మన పాలన - మీ సూచన
(MANA PAALANA - MEE SOOCHANA)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా 'ఏడాదిలో ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలు' పై 2020 మే 25 నుంచి 2020 మే 29 వరకు "మన పాలన - మీ సూచన" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రణాళికా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి విజయకుమార్ తెలిపారు.
- ప్రజల ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్లాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.
- ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై నేరుగా లబ్దిదారులతోపాటు ముఖ్య నేతలు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- ప్రతీరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు సమీక్ష ఉంటుంది.
- అనంతరం ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుని వాటిని క్రోడీకరించి లక్ష్యాలు రూపొందిస్తారు.
'మన పాలన - మీ సూచన' కార్యక్రమ వివరాలు :
| తేదీ | కార్యక్రమం |
|---|---|
| 2020 మే 25 | పరిపాలనా సంస్కరణలు, సంక్షేమం |
| 2020 మే 26 | వ్యవసాయం, అనుబంధ రంగాలు |
| 2020 మే 27 | విద్యారంగ సంస్కరణలు, పథకాలు |
| 2020 మే 28 | పరిశ్రమలు, పెట్టుబడుల రంగం |
| 2020 మే 29 | ఆరోగ్య రంగం, సంస్కరణలు, ఆరోగ్యశ్రీ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి