ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, జులై 2020, ఆదివారం

GK TEST-54

1. పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలలో "నాడు-నేడు" కార్యక్రమం ద్వారా ఎన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం అధికారులను ఆదేశించారు ?
(ఎ) 5
(బి) 10
(సి) 15
(డి) 20

2. 2018 ఆసియా క్రీడల్లో (జకార్తా) 4 x 400 మీటర్ల మిక్స్డ్ (MIXED) రిలే పరుగులో భారత జట్టు సాధించిన రజత పతకం బంగారమైంది. ఈ క్రీడల్లో మొదట స్వర్ణం గెలిచిన బృందంలోని ఓ అథ్లెట్ (కెమి అడెకోయ) డోపింగ్ లో పట్టుబడడంతో రెండో స్థానంలో నిలిచిన భారత్ కు ఆ పసిడి పతకం దక్కింది. డోపింగ్ అథ్లెట్ ఉన్న ఆ బృందం ఏ దేశానికి చెందినది ? (మొత్తమ్మీద జకార్తా (2018) ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 20. ఇందులో ఎనిమిది స్వర్ణాలు, తొమ్మిది రజతాలు ఉన్నాయి)
(ఎ) సౌదీ అరేబియా
(బి) కువైట్
(సి) ఖతార్
(డి) బహ్రెయిన్

3. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విలువ ఉన్న 50 కంపెనీల జాబితాలో తొలి ఐదు స్థానాలలో ఉన్న కంపెనీలు వరుసగా ... ? (స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం రూపొందించిన ఈ జాబితాలో భారత దేశానికి చెందిన 'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' (RIL) 48 వ స్థానంలో నిలిచింది)
(ఎ) ఆపిల్, మైక్రోసాఫ్ట్, సౌదీ అరాంకో, ఆల్ఫాబెట్, అమెజాన్
(బి) మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఆపిల్, సౌదీ అరాంకో
(సి) అమెజాన్, సౌదీ అరాంకో, ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్
(డి) సౌదీ అరాంకో, ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్

4. రూ. 3,054 కోట్ల వ్యయంతో తలపెట్టిన నీటి సరఫరా ప్రాజెక్ట్ కు దిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2020 జూలై 23 న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ను ఏ రాష్ట్రంలో చేపడుతున్నారు ?
(ఎ) మేఘాలయ
(బి) మణిపూర్
(సి) మిజోరాం
(డి) త్రిపుర

5. "మంగళ్ యాన్" ఉపగ్రహాన్ని విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టడంద్వారా ఆ ఘనతను సాధించిన తొలి ఆసియా దేశంగా భారత్ అవతరించింది. ఈ ప్రయోగం జరిగిన సంవత్సరం ?
(ఎ) 2011
(బి) 2014
(సి) 2017
(డి) 2019



6. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం నడుస్తున్న కృష్ణా జల వివాదానికి సంబంధించిన తుది నివేదికను సమర్పించేందుకు 'కృష్ణా ట్రైబ్యునల్' కు 2021 ఆగస్టు వరకు సమయం ఇచ్చింది. దీంతో ఈ ట్రైబ్యునల్ కాలపరిమితి ఎన్నిసార్లు పొడిగించినట్లయింది ?
(ఎ) 5 సార్లు
(బి) 10 సార్లు
(సి) 15 సార్లు
(డి) 20 సార్లు

7. అంగారకుడి మీదకు చైనా తొలిసారిగా "తియాన్వేన్ - 1" అనే వ్యోమనౌక ను 'లాంగ్ మార్చ్ - 5' రాకెట్ ద్వారా 'ఆర్బిటర్, ల్యాండర్, రోవర్' లను విజయవంతంగా ప్రయోగించిన తేదీ ? (తొలి ప్రయత్నంలోనే అరుణ గ్రహం వద్దకు "ఆర్బిటర్, ల్యాండర్, రోవర్" లను పంపడం ఇదే మొదటిసారి)
(ఎ) 2020 జూలై 21
(బి) 2020 జూలై 22
(సి) 2020 జూలై 23
(డి) 2020 జూలై 24

8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని "అర్చకులు, ఇమామ్ లు, మౌజమ్ లు, పాస్టర్లు" కు రూ. 5 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ఎప్పుడు విడుదల చేశారు ?
(ఎ) 2020 మే 26
(బి) 2020 మే 27
(సి) 2020 మే 28
(డి) 2020 మే 29

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర "పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్' ప్రస్తుత చైర్మన్ ?
(ఎ) జస్టిస్ కాంతారావు
(బి) జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్
(సి) జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ
(డి) జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి

10. భూటాన్ లోని 'డోక్లామ్' లో 73 రోజులపాటు భారత్, చైనాల మధ్య "సైనిక ప్రతిష్ఠంభన" జరిగిన సంవత్సరం ? (అయితే రాజకీయ, దౌత్య చర్చల ద్వారా ఈ వివాదం పరిష్కారమైంది)
(ఎ) 2014
(బి) 2015
(సి) 2016
(డి) 2017



కీ (GK TEST-54 DATE : 2020 JULY 26)
1) బి 2) డి 3) డి 4) బి 5) బి 6) సి 7) సి 8) ఎ 9) ఎ 10) డి

All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి