1. మానవ మెదడులో కంప్యూటర్ చిప్ ను చొప్పించేందుకు ఏ సంవత్సరంలో 'న్యూరాలింక్' (NEURALINK) అనే అంకుర సంస్థను ఎలన్ మస్క్ ఏర్పాటు చేశారు ? ['బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ పేస్' (BCI) సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు ఈ సంస్థ చేరుకుంది. నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్ళు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఇది సాయపడుతుంది]
(ఎ) 2015
(బి) 2016
(సి) 2017
(డి) 2018
2. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి 'సుభాష్ చంద్ర బోస్' జయంతిని పురస్కరించుకొని ఇండియా గేట్ వద్ద 28 అడుగుల ఎత్తైన గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో దాని హాలోగ్రామ్ విగ్రహాన్ని డిజిటల్ రూపంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏ తేదీన ఆవిష్కరించారు ?
(ఎ) 2022 జనవరి 20
(బి) 2022 జనవరి 21
(సి) 2022 జనవరి 22
(డి) 2022 జనవరి 23
3. కొవిడ్ నేపథ్యంలో శ్రీశైల మహాక్షేత్రంలో ఏ తేదీ నుంచి దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే జారీ చేస్తున్నారు ? [ఉచిత దర్శనం, రూ. 150 చెల్లించి శీఘ్ర దర్శనం, రూ. 300 చెల్లించి అతిశీఘ్ర దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను www.srisailadevasthanam.org ద్వారా పొందవచ్చు. భక్తులు తమ కొవిడ్ వాక్సినేషన్ ధ్రువపత్రాన్ని ఆన్లైన్ లో పొందుపరచాల్సి ఉంటుంది]
(ఎ) 2022 జనవరి 23
(బి) 2022 జనవరి 24
(సి) 2022 జనవరి 25
(డి) 2022 జనవరి 26
4. అంటార్కిటికాలో వాతావరణ మార్పుల్ని పరిశీలించేందుకు 'అంటార్కిటికా ఎక్స్ పిడిషన్-2022' (ANTARCTIC EXPEDITION-2022) పేరిట నిర్వహిస్తున్న యాత్రకు ఎంపికైన 'అభిషేక్ సొబ్బన' ఏ జిల్లాకు చెందినవాడు ? [అతనితోపాటు 45 దేశాలకు చెందిన 150 మందికి పైగా ఈ యాత్రలో పాల్గొననున్నారు. '2041 ఫౌండేషన్' వ్యవస్థాపకుడు రాబర్ట్ స్వాన్ 'ది లీడర్షిప్ ఆన్ ది ఎడ్జ్' కార్యక్రమంలో భాగంగా అంటార్కిటికా ఎక్స్ పిడిషన్ ను ఏటా నిర్వహిస్తున్నారు. 2022 మార్చ్ 17 నుంచి 28వ తేదీ మధ్య ఈ యాత్ర జరుగుతుంది]
(ఎ) వైఎస్సార్ కడప
(బి) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
(సి) తూర్పుగోదావరి
(డి) విశాఖపట్నం
5. భారతదేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తి (India's 'Tallest Man') గా పేరొందిన 'ధర్మేంద్ర ప్రతాప్ సింగ్' ఏ రాజకీయ పార్టీలో చేరారు ? [ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఎత్తు 8.1 అడుగులు]
(ఎ) కాంగ్రెస్
(బి) బీజేపీ
(సి) సమాజ్ వాదీ పార్టీ
(డి) బహుజన్ సమాజ్ పార్టీ
6. కొవిడ్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో వ్యాపిస్తుందో తెలిపేది ? [ఇది 1 కంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లుగా పరిగణిస్తారు]
(ఎ) పీ-వాల్యూ
(బి) క్యూ-వాల్యూ
(సి) ఆర్-వాల్యూ
(డి) ఎస్-వాల్యూ
7. నేతాజీ రీసెర్చ్ బ్యూరో 2022 సంవత్సరానికి నేతాజీ పురస్కారాన్ని (NETAJI AWARD 2022) ఎవరికి ప్రదానం చేసింది ?
(ఎ) షింజో అబే
(బి) జో బైడెన్
(సి) వ్లాదిమిర్ పుతిన్
(డి) బరాక్ ఒబామా
8. ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ 'బచేంద్రిపాల్' సారథ్యంలో 50 ఏళ్లు పైబడిన పదిమంది మహిళల జట్టుతో అరుణాచల్ ప్రదేశ్ నుంచి లద్దాఖ్ వరకు హిమాలయ పర్వతశ్రేణుల మీదుగా చేపట్టనున్న సుదీర్ఘ యాత్ర ఏ తేదీన ప్రారంభం కానుంది ? [ఈ యాత్ర 37 పర్వత మార్గాల గుండా 5 నెలల్లో 4,625 కిలోమీటర్లు సాగుతుంది. 'టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్', కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 'ఫిట్ ఇండియా' (FIT INDIA) బ్యానరుపై ఈ యాత్రను నిర్వహిస్తున్నారు]
(ఎ) 2022 మార్చ్ 6
(బి) 2022 మార్చ్ 7
(సి) 2022 మార్చ్ 8
(డి) 2022 మార్చ్ 9
9. భారతదేశంలో ఏ తేదీన 'జాతీయ బాలికా దినోత్సవం' ను జరుపుతారు ? [భారతీయ సమాజంలో బాలికల విషయంలో నెలకొన్న దుర్విచక్షణ పట్ల అందరినీ చైతన్యవంతం చేసేందుకు 2008లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'జాతీయ బాలికా దినోత్సవం' (NATIONAL GIRL CHILD DAY) ను ప్రారంభించారు]
(ఎ) 2022 జనవరి 21
(బి) 2022 జనవరి 22
(సి) 2022 జనవరి 23
(డి) 2022 జనవరి 24
10. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి (GDP Growth in 2022-23) ఎంత శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని 2021-22 ఆర్ధిక సర్వేలో అంచనా వేయనున్నారు ?
(ఎ) 7%
(బి) 8%
(సి) 9%
(డి) 10%
కీ (KEY)
జి.కె.టెస్ట్-11 ; సంవత్సరం : 2022 (GK TEST-11 ; YEAR : 2022)
1) సి 2) డి 3) సి 4) బి 5) సి 6) సి 7) ఎ 8) సి 9) డి 10) సి
E&OE. (Errors and Omissions Expected)