ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, జనవరి 2022, ఆదివారం

జి.కె.టెస్ట్-1 సంవత్సరం : 2022 ∣ GK TEST-1 YEAR : 2022 GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS

WELCOME TO GK BITS IN TELUGU

1. 2021 డిసెంబర్ 31న వర్షం అంతరాయం కలిగించిన ఫైనల్లో భారత్ 'డక్ వర్త్ లూయిస్ పధ్ధతి' (DLS) ప్రకారం 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి "అండర్-19 ఆసియా కప్" (U-19 ASIA CUP) ను గెలుచుకుంది. భారత్ అండర్-19 ఆసియా కప్ ను గెలవడం ఇది ఎన్నో సారి ? [మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 38 ఓవర్లలో 9 వికెట్లకు 106 పరుగులు చేసింది. అనంతరం 102 పరుగులకు కుదించిన లక్ష్యాన్ని యువ టీమ్ ఇండియా 21.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి అందుకుంది]

(ఎ) 6

(బి) 7

(సి) 8

(డి) 9


2. 2022 జనవరి 19న దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ (INDIA Vs SOUTH AFRICA) లో భారత జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించేదెవరు ? [బుమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు]

(ఎ) విరాట్ కోహ్లి

(బి) రోహిత్ శర్మ

(సి) కేఎల్ రాహుల్

(డి) శిఖర్ ధావన్


3. 3డీ ఎఫెక్ట్, సిల్వర్ కోటింగ్ తో ప్రత్యేకంగా రూపొందించిన 6 పేజీల తితిదే (3D EFFCT, SILVER COATING TTD CALENDARS-2022) ఒక్కో క్యాలెండర్ ధర ఎంత ? [స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యక్షంగా వీక్షించిన అనుభూతి కలిగేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్యాలెండర్లను రూపొందించారు]

(ఎ) రూ. 400

(బి) రూ. 450

(సి) రూ. 500

(డి) రూ. 550


4. తితిదే ఐటీ సలహాదారు (TTD IT ADVISOR) గా 2021 డిసెంబర్ 31న నియమితులైన 'అమర్ నాగారం' ఏ సంస్థకు సీఈఓ (CEO) గా ఉన్నారు ?

(ఎ) మింత్రా

(బి) మీషో

(సి) అజియో

(డి) మోజో


5. విప్లవ రచయితల సంఘం (విరసం) 28వ మహాసభలు 2022 జనవరి 8, 9వ తేదీల్లో ఎక్కడ జరగనున్నాయి ?

(ఎ) రణస్థలం

(బి) రంపచోడవరం

(సి) విజయవాడ

(డి) నెల్లూరు


6. విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు పెంచేందుకు బాలవాటిక (ఒకటో తరగతికి సన్నద్ధత) నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎన్ని రోజులపాటు పఠన ప్రచారం నిర్వహించాలని సమగ్రశిక్ష అభియాన్ ఆదేశాలు జారీ చేసింది ? [జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు అన్ని పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో 2022 జనవరి 6న ప్రచారాన్ని ప్రారంభిస్తారు. చిన్నప్పటి నుంచే పఠనాసక్తిని పెంచేందుకు, స్వతంత్ర పాఠకులుగా, జీవితకాల అభ్యాసకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది]

(ఎ) 50

(బి) 75

(సి) 100

(డి) 125


7. విశాఖపట్నం 'హిందుస్థాన్ షిప్ యార్డ్' లో నిర్మించిన 'బొలార్డ్ టగ్' ను 2021 డిసెంబర్ 31న భారత నౌకాదళానికి అప్పగించారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ సంస్థలో ఇది ఎన్నో నిర్మాణం ? [వరుస ఆర్డర్లలో మూడోదిగా 50 టన్నుల సామర్థ్యం గల 'బీటీ (బొలార్డ్ టగ్) - బాల్ రాజ్' (50 TON BOLLARD PULL TUG (BALRAJ)) కు ఇటీవల సీ ట్రయల్ నిర్వహించినట్లు సంస్థ సీఎండీ 'హేమంత్ ఖత్రీ' (HINDUSTAN SHIPYARD LIMITED CMD) పేర్కొన్నారు]

(ఎ) 197

(బి) 198

(సి) 199

(డి) 200


8. కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి 'నిర్మలా సీతారామన్' ఆధ్వర్యంలో 2021 డిసెంబర్ 31న నిర్వహించిన జీఎస్టీ మండలి సమావేశం (GST COUNCIL MEETING) ఎన్నోది ? [2022 జనవరి 1 నుండి జౌళిరంగం (వస్త్రాలు) పై  5% గా ఉన్న జీఎస్టీని 12% గా పెంచాలనే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలు వ్యతిరేకించడంతో ఈ జీఎస్టీ మండలి సమావేశంలో ఆ ప్రతిపాదనను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పాదరక్షలపై మాత్రం ధరతో సంబంధం లేకుండా 2022 జనవరి 1 నుంచి అన్ని రకాల పాదరక్షలపై 12 శాతం జీఎస్టీ (GST ON FOOTWEAR) అమలవుతుంది. గతంలో రూ. 1,000 లోపు పాదరక్షలపై 5 శాతం జీఎస్టీ విధించేవారు]

(ఎ) 46

(బి) 47

(సి) 48

(డి) 49


9. బ్రిటన్ కు చెందిన సోడియమ్-అయాన్ బ్యాటరీల తయారీ సంస్థ 'ఫారాడియాన్' (FARADION LIMITED) ను రూ. 1,000 కోట్లతో (100 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు) కొనుగోలు చేసిన భారతీయ సంస్థ ?  

(ఎ) హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్

(బి) ఐటీసి లిమిటెడ్

(సి) ఆర్ ఐ ఎల్

(డి) అదానీ గ్రీన్ ఎనర్జీ


10. అరబిందో ఫార్మా నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరిని నియమించారు ? [ఇతను 2024 మే 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు]

(ఎ) బి. ఆదిరెడ్డి

(బి) ఎం. మదన్ మోహన్ రెడ్డి

(సి) పి. శరత్ చంద్రా రెడ్డి

(డి) కె. నిత్యానంద రెడ్డి


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-1 సంవత్సరం : 2022 (GK TEST-1 YEAR : 2022)

1) సి 2) సి 3) బి 4) ఎ 5) డి 6) సి 7) సి 8) ఎ 9) సి 10) డి   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి