ఎల్.జి.పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - విశాఖపట్నం - గ్యాస్ లీకేజ్ దుర్ఘటన - బాధితులకు పరిహారం
(LG Polymers India Pvt. Ltd. - Visakhapatnam - Gas Leakage Accident - Ex-Gratia)
- 2020 మే 7 న విశాఖపట్నం శివారు గ్రామం 'ఆర్.ఆర్.వెంకటాపురం' లో ఉన్న "ఎల్.జి.పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" పరిశ్రమలో "స్టైరీన్" (STYRENE) వాయువు నుంచి ఆవిర్లు లీకైన సంఘటనలో 12 మంది మరణించారు.
- ఈ సందర్భంగా సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' బాధిత కుటుంబాలకు "ఎక్స్-గ్రేషియా" (EX-GRATIA) ప్రకటించారు. ఆ వివరాలు :
| వ.సం | బాధితులు | ప్రభుత్వం ప్రకటించిన పరిహారం |
|---|---|---|
| 1 | మృతుల కుటుంబాలకు | రూ. కోటి |
| 2 | ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికి | రూ. 25 వేలు |
| 3 | ఆసుపత్రిలోనే రెండు, మూడు రోజులు చికిత్స తీసుకోవాల్సి వస్తే ... వారికి | రూ. లక్ష |
| 4 | వెంటిలేటర్ (VENTILATOR) పై చికిత్స తీసుకునే పరిస్థితి ఉన్నవారికి | రూ. 10 లక్షలు |
| 5 | ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు ... (ఒక్కో కుటుంబానికి) | రూ. 10 వేలు |
| 6 | పశువులను పోగొట్టుకున్న కుటుంబాలకు | రూ. 20 వేలు |
- చనిపోయినవారి కుటుంబాల్లో ఒకరికి 'ఎల్.జి" కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి