1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు' (MSME⇒ MICRO, SMALL and MEDIUM ENTERPRISES) కు ప్రకటించిన రూ. 1,110 కోట్ల "రీస్టార్ట్" (ReSTART) ప్యాకేజీ లో భాగంగా, ప్రభుత్వ విభాగాల్లో వినియోగించే 360 రకాల వస్తువుల్లో ... ఎంత శాతం కచ్చితంగా (MSME) ల నుంచే కొనుగోలు చేయాలి ?
(ఎ) 25%
(బి) 30%
(సి) 35%
(డి) 40%
2. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీట నొక్కి ... 10,641 "వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు" (RBK ⇒ RAITU BHAROSA KENDRA) ప్రారంభించిన తేదీ ?
(ఎ) 2020 మే 28
(బి) 2020 మే 29
(సి) 2020 మే 30
(డి) 2020 మే 31
3. మనదేశ ప్రస్తుత 'జాతీయ భద్రతా సలహాదారు' ?
(ఎ) సుభాష్ గార్గ్
(బి) జై శంకర్
(సి) జి.సతీష్ రెడ్డి
(డి) అజిత్ డోభాల్
4. 'జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు' (NABARD) నూతన చైర్మన్ గా 2020 మే 27 న బాధ్యతలు స్వీకరించిన తెలుగు వ్యక్తి ?
(ఎ) పుట్టా లక్ష్మీనారాయణ
(బి) చింతల గోవిందరాజులు
(సి) దువ్వూరి సుబ్బారావు
(డి) సర్రాజు రాయవరపు
5. భారత్ లోని "కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్" లను తమ దేశానికి చెందినవిగా చూపిస్తూ నూతన రాజకీయ చిత్రపటాన్ని రూపొందించిన మన పొరుగు దేశం ?
(ఎ) నేపాల్
(బి) భూటాన్
(సి) చైనా
(డి) మయన్మార్
6. 'ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్' పూర్తిస్థాయి సభ్యులకు నెలకు ఎంత వేతనం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? (నెలకు రూ. 40 వేల ఇంటి అద్దె కూడా ఇస్తారు. తాత్కాలిక సభ్యులు సమావేశాలకు హాజరైతే రూ. 5 వేల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు)
(ఎ) రూ 1.25 లక్షలు
(బి) రూ 1.50 లక్షలు
(సి) రూ 1.75 లక్షలు
(డి) రూ 2.00 లక్షలు
7. బియ్యం రేషను కార్డు కలిగిన వారికి ప్రత్యేకంగా ఆదాయ ధ్రువపత్రం అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది ?
(ఎ) 2020 జూలై 25
(బి) 2020 జూలై 24
(సి) 2020 జూలై 23
(డి) 2020 జూలై 22
8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం కార్డు లేనివారు తీసుకొనే 'ఆదాయ ధ్రువపత్రం' కాలపరిమితి ఏడాది నుంచి ఎన్నేళ్ల వరకు పొడిగించారు ?
(ఎ) 2 సంవత్సరాలు
(బి) 3 సంవత్సరాలు
(సి) 4 సంవత్సరాలు
(డి) 5 సంవత్సరాలు
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, పాఠశాలలు పునః ప్రారంభం కానున్న తేదీ ?
(ఎ) 2020 ఆగస్టు 5
(బి) 2020 సెప్టెంబర్ 5
(సి) 2020 అక్టోబర్ 5
(డి) 2020 నవంబర్ 5
10. 'అయోధ్య' లో 2020 ఆగస్టు 5 న ప్రారంభం కానున్న రామమందిర నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనకు బీహార్ లోని 'గయా ధామ్' నుంచి తీసుకురానున్న వెండి ఇటుక బరువు ?
(ఎ) 1000 గ్రాములు
(బి) 1250 గ్రాములు
(సి) 1500 గ్రాములు
(డి) 1750 గ్రాములు
కీ (GK TEST-55 DATE : 2020 JULY 27)
1) ఎ 2) సి 3) డి 4) బి 5) ఎ 6) సి 7) ఎ 8) సి 9) బి 10) బిAll the best by www.gkbitsintelugu.blogspot.com