"కొవిడ్ కవచ్ ఎలీసా" యాంటీ బాడీ పరీక్ష కిట్
("COVID KAVACH ELISA" ANTIBODY TEST KIT)
- 'ఐసీఎంఆర్' (ICMR) ఆధ్వర్యంలోని "నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ" (NIV - PUNE) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 'ఎలీసా' (ELISA) ఆధారిత యాంటీబాడీ పరీక్ష కిట్లను రూపొందించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం "కొవిడ్ కవచ్ ఎలీసా" (COVID KAVACH ELISA) అని నామకరణం చేసింది.
- "కొవిడ్ కవచ్ ఎలీసా" (COVID KAVACH ELISA) కిట్ల ద్వారా రెండున్నర గంటల్లో ఒకేసారి 90 నమూనాలను పరీక్షించవచ్చు.
- "కొవిడ్ కవచ్ ఎలీసా" (COVID KAVACH ELISA) కిట్లను భారీస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని "జైడూస్ క్యాడిలా" (ZAIDUS CADILA) సంస్థకు బదిలీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి 'హర్షవర్ధన్' వెల్లడించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి