మార్కెట్లకు కూరగాయలు తరలించేందుకు అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ ఇస్తారు.
  • శీతల గిడ్డంగితో సహా ఎక్కడ నిల్వ చేసుకున్నా దానిపై అయ్యే ఖర్చులో 50 శాతం తగ్గింపునిస్తారు.
  • తొలుత ఈ పథకాన్ని 6 నెలలపాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి తర్వాత విస్తరిస్తారు.

9. సరకు నిల్వలపై పరిమితులు ఎత్తివేత (చట్ట సవరణ)

  • ఒకప్పుడు ఆహార ధాన్యాల కొరతను అధిగమించేందుకు తెచ్చిన "నిత్యావసర వస్తువుల చట్టం-1955" ని నేటి పరిస్థితులకు అనుగుణంగా సవరించనున్నారు.
  • అన్ని రకాల ఆహార వస్తువులు మిగులే ఉంటున్నందున ఇప్పుడు సరకు నిల్వలపై పరిమితులు విధించాల్సిన అవసరం లేదని కేంద్రం భావిస్తోంది.
  • చిరుధాన్యాలు, వంటనూనెలు, నూనెగింజలు, పప్పుదినుసులు, ఉల్లి, ఆలూలపై ఇప్పటివరకూ ఉన్న నియంత్రణలను ఎత్తేయాలని కేంద్రం నిర్ణయించింది.
  • జాతీయ విపత్తులు, కరువుకాటకాలు, అసాధారణ ధరల పెరుగుదల లాంటి పరిస్థితుల్లో మినహాయించి మిగిలిన సమయాల్లో నిల్వ, ఎగుమతుల మీద పరిమితులు విధించకుండా చట్ట సవరణ చేయనున్నారు.
  • ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎగుమతిదారుల వద్ద ఉండే నిల్వలపైనా ఎలాంటి పరిమితులు విధించరు.

10. పంట విక్రయాలకు కేంద్రీకృత చట్టం (కొత్త చట్టం)

  • రైతు తన పంటను ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేందుకు వీలుగా వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని సంస్కరిస్తూ ఒక కేంద్రీకృత చట్టాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • అంతర్రాష్ట్రీయ మార్కెట్ అన్నది కేంద్ర పరిధిలోని అంశం కాబట్టి ఆ నిబంధనను ఆసరాగా చేసుకొని ఈ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్లు ప్రకటించింది.
  • దీనిపై రాష్ట్రాల చట్టాలు ఉన్నా కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది.

11. పంట వేసినప్పుడే ధరకు భరోసా (కొత్త చట్టం)

  • రైతులకు పంట వేసేటప్పుడే దాని ధరకు భరోసా ఇచ్చేలా చట్టబద్ధమైన భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
  • వ్యాపారులు, ఎగుమతిదారులతో ముందుగానే పంటల కొనుగోలు, ధరలపై ఒప్పందం కుదుర్చుకునేందుకు చట్టపరమైన భద్రత కల్పించనుంది.
  • దీనివల్ల రైతులకు మార్కెటింగ్ కష్టాలు తప్పుతాయి.

18, మే 2020, సోమవారం

ATMANIRBHAR BHARAT - 2ND TRANCHE

ఆత్మ నిర్భర్ భారత్ - రెండో విడత

(ATMANIRBHAR BHARAT - 2ND TRANCHE)


  • 'కరోనా' (CORONA) ను జయించడంతోపాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం మన లక్ష్యం కావాలని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 మే 12 న "రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ" ని ప్రకటించారు. దీనిలో భాగంగా భారత ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2020 మే 14 న "ఆత్మ నిర్భర్ భారత్" - రెండో విడత (రూ. 3.16 లక్షల కోట్లు) ను ప్రకటించారు.
  • ఆత్మ నిర్భర్ భారత్ పథకం రెండో విడతలో భాగంగా "వలస కూలీలు, రైతులు, చిన్న వ్యాపారుల సంక్షేమాన్ని" దృష్టిలో పెట్టుకుని రూ. 3.16 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేయనున్నారు.

'ఆత్మ నిర్భర్ భారత్' - రెండో విడతలో మొత్తం 9 అంశాలు ఉన్నాయి :


వ.సంవివిధ రంగాల వివరాలుఅంశాలు
1వలస కార్మికుల కోసం3
2ముద్రా-శిశు రుణాల కోసం 1
3వీధి వ్యాపారుల కోసం 1
4గృహ నిర్మాణం కోసం1
5ఉపాధి కల్పన కోసం1
6చిన్న, సన్నకారు రైతుల కోసం2

1. వలస కార్మికుల కోసం

  • ప్రస్తుత కష్ట కాలంలో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను గమనించి వారికి తక్షణ ప్రయోజనం కలిగించే చర్యలను కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రకటించారు.
  • ప్రస్తుతం సొంతూళ్లకు నడిచిపోతున్న వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ వండిన భోజనం పెట్టాలని సూచించారు.
  • రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF ⇒ The State Disaster Response Fund) కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే రూ. 11 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. ఆ నిధులను ఉపయోగించుకొని కార్మికులకు అన్నం పెట్టొచ్చని పేర్కొన్నారు.

(a) సొంతూర్లలో ఉపాధి హామీ :

  • వలస కూలీలకు ఊళ్లలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు.
  • రానున్న వర్షాకాలంలో ఈ పథకం కింద 'మొక్కలు, ఉద్యాన వనాల పెంపకం, పశుపాకల నిర్మాణం' లాంటి పనులు చేపడతారు.

(b) కార్డులు లేకున్నా ఉచిత రేషన్ :

  • దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 8 కోట్ల మంది వలస కార్మికులకు వచ్చే రెండు నెలలపాటు ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం / గోధుమలు, రేషన్ కార్డుకు ఒక కేజీ చొప్పున పప్పు దినుసులు పూర్తి ఉచితంగా అందిస్తారు.
  • ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 3,500 కోట్లు ఖర్చు పెట్టనుంది.
  • కూలీలను గుర్తించి అమలు చేసే బాధ్యత మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే.
  • రేషన్ కార్డులు లేకపోయినా వీటిని ఇవ్వాల్సి ఉంటుంది.

(c) ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు :

  • రేషన్ కార్డులు లేని కారణంగా తిండి గింజలు అందుకోలేని దుస్థితిని పూర్తిగా మార్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • వచ్చే ఆగస్ట్ కల్లా "ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు" విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. దీనివల్ల దేశ వ్యాప్తంగా 67 కోట్ల మంది (83%) ప్రయోజనం పొందుతారు.
  • రేషన్ కార్డుల్లోని సభ్యుల్లో కొంతమంది సొంత ఊళ్లలో, మరికొందరు వేరే ఊర్లలో ఉంటే ... ఆధార్ సంఖ్య ఆధారంగా ఎక్కడున్నవారు అక్కడ రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తారు.
  • 2021 మార్చికల్లా దీన్ని నూరు శాతం అమల్లోకి తెస్తారు. అప్పటికల్లా అన్ని రాష్ట్రాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకోవాలి.

2. ముద్రా-శిశు రుణాల కోసం


  • చిరు వ్యాపారులకు ఉపశమనం కలిగించడానికి వారు తీసుకున్న ముద్రా-శిశు రుణాలపై వచ్చే 12 నెలలపాటు 2% వడ్డీ రాయితీ కల్పిస్తారు.
  • దీనివల్ల లబ్ధిదారులకు రూ. 1,500 కోట్ల ప్రయోజనం కలుగుతుంది.

    3. వీధి వ్యాపారుల కోసం

  • దేశవ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ. 10 వేల చొప్పున రూ. 5,000 కోట్ల మేర రుణాలు ఇస్తారు.
  • డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వారికి భవిష్యత్తులో రుణ పరిమితి పెరుగుతుంది.

4. గృహ నిర్మాణం కోసం

  • వలస కార్మికులు, పట్టణ పేదలకు అందుబాటు అద్దెల్లో ఇళ్లను అందించేందుకు "ప్రధాన మంత్రి ఆవాస్ యోజన" (PMAY) కింద గృహ సముదాయాలను నిర్మించే పథకాన్ని అమలు చేస్తారు.
  • ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని నిర్మిస్తారు.
  • ప్రైవేటు సంస్థలు, స్థిరాస్థి వ్యాపారులు తమ సొంత స్థలాల్లో ప్రభుత్వ రాయితీలు ఉపయోగించుకుని ఇళ్లను నిర్మించి పేదలకు అద్దెలకు ఇవ్వొచ్చు.
  • ఇందుకు సంబంధించి 'కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ' త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తుంది.
  • ఇందులో ప్రభుత్వపరంగా పెట్టుబడి ఏమీ ఉండదు. ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తే ప్రభుత్వం ప్రోత్సాహకాలు మాత్రమే ఇస్తుంది.

5. ఉపాధి కల్పన కోసం 

"కంపా" (CAMPA) నిధులతో గిరిజనులకు ఉపాధి :

6. చిన్న, సన్నకారు రైతుల కోసం 

(a) రైతులకు అత్యవసర మూలధనం :

  • చిన్న, సన్నకారు రైతులకు 'నాబార్డు' (NABARD) ద్వారా రూ. 30 వేల కోట్ల అత్యవసర మూలధన నిధి సమకూరుస్తారు.
  • నాబార్డు ఇప్పటికే సమకూర్చిన రూ. 90 వేల కోట్లకు ఇది అదనం.
  • ఈ మొత్తం ద్వారా రైతులకు గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు అందజేస్తారు.
  • రబీలో 3 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది.

(b) మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు :

  • 2.5 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పశుపాలకులకు 'కిసాన్ క్రెడిట్ కార్డులు' అందించి వడ్డీ రాయితీతో రూ. 2 లక్షల కోట్ల రుణాలను సమకూరుస్తారు.
  • గరిష్ఠంగా రూ. 3 లక్షల రుణం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది.
*********************************************************************************

కార్మికులందరికీ కనీస వేతనం :

  • ఇప్పుడున్న 40 కార్మిక చట్టాలను ఒక్కటిగా చేసి "కార్మిక స్మృతి" (LABOUR CODE) రూపంలో తీసుకొస్తున్నందువల్ల ప్రతి కార్మికుడికీ 'కనీస వేతనం' అందుతుందని ఆర్ధిక మంత్రి తెలిపారు.
  • ఇప్పటివరకు 30% శాతం మంది మాత్రమే కనీస వేతన చట్ట పరిధిలో ఉండగా, ఇకపై 100 శాతం మందికి కనీస వేతనం అందుతుంది.
  • కనీస వేతనం విషయంలో ఉన్న ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి "జాతీయ జీవన ప్రమాణ వేతనం" (NATIONAL FLOOR WAGE) విధానం అమల్లోకి రానుంది.
  • 10 మంది ఉద్యోగులున్న సంస్థలకూ 'ఈ ఎస్ ఐ' (ESI ⇒ Employees' State Insurance) సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
  • ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్న శాశ్వత ఉద్యోగికి కూడా 'గ్రాట్యుటీ' (GRATUITY) సౌకర్యం లభిస్తుంది.

  మధ్య తరగతికి రాయితీ రుణం పథకం పొడిగింపు :

  • ఇళ్ల కొనుగోలు నిమిత్తం రూ. 6 లక్షలు - రూ. 18 లక్షల వార్షిక ఆదాయం ఉన్న దిగువ మధ్య తరగతి వర్గాలకు 2017 మే నుంచి అమలు చేస్తున్న "రుణ అనుసంధాన రాయితీ పథకం" (CLSS ⇒ Credit Linked Subsidy Scheme) ను 2021 మార్చ్ వరకు పొడిగించారు.
  • ఇంటి కోసం తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీలో 6.5 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. ఇందువల్ల 'ఈ ఎం ఐ' (EMI ⇒ Equated Monthly Installment) ల భారం తగ్గుతుంది.
  • ఈ పథకం గత మార్చ్ 31తో ముగియగా, దీన్ని వచ్చే ఏడాది మార్చ్ 31 వరకు పొడిగించారు.
  • దీనివల్ల గృహ నిర్మాణరంగంలోకి రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం తెలిపింది.


GK TEST-48

1. 'కరోనా' (CORONA) కారణంగా "మాల్దీవులు" లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు భారత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ?
(ఎ) ఆపరేషన్ నమస్తే
(బి) వందే భారత్ మిషన్
(సి) సముద్ర సేతు
(డి) ప్రాజెక్ట్ కవచ్

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'కరోనా' (CORONA) కేసులు తొలి వెయ్యికి చేరుకోవడానికి 35 రోజులు పడితే, రెండో వెయ్యికి చేరేందుకు పట్టిన రోజులు ?
(ఎ) 15
(బి) 16
(సి) 17
(డి) 18

3. టెస్ట్ క్రికెట్ (TEST CRICKET) చరిత్రలో 400 పరుగులు నాటౌట్ వ్యక్తిగత స్కోరుతో 'వెస్ట్ ఇండీస్' క్రికెటర్ "బ్రయాన్ ఛార్లెస్ లారా" (BRIAN LARA) 2004 ఏప్రిల్ 10 న ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను ఏ దేశంపై ఈ ఘనతను సాధించాడు ?
(ఎ) ఆస్ట్రేలియా
(బి) ఇండియా
(సి) పాకిస్థాన్
(డి) ఇంగ్లాండ్

4. ప్రతిష్ఠాత్మక 'ఫెడ్ కప్ హార్ట్' (FED CUP HEART) అవార్డు నెగ్గిన భారత తొలి క్రీడాకారిణిగా "సానియా మీర్జా" (SANIA MIRZA) ఘనత సాధించింది. ఈ అవార్డు ద్వారా ఆమెకు లభించిన నగదు బహుమతి విలువ ? ('ఫెడ్ కప్' లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ సత్తా చాటే క్రీడాకారిణులకు గుర్తింపుగా "అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య" (ITF) 2009 లో ఈ అవార్డు ను ప్రారంభించింది)
(ఎ) 1000 అమెరికన్ డాలర్లు
(బి) 2000 అమెరికన్ డాలర్లు
(సి) 3000 అమెరికన్ డాలర్లు
(డి) 4000 అమెరికన్ డాలర్లు



5. 'కరోనా' (CORONA) మహమ్మారి నేపథ్యంలో రోగులకు విశిష్ఠ సేవలందిస్తూ ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రశంసలు అందుకున్న నర్స్ ?
(ఎ) సుగంధ
(బి) ఛాయా జగ్తప్
(సి) ఆదిరెడ్డి చిన్నమ్ములు
(డి) భన్వరీ దేవి

6. 'కొవిడ్-19' (COVID-19) సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్ధిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 మే 12 న రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ మన "స్థూల దేశీయోత్పత్తి" (GDP ⇒ GROSS DOMESTIC PRODUCT) లో దాదాపు ఎంత శాతానికి సమానం ?
(ఎ) 5%
(బి) 10%
(సి) 15%
(డి) 20%

7. 2020 మే 12 నాటికి 'కరోనా' (CORONA) మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కురాలు 113 ఏళ్ల "మరియా బ్రన్యాస్" ఏ దేశానికి చెందిన వారు ?
(ఎ) అమెరికా
(బి) బ్రిటన్
(సి) ఇటలీ
(డి) స్పెయిన్

8. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రస్తుత చైర్మన్ ?
(ఎ) రజత్ కుమార్
(బి) మురళీధర్
(సి) చంద్రశేఖర్ అయ్యర్
(డి) హరికేష్ మీనా

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఖాళీ భూముల విక్రయాలను ఈ-వేలం ద్వారా వేలం వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ-వేలం జరిగే తేదీ ? (తొలి విడత కింద విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో కలిపి 9 చోట్ల ప్రధాన ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయించనున్నారు)
(ఎ) 2020 మే 29
(బి) 2020 మే 30
(సి) 2020 మే 31
(డి) 2020 మే 28

10. బీటెక్ (B.TECH) లో నైపుణ్యాలు పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ప్రకారం ... ప్రస్తుతం చివరి సెమిస్టర్ లో ఉన్న "ఆరు నెలల ఇంటర్న్ షిప్" ను ఎన్ని నెలలకు పెంచనున్నారు ?
(ఎ) 7 నెలలు
(బి) 8 నెలలు
(సి) 9 నెలలు
(డి) 10 నెలలు        



కీ (GK TEST-48 DATE : 2020 MAY 18)
1) సి 2) బి 3) డి 4) బి 5) బి 6) బి 7) డి 8) సి 9) ఎ 10) డి

All the best by www.gkbitsintelugu.blogspot.com

17, మే 2020, ఆదివారం

ATMANIRBHAR BHARAT - 1ST TRANCHE

ఆత్మ నిర్భర్ భారత్ - మొదటి విడత

(ATMANIRBHAR BHARAT - 1ST TRANCHE)


  • 'కరోనా' (CORONA) ను జయించడంతోపాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించడం మన లక్ష్యం కావాలని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 మే 12 న "రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ" ని ప్రకటించారు. దీనిలో భాగంగా భారత ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2020 మే 13 న "ఆత్మ నిర్భర్ భారత్" (స్వయం సమృద్ధ భారత్) (రూ. 5.94 లక్షల కోట్లు) ను ప్రకటించారు.

"ఆత్మ నిర్భర్ భారత్" (స్వయం సమృద్ధ భారత్) - మొదటి విడత :

  • 'ఆత్మ నిర్భర్ భారత్' - మొదటి విడత (రూ. 5.94 లక్షల కోట్లు) ను భారత ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2020 మే 13 న ప్రకటించారు.
  • ఆర్ధిక స్వయం సమృద్ధిని సాధించి చూపించే "సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు" (MSME ⇒ MICRO, SMALL & MEDIUM ENTERPRISES) కు 'ఆత్మ నిర్భర్ భారత్' - మొదటి విడతలో ప్రముఖ స్థానం కల్పించారు.
  • స్థానిక వస్తు ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించడానికి, మార్కెట్ పోటీని తట్టుకొని నిలబడటానికి "సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు" (MSME ⇒ MICRO, SMALL & MEDIUM ENTERPRISES) ఆర్ధిక విస్తృతిని పెంచారు.

'ఆత్మ నిర్భర్ భారత్' - మొదటి విడతలో మొత్తం 16 అంశాలు ఉన్నాయి :


వ.సంవివిధ రంగాల వివరాలుఅంశాలు
1సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) కోసం6
2"పీ ఎఫ్" (PF) రూపంలో ఉద్యోగుల కోసం2
3బ్యాంకింగ్ యేతర ఆర్ధిక సంఘాల (NBFC) కోసం 2
4గుత్తేదారులు - భవన నిర్మాణదారుల కోసం2
5ఆదాయపు పన్ను విషయంలో3
6డిస్కంల కోసం1

1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME)

  • మనదేశ 'జీడీపీ' (GDP ⇒ GROSS DOMESTIC PRODUCT) లో మూడో వంతు భాగం మరియు 11 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న రంగం : "సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు" (MSME).

(a) చిన్న వ్యాపారాలకు రూ. 3 లక్షల కోట్ల హామీ లేని రుణాలు :

  • 'ఎంఎస్ఎంఈ' (MSME) లు సహా చిన్న వ్యాపారాల కోసం హామీ లేని రూ. 3 లక్షల కోట్ల రుణాలను కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటించారు.
  • ఈ రుణాల వల్ల 45 లక్షల సంస్థలకు ప్రయోజనం దక్కుతుంది. ఉద్యోగాలు తొలగించకుండా కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలవుతుంది.
  • ఈ రుణాలను 4 ఏళ్ల గడువుకు ఇస్తారు. 12 నెలలపాటు అసలుపై మారటోరియం ఉంటుంది. వడ్డీ కట్టాల్సిందే.
  • 100 శాతం ప్రభుత్వ హామీతో ఈ రుణాలు లభ్యమవుతాయి.
  • 2020 అక్టోబర్ 31 వరకు ఈ పథకం అమల్లోకి వస్తుంది.
  • హామీ రుసుము ఉండదు. తాజాగా ఎటువంటి హామీ పెట్టనక్కర్లేదు.
  • రూ. 25 కోట్ల పెట్టుబడులు, రూ. 100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు ఈ పథకం వర్తిస్తుంది.

(b) ఒత్తిడిలో ఉన్న 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు రూ. 20,000 కోట్ల సబ్ ఆర్డినేట్ రుణాలు :

  • రుణ ఒత్తిడిలో ఉన్న 'సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు' (MSME) కు రూ. 20,000 కోట్ల సబ్ ఆర్డినేట్ రుణాలు ఇవ్వనున్నారు. అంటే బ్యాంకుల ద్వారా 'ఎంఎస్ఎంఈ' (MSME) ప్రమోటర్లకు రుణాలు ఇస్తారు. ఈ రుణాలను ప్రమోటర్లు ఈక్విటీ రూపంలో కంపెనీలోకి చొప్పిస్తారు.
  • దీని వల్ల 2 లక్షల వ్యాపారాలకు ప్రయోజనం దక్కుతుంది.
  • నికర నిరర్ధక ఆస్తులుగా మారిన లేదా ఒత్తిడిలో ఉన్న 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు వీటిని మంజూరు చేయనున్నారు.

(c) 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు ద్రవ్యలభ్యత కోసం రూ. 50,000 కోట్లు :

  • ద్రవ్యలభ్యత సమస్యలను ఎదుర్కొంటున్న 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు "ఫండ్ ఆఫ్ ఫండ్స్" (FUND OF FUNDS) ను ఏర్పాటు చేస్తారు.
  • దీని వల్ల రూ. 50,000 కోట్ల మేర వీటికి ద్రవ్యలభ్యత ప్రయోజనాలు సమకూరుతాయి.
  • కంపెనీలు తమ పరిమాణాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.
  • స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (STOCK EXCHANGES) నమోదు కావడానికి ఇది ఊతమిస్తుంది.

(d) రూ. 200 కోట్ల లోపు టెండర్లు దేశీయ సంస్థలకే :

  • భారత 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు విదేశీ కంపెనీల నుంచి సహేతుకం కాని రీతిలో పోటీ ఉంటోంది.
  • ఈ నేపథ్యంలో రూ. 200 కోట్ల వరకు ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ టెండర్లలో విదేశీ కంపెనీలను అనుమతించకుండా, జనరల్ ఫైనాన్సియల్ రూల్స్ (GENERAL FINANCIAL RULES) లో సవరణలు చేపట్టనున్నారు.
  • 'ఆత్మ నిర్భర్ భారత్' (స్వయం సమృద్ధ భారత్) దిశగా ఇది ఒక అడుగు కానుంది. 'భారత్ లో తయారీ' కి ఇది ఊతమివ్వనుంది.
  • 'ఎంఎస్ఎంఈ' (MSME) లు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడనుంది.

(e) 'ఎంఎస్ఎంఈ' (MSME) ల నిర్వచనం మార్పు :

  • 'ఎంఎస్ఎంఈ' (MSME) ల నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చింది. తద్వారా ఎక్కువ కంపెనీలు ఈ పరిధిలోకి రావడానికి వీలవుతుంది.
  • పెట్టుబడుల పరిమితిని పెంచారు. అదనంగా టర్నోవర్ అర్హతను జత చేశారు.
  • ప్రస్తుతం తయారీ, సేవా రంగాలను విడివిడిగా పరిగణిస్తున్నారు. కొత్త నిర్వచనంలో తయారీ, సేవా రంగాలకు ఒకే నిర్వచనం ఇచ్చారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణలు చేస్తారు.

ప్రస్తుత అర్హత (ప్లాంట్, మెషినరీలో పెట్టుబడులు)  


వర్గీకరణతయారీ రంగాలుసేవా రంగాలు
సూక్ష్మరూ. 25 లక్షల్లోపురూ. 10 లక్షల్లోపు
చిన్నరూ. 5 కోట్ల లోపురూ. 2 కోట్ల లోపు
మధ్యరూ. 10 కోట్ల లోపురూ. 5 కోట్ల లోపు

సవరించిన అర్హత (పెట్టుబడులు, వార్షిక టర్నోవరు)


వర్గీకరణతయారీ, సేవల రంగాలు
సూక్ష్మరూ. కోటి లోపు పెట్టుబడులు, రూ. 5 కోట్లలోపు టర్నోవరు
చిన్నరూ. 10 కోట్లలోపు పెట్టుబడులు, రూ. 50 కోట్లలోపు టర్నోవరు
మధ్యరూ. 20 కోట్లలోపు పెట్టుబడులు, రూ. 100 కోట్లలోపు టర్నోవరు

(f) ఇతర చర్యలు :

  • 'కొవిడ్-19' (COVID-19) కారణంగా 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు మార్కెటింగ్, ద్రవ్యలభ్యత విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అందువల్ల వాణిజ్య ప్రదర్శనలు, ట్రేడ్ ఫెయిర్స్ స్థానంలో "ఈ-మార్కెట్" లింకేజ్ ను 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు తీసుకు రానున్నారు.
  • లావాదేవీ ఆధారిత రుణాలను పెంచడానికి ఫిన్ టెక్ ను ఉపయోగించనున్నారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి 'ఎంఎస్ఎంఈ' (MSME) వెండర్ల బకాయిల సెటిల్మెంట్ లను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది.
  • 45 రోజుల్లోగా 'ఎంఎస్ఎంఈ' (MSME) లకు ఇవ్వాల్సిన రూ. 1 లక్ష కోట్ల బకాయిలను ఇవి విడుదల చేస్తాయి.

2. "పీ ఎఫ్"(PF) రూపంలో ఉద్యోగుల కోసం


(a) 'పీఎఫ్' (PF) :

  • రూ. 15 వేల లోపు వేతనాలు అందుకునే ఉద్యోగులకు సంబంధించిన 12% ఈపీఎఫ్ వాటాను ఉద్యోగులు, యజమానుల తరపున ప్రభుత్వమే మరో మూడు నెలలపాటు చెల్లిస్తుంది. అంటే 2020 ఆగస్ట్ నెల వరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల 3.67 లక్షల సంస్థల్లో పనిచేసే 72.22 లక్షల మంది ఉద్యోగులు, యజమానులకు రూ. 2,500 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది.

(b) 'ఈపీఎఫ్' (EPF) చందా 3 నెలలపాటు 2% తగ్గింపు :

  • ఈపీఎఫ్ వాటాను మూడు నెలలపాటు 2% మేర తగ్గించారు.
  • దీనివల్ల ప్రైవేట్ సంస్థ యజమానికి 2% మేర నగదు మిగులుతుంది.
  • ఉద్యోగి ఇంటికి తీసుకెళ్లే జీతంలో ఆ 2% మేర అధికం కనిపిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం యాజమాన్య వాటా కింద 12% యథాతథంగా చెల్లిస్తాయి.
  • ఈ పథకం వల్ల 6.5 లక్షల సంస్థల్లో పనిచేసే 43 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది.
  • మూడు నెలలపాటు ఉద్యోగులు, యజమానులకు రూ. 6,750 కోట్ల మేర ద్రవ్యలభ్యత పెరుగుతుంది.

    3. బ్యాంకింగ్ యేతర ఆర్ధిక సంఘాల (NBFC) కోసం

(a) రూ. 30,000 కోట్లు ... ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకం :

  • ప్రస్తుతం రుణ మార్కెట్ల నుంచి 'బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు, గృహ ఆర్ధిక కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు' (NBFC, HFC, MFI) కు నిధులు సమీకరించడం క్లిష్టంగా మారింది. అందుకే రూ. 30,000 కోట్లతో ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకాన్ని ప్రకటించారు.
  • ప్రాథమిక, సెకండరీ మార్కెట్లోని NBFC, HFC, MFI ల రుణ పత్రాల్లో ఈ పెట్టుబడులు పెడతారు.
  • ద్రవ్యలభ్యతను పెంచడానికి ఈ చర్య ఉపయోగపడనుంది.
  • సెక్యూరిటీలకు ప్రభుత్వమే 100% హామీనిస్తుంది.

(b) రూ. 45,000 కోట్లు ... పాక్షిక రుణ హామీ పథకం 2.0 :

  • తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న 'ఎన్ బీ ఎఫ్ సీలు, హెచ్ ఎఫ్ సీలు, ఎమ్ ఎఫ్ ఐ లు చిన్న వ్యాపారులకు తాజాగా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత 'పాక్షిక రుణ హామీ పథకం' (PCGS ⇒ PARTIAL CREDIT GUARANTEE SCHEME) ను విస్తరించి బాండ్లు / కమర్షియల్ పేపర్ల జారీ వంటి రుణాలకు విస్తరించనున్నారు.
  • తొలి 20% నష్టాన్ని హామీదారు అంటే ప్రభుత్వమే భరిస్తుంది.
  • ఈ పథకం వల్ల రూ. 45,000 కోట్ల ద్రవ్యలభ్యత వస్తుంది.

4. గుత్తేదారులు - భవన నిర్మాణదారుల కోసం

(a) గుత్తేదార్లు (CONTRACTORS) :

  • లాక్ డౌన్ (LOCK DOWN) కారణంగా పనులు చేయలేని పరిస్థితి నెలకొన్నందున కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో చేసే అన్ని రకాల కాంట్రాక్ట్ ల కాలపరిమితిని ఆరు నెలలు (SIX MONTHS) పొడిగించారు.
  • ఇందుకు కాంట్రాక్టర్లపై అదనపు జరిమానా ఏమీ విధించరు.
  • ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలు, ఇతర పనులు, సేవలకు సంబంధించిన కాంట్రాక్టులన్నింటికీ ఈ పొడిగింపు (SIX MONTHS) వర్తిస్తుంది.
  • కాంట్రాక్టర్లు మిగిలిన పనులు పూర్తిచేయడానికి అవసరమైన నగదును అందించడానికి వీలుగా ప్రభుత్వరంగ సంస్థలు తమ దగ్గర ఉన్న బ్యాంకు గ్యారెంటీ (BANK GUARANTEE) లను పాక్షికంగా విడుదల చేస్తాయి.

(b) స్థిరాస్థి రంగం (REAL ESTATE) :

  • 'రియల్ ఎస్టేట్ డెవలపర్స్' (REAL ESTATE DEVELOPERS) కి కేంద్రం ఉపశమనాన్ని కల్పించింది.
  • "రెరా" (RERA) చట్టం కింద నమోదై ... మార్చ్ 25 తో పూర్తి కావాల్సిన అన్ని రకాల ప్రాజెక్ట్ ల కాలపరిమితిని ఆరునెలలపాటు పొడిగించింది. మళ్లీ అందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఈ పొడిగింపు వర్తిస్తుంది. అవసరం అనుకుంటే ఈ పరిమితిని మరో మూడు నెలలు పొడిగించడానికీ వెసులుబాటు కల్పించింది. ఇందుకు అనుగుణంగా సవరించిన టైమ్ లైన్ తో ఆటోమేటిక్ గా తాజా ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
  • 'కొవిడ్-19' (COVID-19) ని 'రెరా' (RERA) చట్టం కింద "దేవుడి చర్య" (FORCE MAJEURE) గా కేంద్రం పరిగణించింది. అంటే నిర్మాణంలో ఆలస్యం కావడానికి ఎవరి చేతిలో లేని అంశమైన 'కరోనా' (CORONA) యే కారణమని గుర్తించింది.

5. ఆదాయపు పన్ను

(a) వేతనం మినహా ఇతర ఆదాయాలపై టీడీఎస్ రేటులో 25% తగ్గింపు :

  • ప్రజల చేతిలో నగదు లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరట కలిగించింది.
  • వేతనం మినహా వివిధ రకాల ఇతర ఆదాయాలపై చెల్లించే "మూలం వద్ద పన్ను కోత" (TDS ⇒ TAX DEDUCTED at SOURCE) తో పాటు, చెల్లింపులను స్వీకరించేవారు వసూలు చేసే "మూలం వద్ద పన్ను చెల్లింపు" (TCS ⇒ TAX COLLECTED at SOURCE) లో 25 శాతం తగ్గింపును ప్రకటించింది.
  • దీని ద్వారా ప్రజలకు రూ. 50,000 కోట్ల వరకు నగదు అందుబాటులోకి వస్తుంది.
  • ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ఈ తగ్గింపు వర్తిస్తుంది.
  • 2020 మే 14 నుంచి 2021 మార్చ్ 31 వరకు వచ్చిన అన్ని రకాల కాంట్రాక్టులు, వృత్తి ఆదాయం, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషన్, బ్రోకరేజీ తదితర వాటిపై విధించే మూలం వద్ద పన్ను కోత లో 25 శాతం మేరకు తగ్గుతుంది.
  • ప్రస్తుతం 10 శాతం వసూలు చేస్తుండగా, బదులు 7.5 శాతంగా మారనుంది.
  • ఇది తాత్కాలిక ఉపశమనమే. తర్వాత స్లాబులను బట్టి ఎలాగూ పన్ను చెల్లించాలి.

(b) పన్ను రిటర్నులకు నవంబర్ 30 వరకు గడువు :

  • గత ఆర్ధిక సంవత్సరానికి (2019-2020) సంబంధించిన అన్ని రకాల పన్ను రిటర్నుల సమర్పణ తేదీని గతంలో ప్రకటించిన 2020 జూలై 31 నుంచి 2020 నవంబర్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది.
  • "వివాద్ సే విశ్వాస్" (VIVAD SE VISHWAS) పథకం 2020 డిసెంబర్ 31 వరకు ఉంటుందని, ఈ సమయంలో ఎలాంటి రుసుములు విధించరని ప్రభుత్వం ప్రకటించింది.

(c) ఆదాయ మదింపు పరిశీలనా తేదీలు :

  • ఆదాయ మదింపులకు సంబంధించిన పరిశీలనా తేదీలను 2020 సెప్టెంబర్ 30 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు పెంచింది.
  • 2021 మార్చ్ 31 తేదీని 2021 సెప్టెంబర్ 30 కు మార్చింది.

6. డిస్కంలు

(a) విద్యుత్తు రంగం :

  • డిస్కంలు ... జెన్ కో లకు రూ. 96 వేల కోట్ల మేర బకాయిలున్న నేపథ్యంలో 'పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్' ద్వారా డిస్కంలకు రూ. 90 వేల కోట్ల రుణాలు ఇవ్వడానికి ఈ ప్యాకేజీ అవకాశం కల్పించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇందుకు కొన్ని షరతులు పెట్టింది. అవి :
  1. ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పూచీకత్తు ఇవ్వాలి.
  2. ఈ మొత్తాన్ని కేవలం జెన్ కో లకు బకాయిలు చెల్లించడానికి మాత్రమే ఉపయోగించాలి. మరే పనికీ వినియోగించకూడదు.
  3. ప్రత్యేక చర్యలు, సంస్కరణలు కూడా చేపట్టాలి.
  4. వినియోగదారుల నుంచి చెల్లింపులన్నీ 'డిజిటల్' మార్గంలోనే వసూలు చేయాల్సి ఉంటుంది.
  5. రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించాలి.
  6. ఆర్ధిక, నిర్వహణ నష్టాలను తగ్గించుకోవడానికి ప్రణాళికలు రూపొందించాలి.
  7. కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు డిస్కంలకు ఇచ్చే రాయితీలు అంతిమ వినియోగదారుల (పరిశ్రమలు) కు అందాలి.

GK TEST-47

1. 2020 మే 7 న విశాఖపట్నం శివారులోని 'ఆర్.ఆర్.వెంకటాపురం' గ్రామంలో ఉన్న "ఎల్.జి.పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" (LG Polymers India Pvt. Ltd.) పరిశ్రమ నుంచి "స్టైరీన్" (STYRENE) వాయువు నుంచి ఆవిర్లు లీకైన దుర్ఘటన నేపథ్యంలో "ప్రమాద తీవ్రత ... పరిణామాలపై" విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి 'జస్టిస్ బి. శేషశయనారెడ్డి' (JUSTICE B.SESHASAYANA REDDY COMMITTEE) నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన వారెవరు ?
(ఎ) భారత సుప్రీంకోర్ట్
(బి) జాతీయ హరిత ట్రైబ్యునల్
(సి) ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్
(డి) జాతీయ మానవ హక్కుల కమిషన్

2. 'కొవిడ్-19' (COVID-19) నియంత్రణకు అవసరమైన "పూర్తి స్వదేశీ టీకా" అభివృద్ధి కోసం కలిసి పనిచేయనున్న సంస్థలు ?
(ఎ) ఐసీఎంఆర్ (ICMR) మరియు ఇండియన్ ఇమ్మ్యూనోలోజికల్స్ లిమిటెడ్ (IIL)
(బి) ఐసీఎంఆర్ (ICMR) మరియు సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SERUM)
(సి) ఐసీఎంఆర్ (ICMR) మరియు బయోకాన్ (BIOCON LIMITED)
(డి) ఐసీఎంఆర్ (ICMR) మరియు భారత్ బయోటెక్ (BHARAT BIOTECH)

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 566 మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం 2020 మే 9 న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుకి ఇది అమల్లోకి వస్తుంది. ఈ తగ్గింపు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండే మద్యం దుకాణాల సంఖ్య ? (దీంతో 2020 మే నెలాఖరుకి మొత్తం 33% మద్యం దుకాణాల్ని తగ్గించినట్లవుతుంది)
(ఎ) 2,931
(బి) 2,932
(సి) 2,933
(డి) 2,934

4. మద్యం, ఇసుక అక్రమాన్ని అరికట్టేందుకు "స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో" (SEB) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020 మే 9 న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 'ఎస్ ఈ బీ' (SEB) విభాగానికి ఏ హోదాలో 'డీజీపీ' (DGP ⇒ DIRECTOR GENERAL of POLICE) సారథ్యం వహిస్తారు ? ('స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో' (SEB) విభాగం  "సాధారణ పరిపాలన శాఖ" ఆధ్వర్యంలో పనిచేస్తుంది)
(ఎ) డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్
(బి) కార్యదర్శి
(సి) ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి
(డి) ఎక్స్ అఫీషియో కార్య నిర్వాహక డైరెక్టర్

5. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వాయు మార్గాన స్వదేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "వందే భారత్ మిషన్" ద్వారా తెలుగు రాష్ట్రాలలో (తెలంగాణ) తొలి విమానం ఎప్పుడు ల్యాండ్ అయింది ? (కువైట్ లో చిక్కుకున్న 163 మంది భారతీయులు ఈ విమానం ద్వారా హైదరాబాద్ చేరుకున్నారు)
(ఎ) 2020 మే 9
(బి) 2020 మే 10
(సి) 2020 మే 11
(డి) 2020 మే 12



6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన ప్రకారం 2020 మే 5 నాటికి, రాష్ట్రంలో 'కరోనా' (CORONA) వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరగటానికి కారకులైన "సూపర్ స్ప్రెడర్స్" (SUPER SPREADERS) ఎంతమంది ? (కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి (SUPER SPREADER) నుంచి ఏకంగా 32 మందికి వైరస్ సోకింది)
(ఎ) 20
(బి) 30
(సి) 40
(డి) 50

7. రాజస్థాన్ లోని "పోఖ్రాన్" లో మనదేశం అణ్వస్త్ర పరీక్షలను విజయవంతంగా జరిపిన రోజు ?
(ఎ) 1998 మే 10
(బి) 1998 మే 11
(సి) 1998 మే 12
(డి) 1998 మే 13

8. 'క్వారంటైన్' (QUARANTINE) అనే ఆంగ్ల పదం "క్వారంటినో" అనే ఇటాలియన్ పదం నుంచి వచ్చింది. "క్వారంటినో" అంటే ఏమని అర్థం ?
(ఎ) 60 రోజుల వ్యవధి
(బి) 20 రోజుల వ్యవధి
(సి) 50 రోజుల వ్యవధి
(డి) 40 రోజుల వ్యవధి

9. అడ్రియాటిక్ సముద్రపు ఒడ్డున ఉన్న "రగుస" (ప్రస్తుతం దక్షిణ క్రొయేషియా లోని "డుబ్రోవ్నిక్") పట్టణంలో ప్రపంచంలోనే మొదటిసారిగా 'క్వారంటైన్' (QUARANTINE) ను తప్పనిసరి చేస్తూ చట్టం చేసిన తేదీ ?
(ఎ) 1377 జూలై 25
(బి) 1377 జూలై 26
(సి) 1377 జూలై 27
(డి) 1377 జూలై 28



10. "అరబ్బుల మారడోనా" గా పేరుగాంచిన 'సౌదీ అరేబియా' ఫుట్ బాల్ క్రీడాకారుడు ?
(ఎ) సయీద్ అల్ ఒవైరన్
(బి) మాజిద్ అబ్దుల్లా
(సి) నవాబ్ అల్ అబిద్
(డి) ఫహాద్ అల్ మువల్లా             

కీ (GK TEST-47 DATE : 2020 MAY 17)
1) బి 2) డి 3) డి 4) సి 5) ఎ 6) సి 7) బి 8) డి 9) సి 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com

16, మే 2020, శనివారం

GK TEST-46

1. 2020 మే 7 న విశాఖపట్నం శివారులోని 'ఆర్.ఆర్.వెంకటాపురం' గ్రామంలో ఉన్న "ఎల్.జి.పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" (LG Polymers India Pvt. Ltd.) పరిశ్రమ నుంచి "స్టైరీన్" (STYRENE) వాయువు నుంచి ఆవిర్లు లీకైన దుర్ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ఎంత మొత్తం 'పరిహారం' (EX-GRATIA) గా అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ప్రకటించారు ?
(ఎ) రూ. కోటి
(బి) రూ. 50 లక్షలు
(సి) రూ. 25 లక్షలు
(డి) రూ. 10 లక్షలు

2. "జాతీయ హరిత ట్రైబ్యునల్" (NGT ⇒ NATIONAL GREEN TRIBUNAL) ప్రస్తుత చైర్ పర్సన్ ?
(ఎ) జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్
(బి) జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ
(సి) జస్టిస్ జి. రోహిణి
(డి) జస్టిస్ కేజీ బాలకృష్ణన్

3. ఏ దేశంలో చిక్కుకున్న భారతీయులను "సముద్రసేతు" పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన 'ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మఘర్' నౌకల ద్వారా తొలివిడతలో 1000 మందిని మనదేశానికి తీసుకు వస్తున్నారు ? ('కరోనా' కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సముద్ర మార్గాన తీసుకు వస్తున్న కార్యక్రమం పేరు "సముద్రసేతు")
(ఎ) యునైటెడ్ కింగ్డమ్
(బి) శ్రీలంక
(సి) మాల్దీవులు
(డి) బహ్రెయిన్

4. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) భాగస్వామ్య దేశాల ప్రతినిధులంతా కలిసి "మసూచికి కారణమవుతున్న వరియోల వైరస్ ఇక చరిత్రపుటల్లోనే ఉంటుంది" అని ప్రకటించిన రోజు ?
(ఎ) 1980 మే 8
(బి) 1980 మే 9
(సి) 1980 మే 10
(డి) 1980 మే 11

5. 'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' (RIL) తన డిజిటల్ విభాగమైన "జియో ప్లాట్ ఫార్మ్స్" లో అమెరికా కు చెందిన 'విస్టా ఈక్విటీ పార్టనర్స్' కు ఎంత శాతం వాటాను విక్రయించింది ?
(ఎ) 2. 30%
(బి) 2. 31%
(సి) 2. 32%
(డి) 2. 33%



6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'మద్యం అక్రమంగా తయారు చేసినా, రవాణా చేసినా' 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు విధించే జరిమానా ?
(ఎ) రూ. 5 లక్షలు ఆ పైన
(బి) రూ. 6 లక్షలు ఆ పైన
(సి) రూ. 7 లక్షలు ఆ పైన
(డి) రూ. 8 లక్షలు ఆ పైన

7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా" పై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ లైన్ (ANDHRA PRADESH - SPECIAL HELPLINE NUMBERS) ?
(ఎ) 14400
(బి) 14410
(సి) 14500
(డి) 1902

8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'అక్రమ మద్యం తయారీ, అమ్మకాలు, రవాణా' కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన "స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో" (SEB ⇒ SPECIAL ENFORCEMENT BUREAU) పరిధిలో ప్రతి పోలీసు జిల్లాకు ఒకరు (Additional SP (or) ASP) చొప్పున మొత్తం ఎంతమంది అధికారులను నియమించారు ?
(ఎ) 13
(బి) 15
(సి) 18
(డి) 26

9. ప్రపంచవ్యాప్తంగా 'కరోనా' వైరస్ బాధితుల సంఖ్య (WORLD COVID-19 PATIENTS) 40 లక్షలు దాటిన రోజు ?
(ఎ) 2020 ఏప్రిల్ 15
(బి) 2020 ఏప్రిల్ 27
(సి) 2020 మే 9
(డి) 2020 మే 15

10. "భారత్ బయోటెక్" (BHARAT BIOTECH) సంస్థలోని ఉత్పాదక కేంద్రం యొక్క 'బయో సేఫ్టీ లెవెల్' (BSL) స్థాయి ?
(ఎ) బీ ఎస్ ఎల్ - 1 (BSL - 1)
(బి) బీ ఎస్ ఎల్ - 2 (BSL - 2)
(సి) బీ ఎస్ ఎల్ - 3 (BSL - 3)
(డి) బీ ఎస్ ఎల్ - 4 (BSL - 4)          



కీ (GK TEST-46 DATE : 2020 MAY 16)
1) ఎ 2) ఎ 3) సి 4) ఎ 5) సి 6) ఎ 7) సి 8) సి 9) సి 10) సి

All the best by www.gkbitsintelugu.blogspot.com

15, మే 2020, శుక్రవారం

COMMITTEES

HIGH POWER COMMITTEE ON LG POLYMERS GAS LEAK ACCIDENT

ఉన్నత స్థాయి కమిటీ (చైర్మన్ : నీరబ్ కుమార్ ప్రసాద్)

(HIGH POWER COMMITTEE) (Chairman : Neerab Kumar Prasad)


  • విశాఖపట్నంలోని "ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" పరిశ్రమ నుంచి 'స్టైరీన్' గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "ఉన్నత స్థాయి కమిటీ" (HIGH POWER COMMITTEE) ని 'జీవో ఆర్ టి నంబర్ 803' ద్వారా 2020 మే 8 న నియమించింది.
  • నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించవలసిన అంశాలు :

  • గ్యాస్ లీకేజీ కి కారణాలేంటి ? కంపెనీ అన్ని రకాల నిర్వహణ పద్ధతులు పాటించిందా ... లేదా ? గ్రామాలపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందా ?
  • లీక్ ఉదంతానికి 'ఎల్జీ పాలిమర్స్' నిర్లక్ష్యం కారణమని తేలితే ఆ సంస్థపై చేపట్టాల్సిన చర్యలు.
  • భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పరిశ్రమలు చేపట్టాల్సిన చర్యలు, 'సేఫ్టీ ఆడిట్' (SAFETY AUDIT) లపై సిఫారసులు.
  • ఈ అంశాలపై సమగ్ర అధ్యయనానికి అవసరమైతే ... జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు, సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు.

ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు :

  1. నీరబ్ కుమార్ ప్రసాద్ - చైర్మన్ - రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
  2. ఆర్.కరికాల్ వలెవన్ - సభ్యుడు - పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
  3. వినయ్ చంద్ - సభ్యుడు - విశాఖపట్నం జిల్లా కలెక్టర్
  4. ఆర్.కె.మీనా - సభ్యుడు - విశాఖపట్నం పోలీస్ కమీషనర్
  5. వివేక్ యాదవ్ - మెంబర్ కన్వీనర్ - రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి

JUSTICE B.SESHASAYANAREDDY COMMITTEE

జస్టిస్ బి.శేషశయనారెడ్డి కమిటీ

(JUSTICE B.SESHASAYANAREDDY COMMITTEE)


  • 2020 మే 7 న విశాఖపట్నం శివారు గ్రామం 'ఆర్.ఆర్.వెంకటాపురం' లో ఉన్న "ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" పరిశ్రమలో 'స్టైరీన్' వాయువు నుంచి లీకైన ఆవిర్లు వలన 12 మంది మరణించారు.
  • ఈ ఘటనపై మీడియా కథనాల ఆధారంగా 'సుమోటో' గా కేసును విచారించిన 'జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్' నేతృత్వంలోని "జాతీయ హరిత ట్రైబ్యునల్" (NGT) ధర్మాసనం "ప్రమాద తీవ్రత ... పరిణామాలపై" విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి "జస్టిస్ బి.శేషశయనారెడ్డి" నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

'కమిటీ' పరిశీలించవలసిన అంశాలు :

  • ప్రమాద ఘటన పరిణామాలు, గ్యాస్ లీక్ వైఫల్యానికి కారణాలు, ఇందుకు బాధ్యులైన అధికారులు, వ్యక్తులు, ప్రాణ నష్టం, ప్రజా ఆరోగ్యం, జీవరాశులు, నేల, నీరు, వాయు, పర్యావరణానికి వాటిల్లిన నష్టంపై కమిటీ నివేదిక ఇవ్వాలని 'ఎన్ జీ టీ' (NGT) పేర్కొంది.
  • పరిహారం చెల్లింపునకు, ప్రమాదం పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలు, అవాంఛనీయ సమస్యలపై నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

'కమిటీ' సభ్యులు :

  1. ప్రొ. సి.హెచ్.వి.రామచంద్రమూర్తి - ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్
  2. ప్రొ. పులిపాటి కింగ్ - ఆంధ్రా యూనివర్సిటీ కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి
  3. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సభ్యకార్యదర్శి
  4. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) డైరెక్టర్
  5. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) అధిపతి
  • కమిటీకి అవసరమైన సాంకేతిక, ఇతర సహాయాలను చేయాలని 'కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి' (CPCB) ని "జాతీయ హరిత ట్రైబ్యునల్" (NGT) ధర్మాసనం ఆదేశించింది.
  • నివేదిక తయారీకి అవసరమైతే నిపుణులు, వ్యక్తులు, సంస్థల సహాయాన్ని తీసుకునే స్వేచ్ఛ కమిటీకి ఉందని ధర్మాసనం పేర్కొంది.




UGC HELPLINE

యూజీసీ హెల్ప్ లైన్

(UGC HELPLINE)


  • పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇతర అంశాల పరిష్కారం కోసం "యూజీసీ" (UGC ⇒ UNIVERSITY GRANTS COMMISSION011 - 23236374 నంబర్ తో ప్రత్యేక హెల్ప్ లైన్ (HELPLINE) ఏర్పాటు చేసింది.
  • ప్రశ్నలు, ఫిర్యాదులు, విద్యార్థులు, టీచర్లు, విద్యా సంస్థలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ హెల్ప్ లైన్ (HELPLINE) పనిచేస్తుంది.
  • ఈ హెల్ప్ లైన్ (HELPLINE) తో పాటు covid19help.ugc@gmail.com పేరుతో ఒక ఈ-మెయిల్ (e-mail) నూ ఏర్పాటు చేసింది.

COVID KAVACH ELISA ANTIBODY TEST KIT

"కొవిడ్ కవచ్ ఎలీసా" యాంటీ బాడీ పరీక్ష కిట్

("COVID KAVACH ELISA" ANTIBODY TEST KIT)


  • 'ఐసీఎంఆర్' (ICMR) ఆధ్వర్యంలోని "నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ" (NIV - PUNE) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 'ఎలీసా' (ELISA) ఆధారిత యాంటీబాడీ పరీక్ష కిట్లను రూపొందించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం "కొవిడ్ కవచ్ ఎలీసా" (COVID KAVACH ELISA) అని నామకరణం చేసింది.
  • "కొవిడ్ కవచ్ ఎలీసా" (COVID KAVACH ELISA) కిట్ల ద్వారా రెండున్నర గంటల్లో ఒకేసారి 90 నమూనాలను పరీక్షించవచ్చు.
  • "కొవిడ్ కవచ్ ఎలీసా" (COVID KAVACH ELISA) కిట్లను భారీస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని "జైడూస్ క్యాడిలా" (ZAIDUS CADILA) సంస్థకు బదిలీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి 'హర్షవర్ధన్' వెల్లడించారు.

GK TEST-45

1. 2020 మే 7 న విశాఖపట్నం శివారులోని 'ఆర్.ఆర్.వెంకటాపురం' గ్రామంలో ఉన్న "ఎల్.జి.పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" (LG Polymers India Pvt. Ltd.) పరిశ్రమలోని ఏ వాయువు నుంచి లీకైన ఆవిర్లు వలన 12 మంది మృత్యువాత పడ్డారు ?
(ఎ) స్టైరీన్
(బి) మీథేన్
(సి) డియోక్సిన్స్
(డి) ఎల్ఫీజీ

2. "భోపాల్" విషవాయువు (MIC ⇒ METHYL ISOCYANATE) లీకేజీ దుర్ఘటన జరిగిన రోజు ? (ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో 2,259 మంది ప్రాణాలు కోల్పోయారు)
(ఎ) 1984 డిసెంబర్ 1
(బి) 1984 డిసెంబర్ 2
(సి) 1984 డిసెంబర్ 3
(డి) 1984 డిసెంబర్ 4

3. "దేవకుసుమ" అని పిలువబడే సుగంధ ద్రవ్యం ?
(ఎ) ఏలకులు
(బి) మిరియాలు
(సి) వాము
(డి) లవంగం

4. 2020-22 సంవత్సరాలకు "హైసియా" (HYSEA ⇒ HYDERABAD SOFTWARE ENTERPRISES ASSOCIATION) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ?
(ఎ) కిరణ్ చెరుకూరి
(బి) మురళి బొల్లు
(సి) భరణి కుమార్ అరోల్
(డి) రాజ్ కుమార్



5. 'ప్రోటోజోవా పారాసైట్' కారణంగా వచ్చే 'బబేసియా' వలన గత మూడు నెలల్లో 23 సింహాలు మృత్యువాత పడిన "గిర్" అడవులున్న రాష్ట్రం ?
(ఎ) గుజరాత్
(బి) కర్ణాటక
(సి) అసోం
(డి) పశ్చిమ బెంగాల్

6. 'కరోనా' (CORONA) కారణంగా గత రెండు నెలలుగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "వందే భారత్ మిషన్" (VANDE BHARAT MISSION) ఎప్పుడు ప్రారంభమైంది ? (తొలివిడతలో 'యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్' (UAE) నుంచి 363 మంది కేరళ చేరుకున్నారు)
(ఎ) 2020 మే 4
(బి) 2020 మే 5
(సి) 2020 మే 6
(డి) 2020 మే 7

7. "భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి" (CSIR) 'కరోనా' వైరస్ కి సంబంధించిన దాదాపు ఎన్ని జన్యుక్రమాలను 'గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లూయెంజా డేటా' (GISAID) అనే అంతర్జాతీయ జీనోమ్ డేటాబేస్ కు సమర్పించింది ?
(ఎ) 50
(బి) 51
(సి) 52
(డి) 53

8. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 59 ఏళ్లకు పెంచుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రం ?
(ఎ) తమిళనాడు
(బి) కర్ణాటక
(సి) కేరళ
(డి) గోవా

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "ఇంటర్మీడియట్" విద్యా సంవత్సరం ఏ రోజు నుంచి ప్రారంభం కానుంది ?
(ఎ) 2020 జూలై 13
(బి) 2020 జూలై 14
(సి) 2020 జూలై 15
(డి) 2020 జూలై 16



10. "న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్ షిప్ ఇనీషియేటివ్" (NMITLI) కార్యక్రమం కింద 'కరోనా' (CORONA) వ్యాధిగ్రస్తుల కోసం 'హ్యూమన్-మోనోక్లోనల్ యాంటీబాడీస్' చికిత్సను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ను 'భారత్ బయోటెక్' (BHARAT BIOTECH) సారధ్యం వహించే బృందానికి 'సీ ఎస్ ఐ ఆర్' (CSIR) మంజూరు చేసింది. ఈ బృందంలో 'భారత్ బయోటెక్' కాకుండా మన దేశానికే చెందిన మరో మూడు సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఆ మూడు సంస్థలలో ఉన్న ఒకే ఒక్క "ఐ ఐ టీ" (IIT) ?
(ఎ) ఐఐటీ - దిల్లీ
(బి) ఐఐటీ - ఇండోర్
(సి) ఐఐటీ - ముంబయి
(డి) ఐఐటీ - చెన్నై

కీ (GK TEST-45 DATE : 2020 MAY 15)
1) ఎ 2) బి 3) డి 4) సి 5) ఎ 6) డి 7) డి 8) ఎ 9) సి 10) బి

All the best by www.gkbitsintelugu.blogspot.com

14, మే 2020, గురువారం

WORLD-CORONA (COVID-19)-CASES

ప్రపంచం - 'కరోనా' (కొవిడ్-19) కేసులు
(WORLD - CORONA (COVID-19) - CASES)


'కరోనా' కేసులుగరిష్ఠ కేసులు నమోదైన తేదీసోకడానికి పట్టిన సమయం
1 - 10 లక్షలు2020 ఏప్రిల్ 293 రోజులు
10 లక్షలు - 20 లక్షలు2020 ఏప్రిల్ 1513 రోజులు
20 లక్షలు - 30 లక్షలు2020 ఏప్రిల్ 2712 రోజులు
30 లక్షలు - 40 లక్షలు2020 మే 912 రోజులు

ANDHRA PRADESH - SPECIAL HELPLINE NUMBERS

ఆంధ్రప్రదేశ్ - ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు
(ANDHRA PRADESH - SPECIAL HELPLINE NUMBERS)


వ. సంవిషయంనంబర్
1దిశ181
2వ్యవసాయం & అనుబంధ సేవలు1902
3అవినీతిపై ఫిర్యాదులు14400
4వైఎస్సార్ టెలీ మెడిసిన్ సేవలు14410
5మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణాపై ఫిర్యాదు చేసేందుకు14500

GK TEST-44

1. 'కరోనా' (CORONA) ఉద్ధృతి నేపథ్యంలో మనదేశంలో ఏ నగరం మొత్తాన్ని "రెడ్ జోన్" (RED ZONE) గా ప్రకటించారు ?
(ఎ) ముంబయి
(బి) పుణె
(సి) చెన్నై
(డి) దిల్లీ

2. 'వీసా' గడువు ముగిసినా తమదేశంలో ఉంటున్న వలస కార్మికుల కోసం "క్షమాభిక్ష" (AMNESTY) విధానాన్ని తీసుకొచ్చిన దేశం ? ('కరోనా' వ్యాప్తి నేపథ్యంలో జరిమానాలు రద్దు చేయడంతోపాటు స్వదేశానికి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు కూడా అందించాలని ఆ దేశం నిర్ణయించింది)
(ఎ) కువైట్
(బి) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
(సి) ఖతార్
(డి) సౌదీ అరేబియా

3. మనదేశంలో "వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్" కు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఎలక్ట్రానిక్' వేదిక పేరు ?
(ఎ) ఈ-పంట
(బి) ఈ-అగ్రికల్చర్
(సి) ఈ-కర్షక్
(డి) ఈ-నామ్

4. క్రింది వాటిలో "తప్పు" (WRONG) గా ఉన్న ఐచ్ఛికం (CHOICE) ?
(ఎ) చైనా దేశ "బ్యాట్ వుమన్" : షి జియాంగ్ లీ
(బి) చైనాలో 'కరోనా' గురించి తొలిసారిగా మాట్లాడిన డాక్టర్ : హువాంగ్ యాన్ లింగ్
(సి) ఇంగ్లిష్ మాట్లాడే అతిపెద్ద దేశాలైన 'అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్' దేశాలతో ఏర్పడిన " ఐదు కళ్ల కూటమి" (FIVE EYES GROUP) అధికారికంగా ఏర్పాటైన సంవత్సరం : 1946
(డి) చైనా లో 'తొలి కరోనా మృతి' నమోదైన తేదీ : 2020 జనవరి 11



5. క్రింది వాటిలో "ఒప్పు" (CORRECT) గా ఉన్న ఐఛ్చికం (CHOICE) ?
(ఎ) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యక్షుడు "టెడ్రోస్ అధనామ్" స్వదేశం : జిబౌటి
(బి) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యక్షుడు "టెడ్రోస్ అధనామ్" స్వదేశం : కెన్యా
(సి) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యక్షుడు "టెడ్రోస్ అధనామ్" స్వదేశం : సూడాన్
(డి) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యక్షుడు "టెడ్రోస్ అధనామ్" స్వదేశం : ఇథియోపియా

6. తూర్పు దిల్లీ లోని 'మయూర్ విహార్ ఫేజ్-3' ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జవాన్లలో 135 మందికి 'కరోనా' (CORONA) సోకింది. ఈ జవాన్లు "సీ ఆర్ పీ ఎఫ్" (CRPF) లోని ఏ బెటాలియన్ కి చెందినవారు ?
(ఎ) 30
(బి) 31
(సి) 32
(డి) 33

7. 'త్రివేంద్ర సింగ్ రావత్' ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉన్నారు ?
(ఎ) హిమాచల్ ప్రదేశ్
(బి) హరియాణ
(సి) రాజస్థాన్
(డి) ఉత్తరాఖండ్

8. 'ఐక్య రాజ్య సమితి' (UNO) "భద్రతామండలి" లో తాత్కాలిక సభ్యులుగా ఉండే దేశాల సంఖ్య ?
(ఎ) 5
(బి) 10
(సి) 15
(డి) 20

9. క్రింది వాటిలో "తప్పు" (WRONG) గా ఉన్న ఐచ్ఛికం (CHOICE) ?
(ఎ) 'ఉత్పరివర్తనాల ప్రభావం' వైరస్ లోని ప్రొటీన్లలో మార్పులకు కారణం అయితే దానిని "నాన్ సైలెంట్ మ్యుటేషన్" అంటారు.
(బి) 'ఉత్పరివర్తనాల ప్రభావం' వైరస్ లోని ప్రొటీన్లలో మార్పులు చోటు చేసుకోకపోతే దానిని "సైలెంట్ మ్యుటేషన్" అంటారు.
(సి) మనదేశంలో పరోక్ష పన్నుల వివాదాల సత్వర పరిష్కార నిమిత్తం తీసుకొచ్చిన పథకం "వివాద్ సే విశ్వాస్".
(డి) పై మూడు ఐఛ్చికాలు తప్పు.



10. "హెచ్ డీ ఎఫ్ సీ" (HDFC) బ్యాంక్ ప్రస్తుత 'సీఈఓ & ఎండీ' (CEO & MD) ?
(ఎ) కైజాద్ భరూచా
(బి) ఆదిత్య పురి
(సి) శశిధర్ జగదీశన్
(డి) సునీల్ గార్గ్            

కీ (GK TEST-44 DATE : 2020 MAY 14)
1) డి 2) ఎ 3) డి 4) బి 5) డి 6) బి 7) డి 8) బి 9) డి 10) బి

All the best by www.gkbitsintelugu.blogspot.com

13, మే 2020, బుధవారం

GK TEST-43

1. ఏ సీజన్ లో ఎటువంటి పంటలు వేస్తే ప్రయోజనమో రైతులకు సూచనలు చేసే "వ్యవసాయ సలహా మండళ్లు" ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎన్ని స్థాయిల్లో ఏర్పాటు చేయనుంది ?
(ఎ) 2
(బి) 3
(సి) 4
(డి) 5

2. ప్రపంచం మొత్తమ్మీద "నిమ్మ జాతి పండ్ల ఉత్పత్తి" లో భారతదేశ స్థానం ?
(ఎ) 6
(బి) 7
(సి) 8
(డి) 9

3. మనదేశంలో పండే పండ్లలో మొదటి స్థానంలో ఉన్నది ?
(ఎ) మామిడి
(బి) జామ
(సి) సపోటా
(డి) అరటి

4. ప్రపంచంలోని "పండ్లు, కూరగాయల ఉత్పత్తి" లో మనదేశ స్థానం ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4



5. "నీతి ఆయోగ్" (NITI AAYOG) ప్రస్తుత చైర్మన్ ?
(ఎ) డా. రాజీవ్ కుమార్
(బి) అమిత్ షా
(సి) అమితాబ్ కాంత్
(డి) నరేంద్ర మోదీ

6. ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత 2019 జనవరిలో 'ఆంధ్రప్రదేశ్' హైకోర్టు కు తొలి "సహాయ సొలిసిటర్ జనరల్" గా నియమితులైన వ్యక్తి ? (ప్రస్తుతం ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తి గా పనిచేస్తున్నారు)
(ఎ) కంచిరెడ్డి సురేష్ రెడ్డి
(బి) బి.విజయ్ సేన్ రెడ్డి
(సి) బొప్పూడి కృష్ణ మోహన్
(డి) కన్నెగంటి లలిత కుమారి

7. భారత పార్లమెంట్ "పబ్లిక్ అకౌంట్స్ కమిటీ" (PAC) ప్రస్తుత చైర్మన్ ?
(ఎ) అధీర్ రంజన్ చౌధురి
(బి) సీఎం రమేష్
(సి) మల్లిఖార్జున ఖర్గే
(డి) వి.బాలసౌరి

8. 2020 మే 2 న కొత్తగా నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోని మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ?
(ఎ) 19
(బి) 20
(సి) 21
(డి) 22

9. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లోని ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య ?
(ఎ) 14
(బి) 15
(సి) 16
(డి) 17



10. మహారాష్ట్ర అవతరణ దినోత్సవ తేదీ ?
(ఎ) మే 1
(బి) మే 2
(సి) మే 3
(డి) మే 4           

కీ (GK TEST-43 DATE : 2020 MAY 13)
1) బి 2) ఎ 3) డి 4) బి 5) డి 6) సి 7) ఎ 8) సి 9) ఎ 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com

12, మే 2020, మంగళవారం

GK TEST-42

1. 'కొవిడ్-19' (COVID-19) వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందించే ఆసుపత్రులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరగడంతో "కరోనా హోటళ్ల" (CORONA HOTELS) విధానాన్ని అమలు చేస్తున్న దేశం ?
(ఎ) జపాన్
(బి) ఇజ్రాయెల్
(సి) అమెరికా
(డి) న్యూజీలాండ్

2. 'డీఆర్డీఓ' (DRDO) కు అనుబంధంగా పనిచేస్తున్న "డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ" (DIAT-PUNE) సంస్థ 'కరోనా' మహమ్మారిని అంతం చేసేందుకు 'సూక్ష్మ తరంగాల యంత్రం' ను రూపొందించింది. ఈ యంత్రం పేరు ? (56 డిగ్రీల నుంచి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో దీని నుంచి విడుదలయ్యే సూక్ష్మ తరంగాలు వస్తువులపై ఉన్న వైరస్ ను విచ్ఛిన్నం చేస్తాయి. ఈ యంత్రం బరువు 3 కిలోలు. ఇది 'నాన్-మెటాలిక్' (NON-METALLIC) వస్తువులపై మాత్రమే పనిచేస్తుంది)
(ఎ) జీవన్
(బి) సంజీవని
(సి) స్ట్రెయిన్
(డి) అతుల్య

3. 2020 ఏప్రిల్ 30 నాటికి, భారత్ లో 'కొవిడ్-19' (COVID-19) కేసులు నమోదై ... రోగులు పూర్తిగా కోలుకున్న రాష్ట్రాలు ?
(ఎ) మణిపూర్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్
(బి) గోవా, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్
(సి) నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర
(డి) సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ

4. "ఫెడ్ కప్ హార్ట్" (FED CUP HEART) అవార్డ్ కోసం 'ఆసియా-ఓసియానియా' జోన్ నుంచి సిఫార్స్ చేసిన క్రీడాకారులలో నామినేట్ అయిన తొలి భారత క్రీడాకారిణి ?
(ఎ) సానియా మీర్జా
(బి) పీవీ సింధు
(సి) సైనా నెహ్వాల్
(డి) మిథాలీ రాజ్



5. 2020 ఏప్రిల్ 30 న 'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' (RIL) ప్రకటించిన "మెగా రైట్స్ ఇష్యూ" (RIGHTS ISSUE) విలువ ? (ఈ ఇష్యూ లో వాటాదార్లకు ప్రతి 15 షేర్లకు ఒక్కో షేరును రూ. 1,257 ధరకు ఆఫర్ చేస్తోంది)
(ఎ) రూ. 50,125 కోట్లు
(బి) రూ. 51,125 కోట్లు
(సి) రూ. 52,125 కోట్లు
(డి) రూ. 53,125 కోట్లు

6. అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలం, రేకులకుంట గ్రామంలో ఏర్పాటైన "అనంతపురం వ్యవసాయ పరిశోధనా కేంద్రం" కు 2019-20 సంవత్సరానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు వచ్చింది. ఏ పంటపై చేసిన పరిశోధనలకుగాను ఈ అవార్డు వచ్చింది ? (ఈ పంటలో నూతన వంగడాలైన "ఏబీవీ-04" రకాన్ని అభివృద్ధి చేసారు)
(ఎ) రాగి
(బి) జొన్న
(సి) సజ్జ
(డి) మొక్కజొన్న

7. 'లాక్ డౌన్' (LOCK DOWN) సడలించిన తర్వాత మనదేశంలో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్లలో (SMART PHONES) ఏ యాప్ ను "ఇన్-బిల్ట్" (IN-BUILT) ఫీచర్ గా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
(ఎ) నిఘా
(బి) జన ఔషధి సుగం మొబైల్ యాప్
(సి) మై గొవ్
(డి) ఆరోగ్య సేతు

8. అంగారక గ్రహం పై విహరించడానికి అమెరికా అంతరిక్ష సంస్థ "నాసా" (NASA) మొట్టమొదటిసారిగా పంపుతున్న 'హెలికాప్టర్' కు భారత సంతతికి చెందిన 11 వ తరగతి విద్యార్థిని "వనీజా రూపాణి" సూచించిన పేరును ఖరారు చేసారు. ఆ విద్యార్థిని సూచించిన పేరు ?
(ఎ) పర్ సెవరెన్స్
(బి) ఇన్ జెన్యువిటీ
(సి) కరేజ్
(డి) ఎండ్యూరెన్స్

9. 'కరోనా' (CORONA) వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా "వివాహ సంబంధ కార్యకలాపాలు" లో ఎంతమందికి మించి అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ?
(ఎ) 25
(బి) 50
(సి) 75
(డి) 100



10. 'కరోనా' (CORONA) వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా "అంత్యక్రియలు" కార్యక్రమానికి గరిష్ఠంగా ఎంతమందికి మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ?
(ఎ) 20
(బి) 30
(సి) 40
(డి) 50             

కీ (GK TEST-42 DATE : 2020 MAY 12)
1) బి 2) డి 3) బి 4) ఎ 5) డి 6) సి 7) డి 8) బి 9) బి 10) ఎ

All the best by www.gkbitsintelugu.blogspot.com