1. 2020వ సంవత్సరానికి సంబంధించి అనువాద విబాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2020 (SAHITYA AKADEMI AWARD-2020) ను అందుకున్న కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన సాహితీవేత్త ? [2021 డిసెంబర్ 30న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ 'చంద్రశేఖర కంబార' చేతుల మీదుగా ఆయన జ్ఞాపిక, పురస్కారం స్వీకరించారు. ప్రముఖ కన్నడ రచయిత 'శాంతినాధ్ దేశాయ్' రచించిన 'ఓం నమో' పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడంతో ఆ విభాగంలో తనకు గతంలో పురస్కారం ప్రకటించారు]
(ఎ) రంగనాథ రామచంద్రరావు
(బి) అమ్మంగి వేణుగోపాల్
(సి) సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి
(డి) జి. శ్రీరామమూర్తి
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 డిసెంబర్ 31 నాటికి నమోదైన మొత్తం 'ఒమిక్రాన్' (OMICRON) కేసుల సంఖ్య ?
(ఎ) 15
(బి) 16
(సి) 17
(డి) 18
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15-18 ఏళ్ల మధ్యన ఉన్న బాలబాలికలకు 2022 జనవరి 3 నుంచి జనవరి 7 వరకు తొలి డోసు కింద ఏ కొవిడ్ టీకాను అందించనున్నారు ? [గ్రామ/వార్డు సచివాలయాల కేంద్రంగా ఈ టీకా పంపిణీ జరుగుతుంది. 15-18 ఏళ్ల మధ్యన సుమారు 24 లక్షల మంది బాలబాలికలు ఉన్నారు]
(ఎ) కొవాగ్జిన్
(బి) కొవిషీల్డ్
(సి) స్పుత్నిక్-వి
(డి) జైకొవ్-డి
4. హైదరాబాద్ లోని సీసీఎంబీ (CCMB) సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలోని ప్రభుత్వ సిద్దార్థ వైద్య కళాశాలలో 'జన్యుక్రమ నిర్ధారణ కేంద్రం' (GENOME SEQUENCING LAB) ను ఏర్పాటు చేశారు ? [ఒక్కో జీనోమ్ సీక్వెన్స్ పరీక్షకు రూ. 5,000 ఖర్చవుతుంది. మ్యుటేషన్ ప్రారంభంలో అది ఏ ఉత్పరివర్తనమో తెలుసుకునేందుకు ఈ పరీక్ష అవసరమవుతుంది]
(ఎ) విశాఖపట్నం
(బి) గుంటూరు
(సి) విజయవాడ
(డి) తిరుపతి
5. అమెరికాలో కొవిడ్ 'ఒమిక్రాన్' రకం వైరస్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో .. భారతదేశం ఆవిష్కరించిన 'కొవాగ్జిన్' టీకా (COVAXIN)కు అమెరికాలో సత్వరం అనుమతివ్వాలని 'అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ' (USFDA) కు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసిన మాజీ టెన్నిస్ దిగ్గజం ? [కొవాగ్జిన్ ను అమెరికా, కెనడా దేశాల్లో అందుబాటులోకి తీసుకురావడం కోసం 'భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్' .. అమెరికాలోని ఆక్యుజెన్ ఇంక్ ., అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది]
(ఎ) పీట్ సంప్రాస్
(బి) బోరిస్ బెకర్
(సి) ఇవాన్ లెండిల్
(డి) జిమ్మీ కానర్స్
6. భారతదేశంలో రాజకీయ పార్టీలకు సమకూరే విరాళాల్లో పారదర్శకత కోసం తొలివిడత ఎన్నికల బాండ్ల (ELECTORAL BONDS) విక్రయం ఏయే తేదీల్లో జరిగింది ? [ఈ సంవత్సరం అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 19వ విడత ఎన్నికల బాండ్ల జారీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2022 జనవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు వీటిని 'భారతీయ స్టేట్ బ్యాంక్' (SBI) కు చెందిన 29 అధీకృత శాఖల్లో కొనుగోలు చేయవచ్చు. చివరిగా 18వ విడత బాండ్ల విక్రయం 2021 సెప్టెంబర్ 1-10 తేదీల్లో విక్రయించారు]
(ఎ) 2018 జనవరి 1-10
(బి) 2018 ఫిబ్రవరి 1-10
(సి) 2018 మార్చ్ 1-10
(డి) 2018 ఏప్రిల్ 1-10
7. భారతీయ రైల్వే బోర్డు నూతన చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి' (INDIAN RAILWAY BOARD NEW CHAIRMAN, CEO) గా ఎవరిని నియమించారు ? [2022 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు అతను ఈ పదవిలో కొనసాగనున్నారు. పదవీ విరమణ అనంతరం జూలై 1న పునఃనియమితులై 2022 డిసెంబర్ 31 వరకు కొనసాగుతారు]
(ఎ) వినయ్ కుమార్ త్రిపాఠి
(బి) గజానన్ మాల్యా
(సి) మనోజ్ జోషి
(డి) అలోక్ కన్సాల్
8. 'కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్' (KMRL) చేపట్టిన 'వాటర్ మెట్రో ప్రాజెక్ట్' (WATER METRO PROJECT) భారతదేశంలో ఎన్నోది ? [ఈ ప్రాజెక్ట్ లో భాగంగా బ్యాటరీతో నడిచే బోటును 'కే ఎం ఆర్ ఎల్' (KMRL) కు కొచ్చి షిప్ యార్డ్ అప్పగించింది. ప్రపంచంలోనే విద్యుత్తు బ్యాటరీతో నడిచే అతి పెద్దదైన ఈ బోటు గంటకు 10 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. వందమందితో ప్రయాణించే సామర్థ్యమున్న ఈ బోటు 15 నిముషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. బోటు ఛార్జింగ్ అయిపోతే దానంతటదే డీజిల్ ఆప్షన్ కు మారిపోతుంది]
(ఎ) మొదటిది
(బి) రెండోది
(సి) మూడోది
(డి) నాల్గోది
9. అమెరికా జనగణన విభాగం (UNITED STATES CENSUS BUREAU) అంచనా ప్రకారం 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా ఎంత ? [2021వ సంవత్సరంలో 74 మిలియన్లు (7 కోట్ల 40 లక్షలు) మేర పెరిగింది. జనాభా పెరుగుదల 0.9% గా నమోదయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 4.3 మంది జన్మిస్తున్నట్లు, ఇద్దరు మరణిస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో ఏడాది కాలంలో 7.07 లక్షల మేర జనాభా పెరిగింది. అమెరికాలో ప్రతి తొమ్మిది సెకన్లకు ఒకరు జన్మిస్తున్నట్లు, 11 సెకన్లకు ఒకరు మరణిస్తున్నట్లు, 130 సెకన్లకు విదేశాల నుంచి ఒకరు వలస వస్తున్నట్లు అంచనా వేసింది]
(ఎ) 7.4 బిలియన్లు (740 కోట్లు)
(బి) 7.6 బిలియన్లు (760 కోట్లు)
(సి) 7.8 బిలియన్లు (780 కోట్లు)
(డి) 7.2 బిలియన్లు (720 కోట్లు)
10. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా సెంచూరియన్ (సూపర్ స్పోర్ట్ పార్క్) లో 2021 డిసెంబర్ 30న ముగిసిన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఎన్ని పరుగుల తేడాతో విజయం సాధించింది ? [సెంచూరియన్ లో టెస్ట్ మ్యాచ్ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా భారత్ ఘనత సాధించింది.
(ఎ) 110
(బి) 111
(సి) 112
(డి) 113
కీ (KEY)
జి.కె.టెస్ట్-2 ; సంవత్సరం : 2022 (GK TEST-2 ; YEAR : 2022)
1) ఎ 2) సి 3) ఎ 4) సి 5) డి 6) సి 7) ఎ 8) ఎ 9) సి 10) డి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి