1. 1882 మార్చ్ 24 న 'క్షయ' (
TB ⇒ TUBERCULOSIS) వ్యాధి కి ఒక బాక్టీరియా కారణమవుతుందని కనుగొన్న శాస్త్రవేత్త "రాబర్ట్ కాక్" (
ROBERT KOCH) ఏ దేశస్థుడు ?
(ఎ) ఫ్రాన్స్
(బి) బ్రిటన్
(సి) అమెరికా
(డి) జర్మనీ
2. "ద సీడ్ ఈజ్ నథింగ్, ద సాయిల్ ఈజ్ ఎవ్రీథింగ్" (THE SEED IS NOTHING, THE SOIL IS EVERYTHING) అన్నది ఏ ప్రముఖ శాస్త్రవేత్త సూక్తి ?
(ఎ) రాబర్ట్ కాక్
(బి) లూయీ పాశ్చర్
(సి) ఛార్లెస్ డార్విన్
(డి) గ్రెగర్ మెండల్
3. సరియైన జతను గుర్తించండి ?
| " ఫ్లూ " పేరు | ప్రబలిన సంవత్సరం |
| (A) స్వైన్ ఫ్లూ | (a) 1968 |
| (B) స్పానిష్ ఫ్లూ | (b) 1918 |
| (C) హాంగ్ కాంగ్ ఫ్లూ | (c) 2009 |
| (D) ఆసియా ఫ్లూ | (d) 1957 |
(ఎ) (A) ⇒ (c), (B) ⇒ (b), (C) ⇒ (a), (D) ⇒ (d)
(బి) (A) ⇒ (a), (B) ⇒ (b), (C) ⇒ (c), (D) ⇒ (d)
(సి) (A) ⇒ (d), (B) ⇒ (b), (C) ⇒ (c), (D) ⇒ (a)
(డి) (A) ⇒ (b), (B) ⇒ (c), (C) ⇒ (d), (D) ⇒ (a)
4. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ?
(ఎ) కమల్ నాథ్
(బి) జ్యోతిరాదిత్య సింధియా
(సి) శివరాజ్ సింగ్ చౌహాన్
(డి) ఉమాభారతి
5. 'ఐపీసీ' (IPC ⇒ INDIAN PENAL CODE) సెక్షన్ 269 ప్రకారం "ప్రాణాలకు ముప్పు కలిగించే వైరస్ లు, ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేసే నిర్లక్ష్యపూరిత చర్యలకు పాల్పడితే" విధించే జైలు శిక్ష ?
(ఎ) ఆరు నెలల వరకు జైలు శిక్ష
(బి) ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా
(సి) ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా లేకపోతే రెండూ ...
(డి) ఒక సంవత్సరం జైలు శిక్ష
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి 'కరోనా' కేసు ఎక్కడ నమోదైంది ?
(ఎ) నెల్లూరు
(బి) ఒంగోలు
(సి) విజయవాడ
(డి) విశాఖపట్నం
7. 2020 మార్చ్ 10 న భారతదేశంలో తొలి 'కరోనా' మరణం తెలంగాణ రాష్ట్రంలోని 'హైదరాబాద్' (HYDERABAD) లో నమోదైంది. ఆ మృతుడి స్వరాష్ట్రం ?
(ఎ) తెలంగాణ
(బి) కర్ణాటక
(సి) కేరళ
(డి) మహారాష్ట్ర
8. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన నూతన "డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్" (
Drugs & Cosmotics new rules) నిబంధనల ప్రకారం బ్లడ్ బ్యాంకులను నూతనంగా ఏ పేరుతొ పిలవాలి ?
(ఎ) బ్లడ్ హాస్పిటల్స్
(బి) బ్లడ్ సెంటర్స్
(సి) బ్లడ్ రిజర్వ్స్
(డి) బ్లడ్ పార్క్స్
9. కోటి జనాభా ఉన్న నగరాల్లో మహిళలకు భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా ఏ రంగు బస్సులను నడపాలని ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' లోక్ సభలో వెల్లడించారు ? (ఈ బస్సుల్లో ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ కూడా మహిళలే ఉంటారు)
(ఎ) ఆకుపచ్చ రంగు
(బి) నారింజ రంగు
(సి) పసుపు రంగు
(డి) గులాబీ రంగు
10. 2020 మార్చ్ 24 (మంగళవారం) అర్ధరాత్రి నుంచి ఎన్ని రోజులపాటు దేశాన్ని పూర్తిగా "లాక్ డౌన్" (LOCKDOWN) చేస్తున్నట్లు భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రకటించారు ?
(ఎ) 11 రోజులు
(బి) 21 రోజులు
(సి) 31 రోజులు
(డి) 30 రోజులు
కీ (GK TEST-14 DATE : MARCH 27)
1) డి 2) బి 3) ఎ 4) సి 5) సి 6) ఎ 7) బి 8) బి 9) డి 10) బి
All the best by www.gkbitsintelugu.blogspot.com