ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, మే 2020, బుధవారం

THE EPIDEMIC DISEASES ACT (AMENDMENT) ORDINANCE 2020

జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం - 1897 (సవరణ) అత్యవరాదేశం 2020

(THE EPIDEMIC DISEASES ACT (AMENDMENT) ORDINANCE 2020)


  • 'కొవిడ్-19' (COVID-19) రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది పై దాడులకు పాల్పడితే "రూ. 5 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ల జైలు శిక్ష" విధించే అవకాశం కల్పించేలా 'జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం-1897' కి సవరణ (AMENDMENT) ను వెంటనే అమల్లోకి తెస్తూ 'అత్యవసరాదేశం' (ORDINANCE) జారీ చేయాలని ప్రధాన మంత్రి 'నరేంద్ర మోదీ' అధ్యక్షతన 2020 ఏప్రిల్ 22 న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తీర్మానించింది.
  • వైద్య సిబ్బంది పై దాడులకు సంబంధించిన కేసుల్లో 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తారు.
  • కోర్టులు ఏడాదిలోపు తీర్పు వెలువరిస్తాయి.
  • వైద్య సిబ్బంది పై చేసే నేరాలన్నీ 'బెయిల్' (BAIL) కు వీల్లేని కేసుల కిందే పరిగణిస్తారు.
  • వైద్యుల వాహనాలు, క్లినిక్ లు, ఇళ్లపై దాడులు చేసి నష్టం కలిగించిన వారి నుంచి ఆ నష్టానికి రెండురెట్ల పరిహారం వసూలు చేస్తారు.
  • కేంద్ర క్యాబినెట్ ప్రతిపాదించిన ఈ 'అత్యవసరాదేశం' (ORDINANCE) ను రాష్ట్రపతి 'రామ్ నాథ్ కోవింద్' 2020 ఏప్రిల్ 22 రాత్రి ఆమోదించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి