జస్టిస్ బి.శేషశయనారెడ్డి కమిటీ
(JUSTICE B.SESHASAYANAREDDY COMMITTEE)
- 2020 మే 7 న విశాఖపట్నం శివారు గ్రామం 'ఆర్.ఆర్.వెంకటాపురం' లో ఉన్న "ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" పరిశ్రమలో 'స్టైరీన్' వాయువు నుంచి లీకైన ఆవిర్లు వలన 12 మంది మరణించారు.
- ఈ ఘటనపై మీడియా కథనాల ఆధారంగా 'సుమోటో' గా కేసును విచారించిన 'జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్' నేతృత్వంలోని "జాతీయ హరిత ట్రైబ్యునల్" (NGT) ధర్మాసనం "ప్రమాద తీవ్రత ... పరిణామాలపై" విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి "జస్టిస్ బి.శేషశయనారెడ్డి" నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
'కమిటీ' పరిశీలించవలసిన అంశాలు :
- ప్రమాద ఘటన పరిణామాలు, గ్యాస్ లీక్ వైఫల్యానికి కారణాలు, ఇందుకు బాధ్యులైన అధికారులు, వ్యక్తులు, ప్రాణ నష్టం, ప్రజా ఆరోగ్యం, జీవరాశులు, నేల, నీరు, వాయు, పర్యావరణానికి వాటిల్లిన నష్టంపై కమిటీ నివేదిక ఇవ్వాలని 'ఎన్ జీ టీ' (NGT) పేర్కొంది.
- పరిహారం చెల్లింపునకు, ప్రమాదం పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలు, అవాంఛనీయ సమస్యలపై నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.
'కమిటీ' సభ్యులు :
- ప్రొ. సి.హెచ్.వి.రామచంద్రమూర్తి - ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్
- ప్రొ. పులిపాటి కింగ్ - ఆంధ్రా యూనివర్సిటీ కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి
- కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సభ్యకార్యదర్శి
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) డైరెక్టర్
- నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) అధిపతి
- కమిటీకి అవసరమైన సాంకేతిక, ఇతర సహాయాలను చేయాలని 'కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి' (CPCB) ని "జాతీయ హరిత ట్రైబ్యునల్" (NGT) ధర్మాసనం ఆదేశించింది.
- నివేదిక తయారీకి అవసరమైతే నిపుణులు, వ్యక్తులు, సంస్థల సహాయాన్ని తీసుకునే స్వేచ్ఛ కమిటీకి ఉందని ధర్మాసనం పేర్కొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి