ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, జనవరి 2022, మంగళవారం

జి.కె.టెస్ట్-4 ; సంవత్సరం : 2022 ∣ GK TEST-4 ; YEAR : 2022 (GK AND CURRENT AFFAIRS QUESTIONS AND ANSWERS IN TELUGU)

WELCOME TO GK BITS IN TELUGU

1. హరిత హైడ్రోజన్ తో విద్యుత్తును ఉత్పత్తి చేసే పైలట్ ప్రాజెక్ట్ ను భారతదేశంలోనే తొలిసారిగా ఎన్టీపీసీ (NTPC) ఎక్కడ నిర్మిస్తోంది ? [50 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న స్టాండలోన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత హరిత హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బెంగళూరుకు చెందిన 'బ్లూమ్ ఎనర్జీ ఇండియా' సంస్థకు అప్పగించారు]

(ఎ) కోర్బా

(బి) విశాఖపట్నం

(సి) రామగుండం

(డి) దుర్గాపూర్


2. ప్రకృతి సేద్య విధానంపై పాఠ్య ప్రణాళిక రూపొందించేందుకు 'ప్రవీణ్ రావు' అధ్యక్షతన ఏడుగురితో కూడిన కమిటీని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) నియమించింది. ప్రవీణ్ రావు ఏ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా వ్యవహరిస్తున్నారు ?

(ఎ) ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ

(బి) ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం

(సి) శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం

(డి) డా. వైస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం


3. అంకుర దశలో ఉండగానే ఎంత టర్నోవర్ వ్యాపారం చేసిన వారిని వ్యాపార పరిభాషలో 'యూనికార్న్ ఎంట్రపెన్యూర్స్' (UNICORN ENTREPRENEURS) అంటారు ?

(ఎ) రూ. 7,500 కోట్లు

(బి) రూ. 8,500 కోట్లు

(సి) రూ. 9,500 కోట్లు

(డి) రూ. 6,500 కోట్లు


4. భారత మీడియా, వినోద పరిశ్రమ ఏ సంవత్సరానికల్లా 10-12 శాతం వార్షిక వృద్ధితో 55-70 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4.1-5.25 లక్షల కోట్లు) స్థాయికి చేరే అవకాశం ఉందని సీఐఐ-బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (CII-BOSTON CONSULTING GROUP) సంయుక్త నివేదిక అంచనా వేసింది ? ['బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ ఫర్ ది న్యూ డికేడ్ : వే ఫార్వార్డ్ ఫర్ ఇండియన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ' పేరిట ఈ నివేదికను వెలువరించారు]

(ఎ) 2025

(బి) 2030

(సి) 2035

(డి) 2040


5. కొవిడ్ ఒమిక్రాన్ అనిశ్చితుల నేపథ్యంలో .. బ్యాంకుల్లో కేవైసీ నవీకరణకు గడువును ఆర్బీఐ ఏ తేదీ వరకు పొడిగించింది (LAST DATE FOR KYC UPDATE IN BANKS) ?

(ఎ) 2022 జనవరి 31

(బి) 2022 ఫిబ్రవరి 28

(సి) 2022 మార్చ్ 31

(డి) 2022 ఏప్రిల్ 30


6. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న 'సోమ శంకర ప్రసాద్' ను ఏ బ్యాంక్ కు మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా నియమించారు ?

(ఎ) పంజాబ్ నేషనల్ బ్యాంక్

(బి) ఇండియన్ బ్యాంక్

(సి) కెనరా బ్యాంక్

(డి) యూకో బ్యాంక్


7. జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదార్లు వార్షిక రిటర్న్ (ANNUAL RETURN BY GST PAYERS) గా ఏ ఫార్మ్ ను సమర్పిస్తారు ? [రూ. 2 కోట్లకు మించి టర్నోవర్ ఉన్న వ్యాపారులు జీ ఎస్ టీ ఆర్ - 9 ను సమర్పించడం తప్పనిసరి. రూ. 5 కోట్లకు మించి టర్నోవర్ ఉంటే జీ ఎస్ టీ ఆర్ - 9సి సమర్పించాల్సి ఉంటుంది]

(ఎ) జీ ఎస్ టీ ఆర్ - 1

(బి) జీ ఎస్ టీ ఆర్ - 3బి

(సి) జీ ఎస్ టీ ఆర్ - 9

(డి) జీ ఎస్ టీ ఆర్ - 9సి


8. భారత క్రికెట్ జట్టు (TEAM INDIA) 2021వ సంవత్సరంలో మొత్తం ఎన్ని టెస్ట్ మ్యాచ్ లలో విజయం సాధించింది ? [2021వ సంవత్సరంలో భారత బౌలర్లు ప్రత్యర్థులను 200 స్కోర్ లోపు 12 సార్లు ఆల్ అవుట్ చేశారు. ఓ క్యాలెండర్ ఏడాదిలో ఇంగ్లాండ్ (1978లో 13 సార్లు) మాత్రమే భారత్ కన్నా ఎక్కువ సార్లు ప్రత్యర్థులను రెండొందల లోపు ఆల్ అవుట్ చేసింది]  

(ఎ) 7

(బి) 8

(సి) 9

(డి) 10


9. సామాజిక భద్రత పింఛన్లను రూ. 2,250 నుంచి రూ. 2,500కు పెంచే కార్యక్రమాన్ని 2022 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' గుంటూరు జిల్లాలో ఎక్కడి నుండి శ్రీకారం చుట్టారు (YSR PENSION KANUKA) ? 

(ఎ) పొన్నూరు

(బి) చిలకలూరిపేట

(సి) నరసరావుపేట

(డి) ప్రత్తిపాడు


10. 1 నుంచి 9 తరగతులకు ఏ తేదీని చివరి పనిదినం గా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ (LAST WORKING DAY IN ANDHRA PRADESH SCHOOLS) ప్రకటించింది ? [పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 (SUMMATIVE-1) పరీక్షలను 2022 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు నిర్వహించనున్నారు. ఫార్మాటివ్-3, 4 (FORMATIVE-3, 4) పరీక్షలను ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో నిర్వహిస్తారు. సమ్మేటివ్-2 పరీక్ష ఏప్రిల్ లో ఉంటుంది]

(ఎ) 2022 ఏప్రిల్ 24

(బి) 2022 ఏప్రిల్ 30

(సి) 2022 మే 7

(డి) 2022 మే 14


 కీ  (KEY)

జి.కె.టెస్ట్-4 ; సంవత్సరం : 2022 (GK TEST-4 ; YEAR : 2022)

1) బి 2) బి 3) ఎ 4) బి 5) సి 6) డి 7) సి 8) బి 9) డి 10) బి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి