ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, అక్టోబర్ 2021, శనివారం

జి.కె.టెస్ట్ : 74 GK TEST-74. YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

1. 2022-25 మధ్య దేశంలోని ఎన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించి రూ. 20,782 కోట్లు రాబట్టుకోవాలని నిర్ణయించినట్లు 'నేషనల్ మానిటైజేషన్ పాలసీ' (NATIONAL MONITIZATION POLICY) లో భారత ప్రభుత్వం ప్రకటించింది ? [ప్రస్తుతం 'ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (AAI) చేతిలో 24 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 10 కస్టమ్స్ విమానాశ్రయాలు, 103 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి]
(ఎ) 5  
(బి) 15   
(సి) 25   
(డి) 35  

2. టెస్లా (Tesla, Inc.) కంపెనీ తొలిసారిగా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువను చేరిన తేదీ ? [లక్ష కోట్ల డాలర్ల క్లబ్ లో ఇప్పటికే యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, సౌదీ ఆరామ్ కో, ఆల్ఫాబెట్ లు ఉన్నాయి] 
(ఎ) 2021 అక్టోబర్ 25  
(బి) 2021 అక్టోబర్ 26   
(సి) 2021 అక్టోబర్ 27   
(డి) 2021 అక్టోబర్ 28  

3. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 'సార్థక్' (SARTHAK) అనే నౌక 'భారత తీర రక్షక దళం' (INDIAN COAST GUARD) లో చేరిన తేదీ ?
SARTHAK SHIP
సార్థక్

     
(ఎ) 2021 అక్టోబర్ 26   
(బి) 2021 అక్టోబర్ 27 
(సి) 2021 అక్టోబర్ 28 
(డి) 2021 అక్టోబర్ 29 

4. భారతదేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 'పెగాసస్ స్పైవేర్' (PEGASUS SPYWARE) వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖుల ఫోన్లపై నిఘా, వ్యక్తిగత గోప్యతకు భంగం తదితర ఆరోపణలపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఎవరి పర్యవేక్షణలో ఈ కమిటీ పని చేస్తుంది ? [ఇజ్రాయెల్ కు చెందిన 'ఎన్ ఎస్ ఓ' (NSO) గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా దేశంలోని రాజకీయనాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా ఉంచినందున ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ న్యాయవాది ఎం.ఎల్.శర్మ, ప్రముఖ పాత్రికేయులు ఎన్. రామ్ తదితరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను విచారించిన ధర్మాసనం 2021 అక్టోబర్ 27న తన నిర్ణయాన్ని ప్రకటించింది]
(ఎ) జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ 
(బి) జస్టిస్ హిమాకోహ్లి  
(సి) జస్టిస్ జాస్తి చలమేశ్వర్ 
(డి) జస్టిస్ సూర్యకాంత్ 

5. రాజమండ్రి నుంచి పాపికొండల వరకు పర్యాటక బోటు (TOURIST BOAT) లో వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎంత ? [7 నవంబర్ 2021 నుంచి బోటు యాత్ర (BOAT TRIP TO PAPIKONDALU) ప్రారంభమవుతుందని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి పత్రికాముఖంగా ప్రకటించారు]   
(ఎ) రూ. 750    
(బి) రూ. 1,250  
(సి) రూ. 1,750  
(డి) రూ. 2,250

6. భారత సైన్యం, వాయుసేన కలిసి జమ్మూ కాశ్మిర్ లోని 'బద్గాం' (BUDGAM) కు స్వేచ్ఛ కల్పించిన తేదీ ?    
(ఎ) 1947 అక్టోబర్ 26 
(బి) 1947 అక్టోబర్ 27 
(సి) 1947 అక్టోబర్ 28 
(డి) 1947 అక్టోబర్ 29 

7. 'డీ ఆర్ ఓ' (DRO) నేతృత్వంలోని 'డిస్ట్రిక్ట్ లెవెల్ కొవిడ్ డెత్ అసెర్టింగ్ కమిటీ' (District Level Covid Death Asserting Committee) నివేదించిన 14 రోజుల్లోగా నష్టపరిహారం కింద దరఖాస్తు చేసిన వారికి ఎంత మొత్తాన్ని పరిహారంగా అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది ? [కరోనా వైరస్ సోకినట్లు తేలినప్పటినుంచి 30 రోజుల్లో సంభవించిన మరణాలను కొవిడ్ మరణాలుగానే పరిగణించాలని అధికారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది] 
(ఎ) రూ. 50,000 
(బి) రూ. 1,00,000 
(సి) రూ. 1,50,000 
(డి) రూ. 2,00,000 

8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డులు, పింఛను కార్డుల దరఖాస్తుల్ని ఎన్ని రోజుల్లోగా పరిశీలించి అర్హులో కాదో నిర్ధారిస్తారు ? [ఇళ్ల పట్టాల దరఖాస్తుల్ని 90 రోజుల్లోగా పరిశీలించి అర్హులో కాదో నిర్ధారిస్తారు. కొత్తగా ఎంపిక చేసినవారికి ఏటా డిసెంబర్, జూన్ నెలల్లో పథకం మంజూరు చేసి నిధులు విడుదల చేస్తారు]
(ఎ) 7   
(బి) 14  
(సి) 21 
(డి) 28  

9. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ లలో 'ఎన్ ఆర్ ఐ' (NRI) కోటా కింద ఉన్న సీట్ల సంఖ్య ? [ఈ సీట్ల కోసం విద్యార్థులు వర్సిటీ వెబ్ సైట్ www.rgukt.in లో 2021 నవంబర్ 20లోగా పేర్లు నమోదు చేసుకోవాలి. ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయకున్నా ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులే]
(ఎ) 100 
(బి) 200 
(సి) 300  
(డి) 400  

10. '2021 ఆసియాన్ సదస్సు' (2021 ASEAN SUMMIT) కు నేతృత్వం వహించిన దేశం ? [18వ ఇండియా-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు]
(ఎ) ఇండోనేషియా 
(బి) థాయిలాండ్  
(సి) మయన్మార్ 
(డి) బ్రూనై              

కీ (KEY) (GK TEST-74 YEAR : 2021)
1) సి 2) ఎ 3) సి 4) ఎ 5) బి 6) బి 7) ఎ 8) సి 9) బి 10) డి   

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com