1. 'గ్రామ పునర్నిర్మాణ సంస్థ' (VRO) ఆధ్వర్యంలో నిర్మించనున్న 'ప్రొఫెసర్ ఎంఏ విండీ న్యాయసేవా కేంద్రం' భవనానికి 2022 జనవరి 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి 'జస్టిస్ బట్టు దేవానంద్' (JUSTICE BATTU DEVANAND) శంకుస్థాపన చేశారు. ఈ న్యాయసేవా కేంద్రాన్ని గుంటూరు జిల్లాలో ఎక్కడ నిర్మించనున్నారు ?
(ఎ) మంగళగిరి
(బి) నంబూరు
(సి) పెదకాకాని
(డి) గుంటూరు
2. స్వాతంత్ర్య సమర యోధుడు 'అల్లూరి సీతారామరాజు' 125వ జయంతి ఉత్సవాలు ఎన్ని రోజుల వరకు కొనసాగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు ? [విశాఖపట్నం జిల్లా లంబసింగిలో రూ. 38 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు] (125th Birth Anniversary Celebrations of Sri Alluri Sitarama Raju)
(ఎ) 2022 జూలై 1 - 2023 జూలై 1
(బి) 2022 జూలై 2 - 2023 జూలై 2
(సి) 2022 జూలై 3 - 2023 జూలై 3
(డి) 2022 జూలై 4 - 2023 జూలై 4
3. తమ విద్యుత్ వాహన కంపెనీకి సంబంధించిన 'ఆటో పైలట్ టీమ్' లో తొలి ఉద్యోగిగా భారత సంతతికి చెందిన 'అశోక్ ఎల్లుస్వామి' ని నియమించినట్లు టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ 'ఎలాన్ మస్క్' తాజాగా వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీని అశోక్ ఎల్లుస్వామి ఎక్కడ పూర్తి చేశారు ? (Indian-origin Ashok Elluswamy was the first employee of Elon Musk's electric vehicle company's Autopilot Team)
(ఎ) తిరువనంతపురం
(బి) చెన్నై
(సి) బాంబే
(డి) కాన్పూర్
4. నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ లేబొరేటరీ 70వ వార్షికోత్సవాలను 2022 జనవరి 2న కొచ్చిలో ప్రారంభించినది ? [Naval Physical and Oceanographic Laboratory]
(ఎ) రామ్ నాథ్ కోవింద్
(బి) ఎం.వెంకయ్యనాయుడు
(సి) నరేంద్ర మోదీ
(డి) ఓం బిర్లా
5. 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం' (Indian Institute of Management Visakhapatnam) రెండు సంవత్సరాల ఎంబీఏ (MBA) కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవేశాల కోసం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ? [పూర్తి వివరాలకు www.iimv.ac.in/pgpex వెబ్ సైట్ ను సందర్శించగలరు]
(ఎ) 2022 మే 1
(బి) 2022 మే 2
(సి) 2022 మే 3
(డి) 2022 మే 4
6. భారతదేశంలోనే మూడో ఇథనాల్ పరిశ్రమను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని క్రిబ్కో చైర్మన్ 'చంద్రపాల్ సింగ్' అన్నారు ? (రైతులు పండించే వరి, మొక్కజొన్న పంటల్లో 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి ఏటా 8 కోట్ల లీటర్ల ఇథనాల్ తయారీ చేయనున్నట్లు వెల్లడించారు) [Krishak Bharati Cooperative Limited (KRIBHCO)]
(ఎ) గుజరాత్
(బి) ఆంధ్రప్రదేశ్
(సి) తెలంగాణ
(డి) ఉత్తర్ ప్రదేశ్
7. అంతర్జాతీయ క్రికెట్ లో 10,000 పరుగుల మైలురాయిని దాటి భారతదేశంలోనే ఆ ఘనత సాధించిన మొదటి మహిళా క్రికెటర్ గా 'మిథాలీరాజ్' (MITHALI RAJ) చరిత్ర సృష్టించింది. ఈ విషయానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఆమెది ఎన్నో స్థానం ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
8. భారత గణతంత్ర వేడుకల సందర్భంగా 'ఎంఐజీ-21 బైసన్ ఫైటర్' విమానాన్ని నడిపి తన సత్తా చూపి .. మొదటి మహిళా ఫైటర్ పైలట్ గా నిలిచినది ? [ఈమె భారత వైమానిక దళంలో విమానం ద్వారా యుద్ధంలో పాల్గొనే అర్హత సాధించింది. ఈ అమ్మాయి రాజస్థాన్ ఎయిర్ బేస్ లో సేవలందిస్తోంది]
(ఎ) అవని చతుర్వేది
(బి) మోహనా సింగ్
(సి) భావనా కాంత్
(డి) ప్రియా రమణి
9. భారత జాతీయ భద్రత ఉప సలహాదారుగా ఎవరిని నియమించారు ? [Deputy National Security Advisor]
(ఎ) డాక్టర్ జి.సతీష్ రెడ్డి
(బి) ప్రదీప్ కుమార్ రావత్
(సి) అజయ్ భూషణ్ పాండే
(డి) విక్రమ్ మిశ్రి
10. 2021వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'వైఎస్సార్ వాహన మిత్ర' పథకం (YSR VAHANA MITRA SCHEME) అమల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా ? [ఈ జిల్లాలో మొత్తం 35,413 మంది లబ్ధిదారులకు రూ. 35.41 కోట్ల ఆర్ధిక సాయం అందించారు]
(ఎ) వైఎస్సార్ కడప
(బి) గుంటూరు
(సి) కృష్ణా
(డి) విశాఖపట్నం
కీ (KEY)
జి.కె.టెస్ట్-6 ; సంవత్సరం : 2022 (GK TEST-6 ; YEAR : 2022)
1) సి 2) డి 3) బి 4) బి 5) బి 6) సి 7) బి 8) సి 9) డి 10) డి
E&OE. (Errors and Omissions Expected)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి