1. నమ్మకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునే బ్యాంకు సిబ్బందిని రక్షించడానికి వీలుగా ఎంత మొత్తం వరకు ఉన్న 'ఎన్ పి ఏ' (NON PERFORMING ASSETS) ఖాతాల కోసం ఏకరీతి సిబ్బంది జవాబుదారీ నిబంధనల్ని భారత ఆర్ధిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది ? [2022 ఏప్రిల్ 1 నుంచి నిరర్ధక ఆస్తులుగా మారే ఖాతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి]
(ఎ) రూ. 25 కోట్లు
(బి) రూ. 50 కోట్లు
(సి) రూ. 75 కోట్లు
(డి) రూ. 100 కోట్లు
2. 'అటల్ పెన్షన్ యోజన' (APY) పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది ?
(ఎ) 2015 ఏప్రిల్ 1
(బి) 2015 మే 1
(సి) 2015 జూన్ 1
(డి) 2015 జూలై 1
3. జే ఎన్ టీ యూ కాకినాడ ఉపకులపతి (JNTUK-VC) గా 31 అక్టోబర్ 2021న బాధ్యతలు స్వీకరించినది ?
(ఎ) ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి
(బి) ఆచార్య కె.సి. రెడ్డి
(సి) ఆచార్య జి.వి.ఆర్. ప్రసాదరాజు
(డి) డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి
4. భారతదేశ భద్రత కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'ప్రాజెక్ట్ 15బి' (Project 15B) పేరిట నిర్మించిన తొలినౌక భారత నౌకాదళంలో చేరిన తేదీ ? [పీ15బి పేరిట నాలుగు నౌకల నిర్మాణానికి మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ (ముంబయి) సంస్థ గతంలోనే ఆర్డర్లు దక్కించుకుంది. ఈ నౌక 163 మీటర్ల పొడవుతో 30 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించగలదు]
(ఎ) 2021 అక్టోబర్ 25
(బి) 2021 అక్టోబర్ 26
(సి) 2021 అక్టోబర్ 27
(డి) 2021 అక్టోబర్ 28
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అవసరమైనవారు రీచ్ లు, డిపోలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ లో బుక్ చేసుకునేందుకు వీలుగా (Online Sand Booking in Andhra Pradesh) గనుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేస్తున్న 'జేపీ పవర్ వెంచర్స్' (JP POWER VENTURES) సంస్థ .. ఆన్లైన్ పోర్టల్ (www.andhrasand.com) ను ప్రారంభించిన తేదీ ? [ఇసుక బుకింగ్, ఆన్ లైన్ లో సమస్యలు తదితరాలపై సంప్రదించేందుకు 9700009944 ఫోన్ నంబర్ ను అందుబాటులోకి తెచ్చారు]
(ఎ) 2021 నవంబర్ 1
(బి) 2021 అక్టోబర్ 31
(సి) 2021 అక్టోబర్ 30
(డి) 2021 అక్టోబర్ 29
6. వచ్చే మూడు సంవత్సరాలలో జి-20 సదస్సులు (G20-SUMMITS) ఏయే దేశాల్లో జరగనున్నాయి ?
(ఎ) 2022-ఇండోనేసియా, 2023-భారత్, 2024-బ్రెజిల్
(బి) 2022-భారత్, 2023-బ్రెజిల్, 2024-ఇండోనేసియా
(సి) 2022-బ్రెజిల్, 2023-ఇండోనేసియా, 2024-భారత్
(డి) 2022-ఇటలీ, 2023-బ్రెజిల్, 2024-థాయిలాండ్
7. సుప్రసిద్ధ 'ట్రెవీ ఫౌంటైన్' (TREVI FOUNTAIN) ఏ నగరంలో ఉంది ? [ఈ ఫౌంటైన్ లోని నీళ్లలోకి భుజం మీదుగా నాణెం విసిరితే మళ్లీ ఈ ఫౌంటైన్ ఉన్న నగరానికి వెళ్తారని ప్రజల నమ్మకం]
(ఎ) జకార్తా
(బి) రోమ్
(సి) పారిస్
(డి) ఆమ్ స్టర్ డామ్
8. రెండు రోజులపాటు 'రోమ్' లో జరిగిన జి-20 సదస్సు 2021 అక్టోబర్ 31న ముగిసింది. జీవ వైవిధ్య ముప్పును ఏ సంవత్సరం నాటికి తిరోగమనం పట్టించే చర్యల్ని బలోపేతం చేయాలని ఈ సదస్సులో తీర్మానించారు ?
(ఎ) 2025
(బి) 2030
(సి) 2035
(డి) 2040
9. 2021 అక్టోబర్ 31న ప్రారంభమైన 'ఐరాస వాతావరణ సదస్సు' (COP26) కార్యక్రమానికి బ్రిటన్ లోని ఏ నగరం వేదికైంది ? [వాతావరణ సదస్సు లాంఛనంగా ప్రారంభమైనట్లు 'కాప్26' అధ్యక్షుడు, బ్రిటన్ మంత్రి 'అలోక్ శర్మ' ప్రకటించారు. 2021 నవంబర్ 12 వరకూ జరిగే ఈ సదస్సులో 200 దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొంటున్నారు]
(ఎ) బర్మింగ్ హామ్
(బి) లండన్
(సి) బ్రిస్టల్
(డి) గ్లాస్గో
10. అంటార్కిటికాలో 100 కిలోమీటర్ల పొడవైన ఒక హిమానీనదానికి 'గ్లాస్గో గ్లేషియర్' (GLASGOW GLACIER) అని బ్రిటన్ లోని ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేరు పెట్టారు ?
(ఎ) ఆక్స్ ఫర్డ్
(బి) కేంబ్రిడ్జ్
(సి) లీడ్స్
(డి) ఎడిన్ బర్గ్
కీ (KEY) (GK TEST-75 YEAR : 2021)
1) బి 2) సి 3) సి 4) డి 5) బి 6) ఎ 7) బి 8) బి 9) డి 10) సి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి