ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, జనవరి 2022, బుధవారం

జి.కె.టెస్ట్-5 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-5 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. వచ్చే విద్యా సంవత్సరం (2022-23) జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహణ బాధ్యత ఏ ఐఐటీ చేపట్టింది (JEE ADVANCED 2022-23) ?

(ఎ) ఐఐటీ-ఖరగ్ పూర్  

(బి) ఐఐటీ-బాంబే 

(సి) ఐఐటీ-మద్రాస్

(డి) ఐఐటీ-కాన్పూర్


2. 'పొగాకు నమలడం' ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006 (FSS ACT) లోని సెక్షన్ 3(1)(జె) లో పేర్కొన్న 'ఆహరం' అనే నిర్వచనం కిందికి రాదని తేల్చిచెప్పిన హైకోర్టు ?

(ఎ) ఆంధ్రప్రదేశ్

(బి) తెలంగాణ

(సి) మహారాష్ట్ర

(డి) ఒడిషా 


3. 32వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని (BOOK FESTIVAL AT VIJAYAWADA) రాజ్ భవన్ నుంచి వెబినార్ విధానంలో గవర్నర్ 'బిశ్వభూషణ్ హరిచందన్' 2022 జనవరి 1న ప్రారంభించారు. ఈ పుస్తక మహోత్సవ ప్రాంగణానికి ఏ పేరు పెట్టారు ? [ఈ పుస్తక మహోత్సవంలో 210 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అన్ని స్టాళ్లలో కలిపి 7 లక్షల నుంచి 10 లక్షల పుస్తకాలు కొలువుదీరాయి. ప్రదర్శనలో ఉంచిన ప్రతి పుస్తకంపై 10 శాతం రాయితీ ఇస్తున్నారు]

(ఎ) డాక్టర్ యలపర్తి నాయుడమ్మ

(బి) కాళీపట్నం రామారావు

(సి) నవోదయ రామ్మోహనరావు 

(డి) సిరివెన్నెల సీతారామశాస్త్రి 


4. భారతదేశంలో గతంలో జరిగిన ప్రధాన తొక్కిసలాటల్లో .. 2005 జనవరి 25న అత్యధికంగా 340 మంది ఎక్కడ జరిగిన తొక్కిసలాటలో మరణించారు ? [2022 జనవరి 1న జమ్ము లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయంలో రెండు యువజన బృందాల మధ్య మొదలైన చిన్న వాగ్వాదం .. చివరకు తొక్కిసలాటకు దారితీసి 12 నిండు ప్రాణాలను బలితీసుకుంది]

(ఎ) దతియా జిల్లా, మధ్యప్రదేశ్  

(బి) బిలాస్ పూర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్

(సి) జోధ్ పూర్, రాజస్థాన్

(డి) సతారా జిల్లా, మహారాష్ట్ర


5. ఎలాన్ మస్క్ (ELON MUSK) తీసుకురానున్న టెస్లా మొబైల్ స్మార్ట్ ఫోన్ పేరేమిటి ? [ఈ స్మార్ట్ ఫోన్ లో 'స్టార్ లింక్' టెక్నాలజీని పొందుపరచనున్నారు. ఈ ఫోన్ తీసుకుని అంతరిక్షంలోకి .. మార్స్ కు సైతం వెళ్లినా, అక్కడి నుంచి భూమి మీద ఉన్న వారితో మాట్లాడొచ్చన్నమాట. ఈ ఫోన్ ను సౌర శక్తితో ఛార్జ్ చేయొచ్చు]

(ఎ) తురాయ

(బి) ఇరిడియమ్ 

(సి) పై

(డి) మార్స్


6. భారతదేశంలో జీఎస్టీ వసూళ్లు 2021 డిసెంబర్ లో 13 శాతం పెరిగి ఎంతగా నమోదయ్యాయి ? [2020 డిసెంబర్ లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.15 లక్షల కోట్లుగా ఉన్నాయి]

(ఎ) రూ. 1.09 లక్షల కోట్లు

(బి) రూ. 1.19 లక్షల కోట్లు

(సి) రూ. 1.29 లక్షల కోట్లు

(డి) రూ. 1.39 లక్షల కోట్లు


7. 2022 జనవరి 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' ఎన్నో విడత కింద రైతుల ఖాతాల్లోకి రూ. 20,900 కోట్లు బదిలీ చేశారు ? (PRADHAN MANTRI KISAN SAMMAN NIDHI)

(ఎ) 7

(బి) 8

(సి) 9

(డి) 10


8. ఏసంవత్సరం నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తొలగించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?

(ఎ) 2060

(బి) 2070

(సి) 2080

(డి) 2090


9. చారిత్రక కోరేగావ్ భీమా యుద్ధ (KOREGAON BHIMA BATTLE) 204వ వార్షికోత్సవాలు జరిగిన తేదీ ? [ఈ సందర్బంగా మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉన్న 'జయ్ స్తంభ్' సైనిక స్మారకం వద్ద నివాళులు అర్పించేందుకు 4 లక్షలకు పైగా జనం పోటెత్తారు]   

(ఎ) 2022 జనవరి 1

(బి) 2022 జనవరి 2

(సి) 2022 జనవరి 3

(డి) 2022 జనవరి 4


10. అణు కేంద్రాలపై పరస్పరం దాడులు చేసుకోరాదన్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్, పాక్ లు 1988లో కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ? [భారత్, పాకిస్థాన్ లు 2022 జనవరి 1న తమ అణు కేంద్రాల జాబితాలను ఇచ్చి పుచ్చుకున్నాయి] (Non-nuclear aggression agreement between India and Pakistan)

(ఎ) 1988

(బి) 1989

(సి) 1990

(డి) 1991


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-5 ; సంవత్సరం : 2022 (GK TEST-5 ; YEAR : 2022)

1) బి 2) ఎ 3) సి 4) డి 5) సి 6) సి 7) డి 8) బి 9) ఎ 10) డి   


E&OE. (Errors and Omissions Expected)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి