ఈ బ్లాగును సెర్చ్ చేయండి

8, మే 2020, శుక్రవారం

GK TEST-38

1. 'కరోనా' (CORONA) నష్టాల సుడిగాలుల్లో చిక్కుకోవడం వలన మరింత మూలధనం కోసం "వాలంటరీ అడ్మినిస్ట్రేషన్" (VOLUNTARY ADMINISTRATION) ప్రక్రియను ఆశ్రయించామని తెలిపిన ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద విమానయాన సంస్థ ?
(ఎ) క్వాంటాస్
(బి) జెట్ స్టార్
(సి) వర్జిన్ ఆస్ట్రేలియా
(డి) రెక్స్ (రీజనల్ ఎక్స్ ప్రెస్)

2. దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితర మత సంస్థల్లో సేవలందిస్తున్న అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు ఎంత మొత్తం ఆర్ధిక సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ?
(ఎ) రూ. 1,000
(బి) రూ. 2,000
(సి) రూ. 5,000
(డి) రూ. 10,000

3. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఉచిత అన్నదాన పథకం "మిషన్ అన్న సేవ" (MISSION ANNA SEVA) ను నిర్వహిస్తున్న సంస్థ ?
(ఎ) రిలయన్స్ ఫౌండేషన్
(బి) అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్
(సి) మిలిండా & గేట్స్ ఫౌండేషన్
(డి) ఇన్ఫోసిస్ ఫౌండేషన్

4. ప్రస్తుత భారత సుప్రీంకోర్ట్ కొలీజియం లోని ఏకైక మహిళా సభ్యురాలు ?
(ఎ) జస్టిస్ జి. రోహిణి
(బి) జస్టిస్ ఇందు మల్హోత్రా
(సి) జస్టిస్ ఆర్. భానుమతి
(డి) జస్టిస్ ఇందిరా బెనర్జీ

5. గుజరాత్ లోని 'వీరావల్' లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులు ఒక్కొక్కరికి ఎంత మొత్తం చొప్పున ఆర్ధిక సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' అధికారులను ఆదేశించారు ?
(ఎ) రూ. 1,000
(బి) రూ. 2,000
(సి) రూ. 5,000
(డి) రూ. 10,000

6. ఖరీదైన యంత్రాలేవీ అవసరం లేకుండా తక్కువ ఖర్చులోనే 'కరోనా' (CORONA) ను నిర్ధారించే సరికొత్త పరీక్షను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆ పరీక్ష పేరు ?
(ఎ) కరోఫ్లూ
(బి) ఫెలూడా
(సి) స్ట్రెయిన్
(డి) ఫిఫట్రాల్



7. తొలిసారిగా 'వైరస్' (VIRUS) ఆచూకీని కనుగొన్న బ్యాక్టీరియాలజిస్ట్ (BACTERIOLOGIST) ? (దీనికి 'టొబాకో మొజాయిక్ వైరస్'(TOBACO MOSAIC VIRUS) గా పేరు పెట్టారు)
(ఎ) దిమిత్రి ఇవానోవ్ స్కీ
(బి) డాక్టర్ హార్వే ఫిన్ బెర్గ్
(సి) రెమి చారెల్
(డి) బోరిస్ పాస్టోరీనో

8. 'వైరులెంటస్' అనే లాటిన్ (LATIN) మాట నుంచి వచ్చిన పదం "వైరస్" (VIRUS) అంటే ఏమని అర్థం ?
(ఎ) ప్రమాదకర జీవి
(బి) జబ్బు
(సి) విషతుల్యం
(డి) ఆమ్లం

9. 'వైరస్' (VIRUS) ల సగటు వెడల్పు ?
(ఎ) 10 - 300 నానో మీటర్లు
(బి) 20 - 400 నానో మీటర్లు
(సి) 30 - 500 నానో మీటర్లు
(డి) 40 - 600 నానో మీటర్లు

10. 'వైరస్' (VIRUS) లకు ఆహారాన్ని శక్తిగా మార్చుకునే జీవక్రియ సామర్థ్యం లేదు. అందువలన శాస్త్రవేత్తలు వైరస్ లను ఏవిధంగా పరిగణిస్తున్నారు ?
(ఎ) నిర్జీవాలు
(బి) జీవ రూపాలు
(సి) జీవ రసాయనాలు
(డి) జీవులకు, రసాయనాలకు మధ్యనున్న ప్రత్యేక తరగతి     



కీ (GK TEST-38 DATE : 2020 MAY 8)
1) సి 2) సి 3) ఎ 4) సి 5) బి 6) బి 7) ఎ 8) సి 9) బి 10) డి

All the best by www.gkbitsintelugu.blogspot.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి