1. "జగమంతా వనం ... ఆరోగ్యంతో మనం" అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 జూలై 22 న నిర్వహించిన వన మహోత్సవం ఎన్నవది ?
(ఎ) 71
(బి) 72
(సి) 73
(డి) 74
2. మనదేశంలో పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెయిరీ రంగ అభివృద్ధిపై 'ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య', అమూల్ (AMUL) సంస్థల మధ్య రాష్ట్ర సీఎం సమక్షంలో ఒప్పందం కుదిరిన తేదీ ?
(ఎ) 2020 జూలై 20
(బి) 2020 జూలై 21
(సి) 2020 జూలై 22
(డి) 2020 జూలై 23
4. ఏ తేదీని "అంతర్జాతీయ చెస్ దినోత్సవం" గా ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రకటించింది ? (1924 వ సంవత్సరంలో 'అంతర్జాతీయ చెస్ సమాఖ్య' (FIDE) ఏర్పడింది. 'ఫిడే' (FIDE) ఆవిర్భావ తేదీని 'అంతర్జాతీయ చెస్ దినోత్సవం' గా ఐరాస 2019 లో ప్రకటించింది)
(ఎ) జూలై 20
(బి) జూలై 21
(సి) జూలై 22
(డి) జూలై 23
5. భారతదేశం గర్వించే గణిత శాస్త్రవేత్త, హ్యూమన్ కంప్యూటర్ గా పేరుగాంచిన శకుంతలాదేవి జీవితకథతో తీసిన "శకుంతలాదేవి" చిత్రంలో కీలక పాత్రధారి ?
(ఎ) రాధికా ఆప్టే
(బి) కీర్తి సురేష్
(సి) ప్రియమణి
(డి) విద్యాబాలన్
6. మనదేశంలో 'కరోనా' చికిత్స కోసం 'సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు' ప్రవేశపెట్టిన "కరోనా కవచ్" (CORONA KAVACH) బీమా పాలసీ ఏ తేదీ నుండి అందుబాటులోకి వచ్చింది ? (కనీసం రూ. 50 వేల నుంచి గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకూ ఈ పాలసీ ని తీసుకోవచ్చు)
(ఎ) 2020 జూన్ 10
(బి) 2020 జూలై 10
(సి) 2020 ఏప్రిల్ 10
(డి) 2020 మే 10
7. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో దిగ్గజ నేతగా వెలుగొందిన "లాల్జీ టాండన్" 2020 జూలై 21 న అనారోగ్యంతో కన్నుమూశారు. అతను మరణించే ముందు ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసారు ?
(ఎ) మధ్యప్రదేశ్
(బి) రాజస్థాన్
(సి) ఉత్తరప్రదేశ్
(డి) హిమాచల్ ప్రదేశ్
8. కడప లో 'వైఎస్సార్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో దివ్యాంగులైన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న పాఠశాల పేరు ?
(ఎ) స్పూర్థి
(బి) భారతి
(సి) సరస్వతి
(డి) విజేత
9. పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు ప్రస్తుతమున్న 'జిల్లా విద్యాధికారి' (DEO ⇒ DISTRICT EDUCATION OFFICER) పోస్టుల స్థాయిని ఏ స్థాయికి పెంచుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి 'ఆదిమూలపు సురేష్' తెలిపారు ?
(ఎ) సంయుక్త సంచాలకులు
(బి) సంచాలకులు
(సి) ప్రాంతీయ సంచాలకులు
(డి) జిల్లా విద్యా సంచాలకులు
10. 'వినియోగదారుల హక్కుల చట్టం - 1986' స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన "వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం - 2019" (THE CONSUMER PROTECTION ACT, 2019) ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది ?
(ఎ) 2020 జూలై 20
(బి) 2020 జూలై 21
(సి) 2020 జూలై 22
(డి) 2020 జూలై 23
All the best by www.gkbitsintelugu.blogspot.com
కీ (GK TEST-52 DATE : 2020 JULY 23)
1) ఎ 2) డి 3) బి 4) ఎ 5) డి 6) బి 7) ఎ 8) డి 9) ఎ 10) ఎAll the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి