1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022 జనవరి నుంచి వృద్ధాప్య పింఛన్లను రూ. 2,250 నుంచి ఎంతకు పెంచనున్నారు ?
(ఎ) రూ. 2,500
(బి) రూ. 2,750
(సి) రూ. 3,000
(డి) రూ. 3,250
2. ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు 2021 అక్టోబర్ 29న ప్రకటించిన భారత టెన్నిస్ దిగ్గజం 'లియాండర్ పేస్' (LIANDER PAES) ఏ రాజకీయ పార్టీలో చేరాడు ? [22 ఏళ్లకే 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో పురుషుల సింగిల్స్ లో కాంస్యం నెగ్గి ఒలింపిక్స్ టెన్నిస్ లో భారత్ కు పతకం అందించిన ఏకైక ఆటగాడిగా 'లియాండర్ పేస్' కొనసాగుతున్నాడు. 1992 నుంచి 2016 వరకు వరుసగా ఏడు ఒలింపిక్స్ ల్లో పాల్గొన్న తొలి టెన్నిస్ ప్లేయర్ గా, ఏకైక భారత్ అథ్లెట్ గా అతను నిలిచాడు]
(ఎ) కాంగ్రెస్
(బి) తృణమూల్ కాంగ్రెస్
(సి) వై ఎస్ ఆర్ సి పి
(డి) డీ ఎం కె
3. 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గవర్నర్ గా 'శక్తికాంత దాస్' (SHAKTIKANTA DAS) పదవీకాలాన్ని భారత ప్రభుత్వం ఇంకా ఎన్ని సంవత్సరాలు పొడిగించింది ? [2018 డిసెంబర్ 11న ఆర్బీఐ 25వ గవర్నర్ (25th Governor of RBI) గా బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీకాలం 2021 డిసెంబర్ లో ముగియనుంది]
(ఎ) ఒక సంవత్సరం
(బి) రెండు సంవత్సరాలు
(సి) మూడు సంవత్సరాలు
(డి) నాలుగు సంవత్సరాలు
4. 'ఆర్బీఐ' (RBI) కి అత్యంత ఎక్కువకాలం (7 ఏళ్ల 197 రోజులు) గవర్నర్ గాఎవరు పని చేశారు ?
(ఎ) సర్ బెనగళ్ రామారావు
(బి) బిమల్ జలాన్
(సి) జేమ్స్ టేలర్
(డి) సి.డి. దేశ్ ముఖ్
5. 'జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్' (NCLAT) నూతన చైర్ పర్సన్ గా ఎవరిని నియమిస్తూ భారత ప్రభుత్వం 2021 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది ? [4 ఏళ్లు కానీ, ఆయనకు 70 ఏళ్ల వయస్సు వచ్చేవరకు కానీ ఈ పదవిలో కొనసాగుతారు]
(ఎ) జస్టిస్ అశోక్ భూషణ్
(బి) జస్టిస్ రామలింగం సుధాకర్
(సి) జస్టిస్ రాకేశ్ కుమార్
(డి) జస్టిస్ జాస్తి చలమేశ్వర్
6. 'ఉద్యోగుల భవిష్య నిధి' (EPF) చందాదారులకు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి పీ ఎఫ్ డిపాజిట్లపై ఎంత శాతం వడ్డీ ఇవ్వనున్నారు ?
(ఎ) 8.35%
(బి) 8.50%
(సి) 8.65%
(డి) 8.75%
7. జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన 'ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార వార్షిక నివేదిక-2020' ప్రకారం .. భారతదేశంలో రోజు కూలీలు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది ? [ఆంధ్రప్రదేశ్ లో 2019తో పోలిస్తే 2020లో నిరుద్యోగుల ఆత్మహత్యలు 67.28 శాతం, రోజు కూలీల బలవన్మరణాలు 15.41 శాతం ఎక్కువయ్యాయి]
(ఎ) 4
(బి) 5
(సి) 6
(డి) 7
8. 2021 ఏప్రిల్ 8న సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన జీవో నంబర్ ఎంత ? [2021 డిసెంబర్ 14న ఈ జీవోను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది]
(ఎ) 33
(బి) 34
(సి) 35
(డి) 36
9. అస్సాం రాష్ట్రంలో గువాహటిలోని తేయాకు వేలం కేంద్రంలో 2021 డిసెంబర్ 14న 'మనోహరి గోల్డ్' తేయాకు కిలో ఎంత ధర పలికి చరిత్ర సృష్టించింది ? [భారతదేశంలో ఏ కేంద్రంలోనైనా, ఏ వేలంలోనైనా, ఏ సంవత్సరమైనా అత్యధిక ధర పలికిన తేయాకు ఇదే]
(ఎ) రూ. 99,998
(బి) రూ. 99,999
(సి) రూ. 99,997
(డి) రూ. 99,996
10. సినీ దర్శకుడు రాహుల్ రావైల్ రచించిన 'రాజ్ కపూర్-ది మాస్టర్ ఎట్ వర్క్' (Raj Kapoor : The Master At Work) పుస్తకాన్ని దిల్లీలో 2021 డిసెంబర్ 14న ఆవిష్కరించినది ?
(ఎ) రామ్ నాథ్ కోవింద్
(బి) ఎం. వెంకయ్యనాయుడు
(సి) నరేంద్ర మోదీ
(డి) అమిత్ షా
కీ (KEY) (GK TEST-76 YEAR : 2021)
1) ఎ 2) బి 3) సి 4) ఎ 5) ఎ 6) బి 7) సి 8) సి 9) బి 10) బి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి