1. అధునాతన రఫేల్ యుద్ధ విమానాలను భారత్ సమకూర్చుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ 25 బహుళ ప్రయోజన జె-10సి ఫైటర్ జెట్ (J-10C FIGHTER JET) లను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది ? [2022 మార్చ్ 23న జరిగే పాకిస్థాన్ జాతీయ దినోత్సవంలో ఈ ఫైటర్ జెట్ లను తొలిసారి ప్రదర్శించనున్నారు]
(ఎ) చైనా
(బి) అమెరికా
(సి) రష్యా
(డి) ఫ్రాన్స్
2. 2021 డిసెంబర్ 26న రాయ్ పుర్ (ఛత్తీస్ గఢ్ రాష్ట్రం) లో జరిగిన ధర్మసంసద్ సభలో భారత జాతిపిత మహాత్మా గాంధీని దూషించిన 'కాళీచరణ్ మహారాజ్' (KALI CHARAN MAHARAJ) ఏ రాష్ట్రానికి చెందినవాడు ? [కాళీచరణ్ మహారాజ్ ను 2021 డిసెంబర్ 30న మధ్యప్రదేశ్ లోని ఖజురహోలో ఛత్తీస్ గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు]
(ఎ) మధ్యప్రదేశ్
(బి) మహారాష్ట్ర
(సి) ఛత్తీస్ గఢ్
(డి) రాజస్థాన్
3. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 'ఝాన్సీ' రైల్వే స్టేషన్ (JHANSI RAILWAY STATION) పేరును "వీరాంగణ లక్ష్మీబాయి" రైల్వే స్టేషన్ గా మార్పు చేసింది. దీనికి సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు లేఖ రాసింది ? [ఉత్తర్ ప్రదేశ్ (UTTAR PRADESH) ప్రభుత్వం ఇప్పటికే మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ పేరును 'దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్' గా, ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును 'అయోధ్య జంక్షన్' గా మార్చింది. అలాగే ఫైజాబాద్, అలహాబాద్ జిల్లాల పేర్లను 'అయోధ్య, ప్రయాగ్ రాజ్' లుగా మార్పు చేసింది]
(ఎ) 2021 నవంబర్ 21
(బి) 2021 నవంబర్ 22
(సి) 2021 నవంబర్ 23
(డి) 2021 నవంబర్ 24
4.
అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు అధికారిక చైనీస్ పేర్లు
పెడుతున్నట్లు చైనా తాజాగా ప్రకటించింది. ఇంతకముందు ఇదేవిధంగా ఏ సంవత్సరంలో
అరుణాచల్ ప్రదేశ్ లోని 6 ప్రాంతాలకు తమ అధికారిక పేర్లను చైనా పెట్టింది ?
[ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ (ARUNACHAL PRADESH) ను తమ భూభాగమని చైనా చాలా
సంవత్సరాలుగా వాదిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని 'జన్ గ్నాన్' అని
చైనీస్ పేరుతో పిలుస్తోంది]
(ఎ) 2013
(బి) 2015
(సి) 2017
(డి) 2019
5. ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) నాన్ ఏసీ బస్సుల్లో ఆర్టీసీయేతర వెబ్ సైట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై 2022 జనవరి 1 నుంచి ఎంత శాతం జీఎస్టీ విధించనున్నారు ? [ఆర్టీసీ వెబ్ సైట్, బుకింగ్ కౌంటర్లు, ఏజెంట్ల వద్ద టిక్కెట్లు తీసుకుంటే ఈ జీఎస్టీ వర్తించదు]
(ఎ) 5%
(బి) 12%
(సి) 18%
(డి) 20%
6. ప్రముఖ కవి, తెలంగాణ శాసనమండలి సభ్యుడు 'గోరటి వెంకన్న' (GORETI VENKANNA) కు 2021వ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ (SAHITYA AKADEMI) పురస్కారం లభించింది. అతను రచించిన ఏ కవితా సంకలనానికి ఈ పురస్కారం లభించింది ? [దేశవ్యాప్తంగా 20 భాషల్లో వెలువడిన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర సాహిత్య పురస్కారం కింద రూ. లక్ష, తామ్ర పత్రం ప్రదానం చేస్తారు]
(ఎ) నీటి మనసు
(బి) వల్లంకి తాళం
(సి) సహృదయ సాహిత్య విమర్శ వైవిధ్యం
(డి) కొండపొలం
7. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ కు తగుళ్ల గోపాల్ రచించిన కవితా సంకలనం 'దండకడియం' ఎంపికైంది. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ కు ఎంపికైన వారికి అందించే నగదు బహుమతి ఎంత ? [తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండలం లోని 'కలకొండ' అనే గ్రామం తగుళ్ల గోపాల్ యొక్క స్వగ్రామం]
(ఎ) రూ. 50,000
(బి) రూ. 1,00,000
(సి) రూ. 1,50,000
(డి) రూ. 2,00,000
8. కేంద్ర సాహిత్య బాల పురస్కారానికి దేవరాజు మహారాజు రచన 'నేను అంటే ఎవరు ?' (ఒక వైజ్ఞానిక వివరణ) ఎంపికైంది. దేవరాజు మహారాజు ఏ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు ? [తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం లోని 'వడపర్తి' అనే గ్రామం దేవరాజు మహారాజు యొక్క స్వగ్రామం]
(ఎ) భౌతికశాస్త్రం
(బి) రసాయనశాస్త్రం
(సి) వృక్షశాస్త్రం
(డి) జంతుశాస్త్రం
9. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంత మందికి 'కీర్తి' పురస్కారాలను ప్రకటించింది ? [ఈ పురస్కారం కింద రూ. 5,116 నగదుతో పాటు పురస్కార పత్రాన్ని అందజేస్తారు]
(ఎ) 41
(బి) 42
(సి) 43
(డి) 44
10. కరోనా వైరస్ తో బడులు మూతపడిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం ప్రైవేటు పాఠశాలలు మాత్రమే ఆన్లైన్ తరగతులు నిర్వహించాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 'డిజిటల్ విద్యా నివేదిక' (INDIA DIGITAL REPORT) పేర్కొంది ?
(ఎ) 36%
(బి) 37%
(సి) 38%
(డి) 39%
కీ (KEY)
జి.కె.టెస్ట్-3 ; సంవత్సరం : 2022 (GK TEST-3 ; YEAR : 2022)
1) ఎ 2) బి 3) డి 4) సి 5) ఎ 6) బి 7) ఎ 8) డి 9) డి 10) డి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి