ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, డిసెంబర్ 2021, బుధవారం

గ్రామీణ నిరుద్యోగ యువతకు 'సీడాప్' ద్వారా వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ∣ What Is SEEDAP ?

Welcome To GK Bits In Telugu Blog

"సీడాప్" (SEEDAP) అంటే ఏమిటి ?

ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకునేలా నిరుద్యోగులకు పలు కోర్సులను ఉచితంగా అందించే సంస్థ "సీడాప్". సీడాప్ అంటే 'సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్' (SEEDAP).

ప్రస్తుతం సీడాప్ (SEEDAP) చైర్మన్ గా 'శ్యాంప్రసాదరెడ్డి' వ్యవహరిస్తున్నారు.

సీడాప్ (SEEDAP) సంస్థ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, వారి అవసరాలకు అనుగుణంగా యువతకు తర్ఫీదు ఇస్తుంది.

సీడాప్ (SEEDAP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 180 ప్రైవేట్ ఏజెన్సీలు, 14 ప్రభుత్వరంగ సంస్థల ద్వారా వివిధ రకాల కోర్సులను నిర్వహిస్తున్నది.

పది, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐ.ఐ.టి., పాలిటెక్నిక్ పూర్తి చేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు 90 నుంచి 120 రోజుల వ్యవధి కోర్సుల్లో .. ఉచిత భోజనం, వసతితో పాటు ఏకరూప దుస్తులను కూడా అందిస్తారు. శిక్షణ తర్వాత ఉద్యోగమేళా నిర్వహిస్తారు.

సీడాప్ (SEEDAP) లో ఉచిత శిక్షణకు ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ?

సెల్ ఫోన్ల ద్వారా సీడాప్ (SEEDAP) వెబ్ సైట్ (www.seedap.ap.gov.in) లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

సీడాప్ (SEEDAP) లో ఉచిత శిక్షణకు గ్రామ సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది.

ఒక్కో కోర్సులో ఒక్కో బ్యాచ్ కు 35 మందికి అవకాశం ఉంటుంది.

విశాఖపట్నం జిల్లాలో 13 శిక్షణ సంస్థలు సీడాప్ (SEEDAP) ద్వారా 15 కోర్సులను నిర్వహిస్తున్నారు.

సీడాప్ (SEEDAP) లక్ష్యం

2019-2023 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1,20,000 మందికి ఉచిత శిక్షణ ఇచ్చి, వారిలో 70 శాతం మందికి ఉద్యోగాలను కల్పించాలని సీడాప్ (SEEDAP) లక్ష్యంగా పెట్టుకుంది.

గ్రామీణ ప్రాంతాల్లో 'జాబ్ రిసోర్స్ పర్సన్' (JRP) లతో విస్తృతంగా ప్రచారం కల్పించి ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి