ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, మే 2020, మంగళవారం

ReSTART PACKAGE

"రీస్టార్ట్" ప్యాకేజీ

("ReSTART" PACKAGE) 


  • 'కరోనా' (CORONA) నేపథ్యంలో, లాక్ డౌన్ కారణంగా మూతపడిన 'సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు' (MSME ⇒ MICRO, SMALL and MEDIUM ENTERPRISES) ను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,110 కోట్లతో "రీస్టార్ట్" (ReSTART) ప్యాకేజీని ప్రకటించింది.
  • 2020 మే 22 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో "రీస్టార్ట్" (ReSTART) ప్యాకేజీని ప్రారంభించారు.

 "రీస్టార్ట్" (ReSTART) ప్యాకేజీ పథకం ప్రయోజనాలు :

  1. MSME ల బలోపేతానికి, గత ప్రభుత్వం పెట్టిన రూ. 827.5 కోట్ల బకాయిలతో సహా మొత్తం రూ. 904.80 కోట్ల మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదల.
  2. లాక్ డౌన్ కాలంలో 3 మాసాల విద్యుత్ బిల్లులపై రూ. 187.80 కోట్ల మేరకు స్థిర విద్యుత్ చార్జీల మాఫీ.
  3. నిర్వహణ మూలధన రుణాలకు రూ. 200 కోట్లతో 'నిధి' (CORPUS FUND) ఏర్పాటు. 6% నుండి 8% వరకు వడ్డీకి రూ. 2 - 10 లక్షల వరకు రుణాలు అందిస్తారు. దీనిపై ఆరు నెలలు మారటోరియం ఉంటుంది. తర్వాత మూడేళ్లలో రుణం చెల్లించవచ్చు.
  4. MSME లకు 'టెండర్ సెట్ల ఫీజు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD ⇒ EARNEST MONEY DEPOSIT), కనీస టర్నోవర్' నిబంధనల నుండి మినహాయింపు.
  5. ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసే వస్తు సేవల్లో కనీసం 25% MSME ల నుండి కొనుగోలు చేయాలి. అందులో 4% ఎస్సీ, ఎస్టీ యాజమాన్యాలు నిర్వహిస్తున్న సంస్థల నుండి, 3% మహిళా యాజమాన్యాలు నిర్వహిస్తున్న సంస్థల నుండి కొనుగోలు.
  6. MSME ల నుండి వివిధ ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసిన వస్తు సేవలకు 45 రోజుల్లోగా చెల్లింపులు.
  7. 2020 ఫిబ్రవరి 29 నాటికి ప్రామాణిక ఖాతాలు నిర్వహిస్తున్న MSME లకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 'అదనపు నిర్వహణ మూలధనం పరిమితి 20% పెంపు.
  8. రుణ ఒత్తిడిలో ఉన్న MSME లకు వాటి ఈక్విటీ లో 15% కు సమానంగా గరిష్ఠంగా రూ. 75 లక్షల వరకు బ్యాంకు రుణాల మంజూరు.
  9. రాష్ట్రంలో మొత్తం లక్ష వరకు ఉన్న MSME ల ద్వారా దాదాపు 10 లక్షల మందికి ఉపాధి.
  • పై ప్రయోజనాలను పొందడానికి ఆన్ లైన్ పోర్టల్ http://www.apindustries.gov.in/restart-package లో పరిశ్రమల శాఖ డైరెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలి.

సహాయం కొరకు :

  1. హెల్ప్ డెస్క్ నంబర్ : 0866 - 2530665 (సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు)
  2. e-mail id : singledesk-inds@ap.gov.in

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి